< దానియేలు 3 >

1 రాజైన నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహం చేయించాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు. బబులోను దేశాలోని “దూరా” అనే మైదానంలో దాన్ని నిలబెట్టించాడు.
Kralj Nabukodonozor odredi da se načini zlatni kip, visok šezdeset lakata i širok šest, i da ga postave u ravnici Duri, u pokrajini babilonskoj.
2 తరువాత నెబుకద్నెజరు తాను నిలబెట్టించిన విగ్రహ ప్రతిష్ఠకు దేశాల్లోని అధికారులను, ప్రముఖులను, సైన్యాధిపతులను, సంస్థానాల అధిపతులను, మంత్రులను, ఖజానా అధికారులను, ధర్మశాస్త్ర పండితులను, న్యాయాధిపతులను, సంస్థానాల్లో నాయకత్వం వహించేవాళ్ళను, ప్రజలందరినీ పిలవడానికి చాటింపు వేయించాడు.
Kralj Nabukodonozor pozva satrape, namjesnike, upravitelje, savjetnike, rizničare, suce i zakonoznance i sve namjesnike pokrajina da dođu na posvetu kipa što ga podiže kralj Nabukodonozor.
3 ఆ అధికారులు, ప్రముఖులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, మంత్రులు, ఖజానా అధికారులు, ధర్మశాస్త్ర పండితులు, న్యాయాధిపతులు, సంస్థానాల్లో నాయకత్వం వహించేవాళ్ళు, ప్రజలందరూ రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడివచ్చి, విగ్రహం ఎదుట నిలబడ్డారు.
Tada se sakupiše satrapi, namjesnici, upravitelji, savjetnici, rizničari, suci i zakonoznanci i svi namjesnici pokrajinske vlasti na posvetu kipa što ga podiže kralj Nabukodonozor. I stadoše pred kip što podiže Nabukodonozor.
4 ఆ సమయంలో రాజ ప్రతినిధి ఒకడు ఇలా ప్రకటించాడు. “సమస్త ప్రజలారా, దేశస్థులారా, వివిధ భాషలు మాట్లాడేవారలారా, మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే,
Glasnik proglasi: “O narodi, plemena i jezici, evo što vam se naređuje:
5 బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు మీరంతా రాజైన నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారపు విగ్రహం ఎదుట సాష్టాంగపడి నమస్కరించాలి.
u času kad začujete zvuke roga, frule, citre, sambuke, psaltira, gajda i svakovrsnih drugih glazbala, bacite se na tlo i poklonite se zlatnome kipu što ga podiže kralj Nabukodonozor!
6 అలా సాష్టాంగపడి నమస్కరించని వారిని వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేస్తారు.”
Tko se ne baci na tlo i ne pokloni, bit će smjesta bačen u peć užarenu.”
7 బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు వినబడ్డాయి. ప్రజలంతా, దేశవాసులు, వివిధ భాషలు మాట్లాడేవాళ్లు సాష్టాంగపడి రాజు నిలబెట్టించిన విగ్రహానికి నమస్కరించారు.
Zato, čim začuše zvuk roga, frule, citre, sambuke, psaltira, gajda i svakovrsnih drugih glazbala, baciše se na tlo svi narodi, plemena i jezici klanjajući se zlatnome kipu što ga podiže kralj Nabukodonozor.
8 అప్పుడు జ్యోతిష్యుల్లో ముఖ్యులు కొందరు వచ్చి యూదులపై నిందలు మోపారు.
Uto dođoše neki Kaldejci i optužiše Judejce.
9 నెబుకద్నెజరు రాజు దగ్గరికి వచ్చి ఇలా విన్నవించుకున్నారు. “రాజు కలకాలం జీవించు గాక.
Rekoše kralju Nabukodonozoru: “O kralju, živ bio dovijeka!
10 ౧౦ రాజా, తమరు ఒక కట్టుబాటు నియమించారు. అది ఏమిటంటే, బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు విన్న ప్రతి వ్యక్తీ ఆ బంగారు విగ్రహం ఎదుట సాష్టాంగపడి దానికి నమస్కరించాలి.
