< దానియేలు 7 >

1 బబులోను రాజు బెల్షస్సరు పరిపాలన మొదటి సంవత్సరంలో దానియేలుకు దర్శనాలు కలిగాయి. అతడు తన మంచం మీద పండుకుని ఒక కల కన్నాడు. ఆ కల సంగతిని సంక్షిప్తంగా వివరించి రాశాడు.
बाबेल के राजा बैलशत्सर के शासन के पहले साल में, दानिएल जब अपने पलंग पर लेटा हुआ था, तो उसने एक स्वप्न तथा मन में दर्शन देखे. उसने अपने स्वप्न के सारांश को लिख लिया.
2 దానియేలు వివరించి చెప్పిన దేమిటంటే రాత్రి వేళ దర్శనాలు కలిగి నప్పుడు నేను తేరి చూస్తుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి వీయడం నాకు కనబడింది.
दानिएल ने कहा: “रात में मैंने अपने दर्शन में देखा कि आकाश से चारों दिशाओं से महासागर पर मंथन हवा चलने लगी.
3 అప్పుడు నాలుగు గొప్ప జంతువులు మహా సముద్రంలో నుండి ఎక్కి వచ్చాయి. ఆ జంతువులు ఒక దానికొకటి వేరుగా ఉన్నాయి.
तब चार बड़े-बड़े पशु समुद्र से निकले, और ये एक दूसरे से भिन्‍न थे.
4 మొదటిది సింహం లాటిది. దానికి గరుడ పక్షి రెక్కలవంటి రెక్కలున్నాయి. నేను చూస్తుండగా దాని రెక్కలు తీసేశారు. అందువల్ల అది మనిషి లాగా కాళ్ళతో నేలపై నిలబడింది. మనిషి మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడింది.
“पहला पशु सिंह के समान था, जिसके गरुड़ के समान पंख थे. मेरे देखते ही देखते उसके पंखों को नोच डाला गया और उसे भूमि पर से उठाकर मनुष्य के समान दो पैरों पर खड़ा किया गया, और उसे एक मनुष्य का मन दिया गया.
5 రెండవ జంతువు ఎలుగుబంటి లాటిది. అది ఒక పక్కకి తిరిగి పడుకుని తన నోట్లో పళ్ళ మధ్య మూడు ప్రక్కటెముకలను కరిచి పట్టుకుని ఉంది. కొందరు “లే, బాగా మాంసం తిను” అని దానితో చెప్పారు.
“उसके बाद मैंने दूसरे पशु को देखा, जो भालू के समान दिखता था, उसे उसके एक तरफ से उठाया गया, और उसके मुंह में उसके दांतों के बीच तीन पसलियां थी. उसे कहा गया, ‘उठ और संतुष्ट होते तक मांस खा!’
6 అటు తరువాత చిరుతపులివంటి మరొక జంతువును చూశాను. దాని వీపు మీద పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలున్నాయి. దానికి నాలుగు తలలున్నాయి. దానికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది.
“उसके बाद, मैंने एक दूसरे पशु को देखा, जो चीते के समान दिखता था. और उसकी पीठ पर पक्षी के समान चार पंख थे. इस पशु के चार सिर थे, और उसे शासन करने का अधिकार दिया गया.
7 తరువాత రాత్రి వేళ నాకు దర్శనాలు కలిగినప్పుడు నేను చూస్తుంటే, ఘోరమైన, భీకరమైన, మహా బలిష్ఠమైన నాలుగవ జంతువొకటి కనబడింది. అది తనకు ముందున్న ఇతర జంతువులకు భిన్నమైనది. దానికి పెద్ద ఇనుప దంతాలు, పది కొమ్ములు ఉన్నాయి. అది సమస్తాన్నీ భక్షిస్తూ తుత్తునియలు చేస్తూ మిగిలిన దాన్ని కాళ్లతో తొక్కేస్తూ ఉంది.
