< ద్వితీయోపదేశకాండమ 10 >
1 ౧ అప్పుడు యెహోవా “నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో.
Того ча́су сказав був до мене Господь: „Ви́теши собі дві камі́нні табли́ці, як перші, та й вийди до Мене на го́ру, і зроби собі дерев'яного ковче́га.
2 ౨ నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు.
А Я напишу на тих табли́цях слова́, що були на перших табли́цях, які ти побив, і покладеш їх у ковче́зі.“
3 ౩ కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను.
І зробив я ковче́га з акаці́йного дерева, і витесав я дві камінні табли́ці, як перші, та й зійшов на го́ру, а оби́дві табли́ці в руці моїй.
4 ౪ మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి
І Він написав на тих табли́цях, як перше письмо́, Десять Заповідей, що Господь говорив був до вас на горі з сере́дини огню в день зборів. І Господь дав їх мені.
5 ౫ నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.
І обернувся я, та й зійшов із гори, і поклав ті табли́ці, що зробив, до ковче́гу. І були вони там, як наказав був Господь.
6 ౬ ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.
А Ізраїлеві сини рушили з Беероту Яаканових синів до Мосери. Там помер Ааро́н, і був там похо́ваний, а священиком став замість нього його син Елеаза́р.
7 ౭ అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు.
А звідти рушили до Ґудґоди, а з Ґудґоди до Йотвати, до кра́ю водних потоків.
8 ౮ అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు.
Того ча́су Господь відділив був Левієве пле́м'я, щоб носило ковчега Господнього заповіту, щоб стояло перед Господнім лицем, щоб служило Йому, і щоб благословля́ло Його Йменням аж до цього дня.
9 ౯ అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.
Тому́ не було Левієві частки та спа́дку з братами. Господь — Він спа́дщина його, як промовляв був Господь, Бог твій, йому.
10 ౧౦ ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు.
А я стояв на горі, як за тих перших днів, сорок день і сорок ноче́й. І вислухав Господь мене також цього ра́зу, — не захотів Господь погубити тебе.
11 ౧౧ యెహోవా నాతో “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు” అని చెప్పాడు.
І сказав був до мене Господь: „Устань, іди в по́хід перед народом. І вві́йдуть вони, і посядуть той край, що Я присягнув був їхнім батькам дати їм“
12 ౧౨ కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.
А тепер, Ізра́їлю, чого жадає від тебе Господь, Бог твій? Тільки того, щоб боятися Господа, Бога твого, ходити всіма́ Його доро́гами, і любити Його, і служити Господе́ві, Богу твоєму, усім серцем своїм і всією душею своєю,
13 ౧౩ మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?
виконувати заповіді Господа та постанови Його, що я наказую тобі сьогодні, щоб було тобі добре.
14 ౧౪ చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.
Тож належить Господе́ві, Богу твоєму, небо, і небо небе́с, земля й усе, що на ній.
15 ౧౫ అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.
Тільки батьків твоїх уподо́бав Господь, щоб любити їх, і вибрав вас, їхнє насіння по них, зо всіх наро́дів, як ба́чиш цього дня.
16 ౧౬ కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి.
І ви обріжете кра́йню плоть свого серця, а шиї своєї не зробите більше твердо́ю,
17 ౧౭ ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు.
бо Господь, Бог ваш — Він Бог богі́в і Пан панів, Бог великий, сильний та страшни́й, що не подивиться на обличчя, і пі́дкупу не ві́зьме.
18 ౧౮ ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.
Він чинить суд сироті та вдові, і любить прихо́дька, щоб дати йому хліба й одежу.
19 ౧౯ మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.
І будете ви любити прихо́дька, бо прихо́дьками були ви самі в єгипетськім кра́ї.
20 ౨౦ మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి.
Господа, Бога свого, будеш любити, Йому будеш служити, і до Нього будеш горну́тись, а Йменням Його будеш присягати.
21 ౨౧ ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.
Він хвала́ твоя, і Він Бог твій, що з тобою зробив був великі та страшні́ діла́, які бачили очі твої.
22 ౨౨ మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.
Сімдесятьма́ душами зійшли були твої батьки до Єгипту, а тепер, щодо численности, Господь, Бог твій, зробив тебе, як зо́рі на небі!