“उसके बाद, रात को मैंने अपने दर्शन में एक चौथे पशु को देखा, जो भयंकर, डरावना और बहुत शक्तिशाली था. इसके बड़े-बड़े लोहे के दांत थे. वह अपने शिकार को दबाकर खा जाता था और जो कुछ बच जाता था, उसे पांव से कुचल डालता था. वह इसके पहले के सब पशुओं से भिन्‍न था, और इसके दस सींग थे.
8 నేను దాని కొమ్ములను కనిపెట్టి చూస్తుంటే ఒక చిన్న కొమ్ము వాటి మధ్య మొలిచింది. దానికి చోటు ఇవ్వడానికి ఆ కొమ్ముల్లో మూడింటిని పీకి వేశారు. ఈ కొమ్ముకు మనిషి కళ్ళ వంటి కళ్ళు, గర్వంగా మాటలాడే నోరు ఉన్నాయి.
“जब मैं इन सींगों के बारे में सोच ही रहा था, कि मैंने देखा उन सींगों के बीच एक और छोटा सींग था, और इस सींग के निकलने से वहां पहले के तीन सींग अपने जड़ से उखड़ गए. मैंने देखा कि इस सींग में मनुष्य के समान आंखें थी और एक मुंह भी था जो घमंड से भरी बातें कर रहा था.
9 నేను ఇంకా చూస్తూ ఉండగా, ఇంకా సింహాసనాలను వేయడం చూశాను. మహా వృద్ధుడు కూర్చున్నాడు. ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా, ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది. దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి.
“जैसे कि मैंने देखा, “वहां सिंहासन रखे गए, और वह अति प्राचीन अपने आसन पर बैठा. उसके कपड़े हिम के समान सफेद थे; उसके सिर के बाल शुद्ध ऊन की तरह थे. उसका सिंहासन आग से ज्वालामय था, और सिंहासन के पहियों से लपटें निकल रही थी.
10 ౧౦ అగ్నిప్రవాహం ఒకటి ఆయన దగ్గర నుండి ప్రవహిస్తూ ఉంది. వేవేలకొలది ఆయనకు పరిచారకులున్నారు. కోట్లకొలది మనుషులు ఆయన ఎదుట నిలబడ్డారు. తీర్పు తీర్చడానికి గ్రంథాలు తెరిచారు.
उसके सामने से एक आग का दरिया निकलकर बह रहा था. हजारों हजार लोग उसकी सेवा में लगे थे; लाखों लोग उसके सामने खड़े थे. तब न्यायाधीश बैठ गये, और पुस्तकें खोली गईं.
11 ౧౧ అప్పుడు నేను చూస్తుంటే, ఆ కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడింది. తరువాత దాని కళేబరాన్ని మంటల్లో వేశారు.
“वह सींग घमंड से भरी बातें कर रहा था इसलिये मैं उधर लगातार देखता रहा. मैं तब तक देखता रहा जब तक कि उसका वध करके उसके शरीर को नष्ट न कर दिया गया और धधकती आग में न फेंक दिया गया.
12 ౧౨ మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయింది. సమయం వచ్చే దాకా అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయం, ఒక కాలం వాటికి ఏర్పాటు అయింది.
(दूसरे पशुओं का अधिकार छीन लिया गया था, पर कुछ समय के लिये उन्हें प्राण दान दिया गया था.)
13 ౧౩ రాత్రి కలిగిన దర్శనాలను నేనింకా చూస్తుండగా, ఆకాశ మేఘాలపై వస్తున్న మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకడు వచ్చాడు. ఆ మహా వృద్ధుని సన్నిధిలో ప్రవేశించాడు. ఆయన సముఖానికి అతణ్ణి తీసుకు వచ్చారు.
“रात को मैंने अपने दर्शन में देखा कि मनुष्य के पुत्र के समान कोई आकाश के बादलों के साथ आ रहा था. वह अति प्राचीन के पास आया और उसे उनके सामने लाया गया.
14 ౧౪ సకల ప్రజలు, రాష్ట్రాలు, వివిధ భాషలు మాటలాడేవారు ఆయన్ని సేవించేలా ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది. అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదు.
उसे अधिकार, महिमा और सर्वोच्च शक्ति दी गई; सब जाति और हर भाषा के लोग उसकी आराधना किए. उसका प्रभुत्व चिरस्थायी है, जो कभी खत्म नहीं होगा, और उसका राज्य ऐसा राज्य है, जो कभी नाश न होगा.
15 ౧౫ నాకు కలిగిన దర్శనాలు నన్ను కలవర పరుస్తున్నందువల్ల దానియేలు అనే నాకు లోపల కలవరం కలిగింది.
“मैं, दानिएल, मन में बहुत व्याकुल हुआ, और जो दर्शन मैंने अपने मन में देखा, उससे मैं विचलित हो गया.
16 ౧౬ నేను సింహాసనం దగ్గర నిలబడి ఉన్న వారిలో ఒకడి దగ్గరికిపోయి “దీన్ని గూర్చిన వాస్తవం నాకు చెప్పు” అని అడిగాను. అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావాన్ని నాకు తెలియజేశాడు.
वहां खड़े लोगों में से एक के पास मैं गया और उससे इन सारी बातों का अर्थ पूछा. “उसने यह कहकर मुझे इन बातों का अर्थ बताया:
17 ౧౭ ఎలాగంటే ఈ మహా జంతువులు నాలుగు. లోకంలో పరిపాలించ బోయే నలుగురు రాజులను ఇవి సూచిస్తున్నాయి.
‘चार बड़े पशु चार राजा हैं, जिनका पृथ्वी पर उदय होगा.
18 ౧౮ అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారు. వారు యుగయుగాంతాల వరకూ రాజ్యమేలుతారు.
पर सर्वोच्च परमेश्वर के पवित्र लोगों को ही राज्य मिलेगा और वे उसे अपने अधिकार में सदाकाल तक रखेंगे—जी हां, सदाकाल तक.’
19 ౧౯ ఇనుప దంతాలు, ఇత్తడి గోళ్లు ఉన్న ఆ నాలుగవ జంతువు సంగతి ఏమిటో నేను తెలుసుకోవాలనుకున్నాను. అది మిగతా వాటికి పూర్తిగా వేరుగా ఉంది. చాలా భయంకరంగా, సమస్తాన్నీ పగలగొడుతూ మింగి వేస్తూ మిగిలిన దాన్ని కాళ్లతో తొక్కేస్తూ ఉంది.
“तब मेरे मन में उस चौथे पशु के अर्थ को जानने की इच्छा हुई, जो दूसरे सारे पशुओं से भिन्‍न था और जो अपने लोहे के दांतों और कांसे के पंजों के साथ बहुत डरावना था—वह पशु जो अपने शिकार को दबाकर खा जाता था और बचे हुए भाग को अपने पांवों से कुचल डालता था.
20 ౨౦ దాని తల మీద ఉన్న పది కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ముల స్థానంలో కళ్ళు, గర్వంగా మాటలాడే నోరుతో ఉన్న ఆ వేరొక కొమ్ము సంగతి, అంటే దాని మిగతా కొమ్ములకంటే బలంగా ఉన్న ఆ కొమ్ము సంగతి విచారించాను.
मुझे इन बातों का भी अर्थ जानने की इच्छा हुई; उसके सिर के दस सींग, और वह दूसरा सींग, जिसके निकल आने से, वहां के पहले के तीन सींग गिर गए—यह सींग जो दूसरे सीगों से ज्यादा रोबदार दिखता था और जिसकी आंखें और एक मुंह था, जिससे वह घमंड से भरी बातें करता था.
21 ౨౧ ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని గెలిచేది అయింది.
जैसा कि मैंने देखा, कि वह सींग पवित्र लोगों से युद्ध कर रहा था और उनको तब तक हराता रहा,
22 ౨౨ ఆ మహా వృద్ధుడు వచ్చి మహోన్నతుని దేవుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చేవరకూ అలా జరుగుతుంది గానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఏలుతారనే సంగతి నేను గ్రహించాను.
जब तक कि अति प्राचीन ने आकर सर्वोच्च परमेश्वर के पवित्र लोगों के पक्ष में न्याय का फैसला न दे दिया, और वह समय आया, जब उन्होंने राज्य पर अधिकार कर लिया.
23 ౨౩ నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలా చెప్పాడు. ఆ నాలుగవ జంతువు లోకంలో తక్కిన ఆ మూడు రాజ్యాలకు, భిన్నమైన నాలుగవ రాజ్యాన్ని సూచిస్తున్నది. అది సమస్తాన్నీ అణగదొక్కుతూ పగలగొడుతూ, లోకమంతటినీ కబళిస్తుంది.
“उसने मुझे यह अर्थ बताया: ‘वह चौथा पशु एक चौथा राज्य है, जो पृथ्वी पर प्रगट होगा. यह दूसरे सब राज्यों से भिन्‍न होगा. यह सारी पृथ्वी को रौंदते और कुचलते हुए नाश कर डालेगा.
24 ౨౪ ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోయే పదిమంది రాజులను సూచిస్తున్నాయి. చివర్లో ముందుగా ఉన్న రాజులకు భిన్నమైన మరొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను కూల్చి వేస్తాడు.
वे दस सींग दस राजा हैं, जो इस राज्य से आएंगे. उनके बाद, एक दूसरा राजा आयेगा, जो पहले के राजाओं से भिन्‍न होगा; वह तीन राजाओं को अपने अधीन कर लेगा.
25 ౨౫ ఆ రాజు మహోన్నతుని దేవునికి విరోధంగా మాట్లాడుతూ, మహోన్నతుని భక్తులను నలగగొడతాడు. అతడు పండగ కాలాలను ధర్మవిధులను మార్చ బూనుకుంటాడు. వారు ఒక కాలం కాలాలు అర్థకాలం అతని వశంలో ఉంటారు.
वह सर्वोच्च परमेश्वर के विरुद्ध बोलेगा और उसके पवित्र लोगों को सताएगा और ठहराए गये समयों और कानूनों को बदलने की कोशिश करेगा. पवित्र लोग एक समय, समयों और आधा समय के लिए उसके अधीन कर दिए जाएंगे.
26 ౨౬ అతని అధికారం వమ్ము చేయడానికి, నిర్మూలించ డానికి, తీర్పు జరిగింది గనక దాన్ని శిక్షించి లేకుండా చేయడం జరుగుతుంది.
“‘पर न्यायाधीश बैठेंगे, और उसकी शक्ति उससे छीन ली जाएगी और उसे हमेशा के लिये पूरी तरह नाश कर दिया जाएगा.
27 ౨౭ ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.
तब सर्वोच्च परमेश्वर के पवित्र लोगों को आकाश के नीचे के सब राज्यों की सत्ता, शक्ति और महानता दे दी जाएगी. उसका राज्य सदाकाल तक बना रहनेवाला राज्य होगा, और सब शासक उसकी आराधना करेंगे और उसकी बात मानेंगे.’
28 ౨౮ దానియేలు అనే నేను ఇది విని మనస్సులో విపరీతంగా కలత చెందాను. అందుచేత నా ముఖం వికారమై పోయింది. అయితే ఆ సంగతి నా మనస్సులో భద్రం చేసుకున్నాను.
“यहां उस विषय का अंत होता है. मैं, दानिएल, अपने विचारों से बहुत व्याकुल हो गया, और मेरा चेहरा पीला पड़ गया, पर यह बात मैं अपने मन में ही रखी.”

< దానియేలు 7 >