Ti si, kralju, naredio svakom čovjeku koji začuje zvuke roga, frule, citre, sambuke, psaltira, gajda i svakovrsnih drugih glazbala da se baci na tlo i da se pokloni zlatnome kipu;
11 ౧౧ ఎవరైతే సాష్టాంగపడి నమస్కరించలేదో వాణ్ణి మండుతూ ఉండే అగ్నిగుండంలో వేస్తారు.
a tko se ne baci na tlo i ne pokloni, da bude bačen u peć užarenu.
12 ౧౨ రాజా, తమరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు యూదు యువకులను బబులోను దేశంలోని రాజ్య పరిపాలన వ్యవహారాలు నిర్వర్తించడానికి నియమించారు. ఆ ముగ్గురు వ్యక్తులు మీరు ఇచ్చిన ఆజ్ఞను గౌరవించక నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు మీ దేవుళ్ళను పూజించడం లేదు, తమరు నిలబెట్టించిన బంగారు విగ్రహం ఎదుట నమస్కరించడం లేదు.”
A evo, ovdje su Judejci koje si postavio za upravitelje pokrajine babilonske: Šadrak, Mešak i Abed Nego. Ti ljudi ne mare za te, o kralju; oni ne štuju tvojih bogova i nisu se poklonili zlatnome kipu što si ga podigao.”
13 ౧౩ రాజైన నెబుకద్నెజరు తీవ్ర కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను తన దగ్గరికి తీసుకు రమ్మని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ముగ్గురు వ్యక్తులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకువచ్చారు.
Nabukodonozor, bijesan i gnjevan, pozva Šadraka, Mešaka i Abed Nega. Odmah ih dovedoše pred kralja.
14 ౧౪ అప్పుడు నెబుకద్నెజరు వాళ్ళతో “షద్రకూ, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతలను పూజించడం లేదనీ, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహానికి నమస్కరించడం లేదనీ నాకు తెలిసింది. ఇది నిజమేనా?
A Nabukodonozor im reče: “Je li istina, Šadrače, Mešače i Abed Nego, da vi ne štujete mojih bogova i da se ne klanjate zlatnome kipu što ga podigoh?
15 ౧౫ బాకాలు, వేణువులు, తీగె వాయిద్యాలు, వీణలు, తంబురలు, సన్నాయిలు ఇంకా అన్ని రకాల సంగీత వాయిద్యాల శబ్దాలు మీకు వినబడినప్పుడు నేను చేయించిన విగ్రహానికి సాష్టాంగపడి దానికి నమస్కరించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గనక నమస్కరించని పక్షంలో తక్షణమే మండుతున్న అగ్నిగుండంలో పడవేయిస్తాను. నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడూ కాపాడలేడు” అన్నాడు.
Jeste li voljni, čim začujete zvuk roga, frule, citre, sambuke, psaltira, gajda i svakovrsnih drugih glazbala, baciti se na tlo i pokloniti se kipu što ga načinih? Ako li mu se ne poklonite, bit ćete smjesta bačeni u peć užarenu; i koji je taj bog koji bi vas izbavio iz ruke moje?”
16 ౧౬ షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుతో ఇలా చెప్పారు. “నెబుకద్నెజరూ, దీని విషయం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.
Šadrak, Mešak i Abed Nego odgovoriše kralju Nabukodonozoru: “Ne treba da ti odgovorimo na to.
17 ౧౭ మేము పూజిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించగల సామర్థ్యం ఉన్నవాడు. నువ్వు విధించే శిక్ష నుండి ఆయన మమ్మల్ని కాపాడతాడు.
Bog naš, kome služimo, može nas izbaviti iz užarene peći i od ruke tvoje, kralju; on će nas i izbaviti.
18 ౧౮ రాజా, ఒకవేళ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా నీ దేవుళ్ళను మాత్రం మేము పూజించం అనీ, నువ్వు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించం అనీ తెలుసుకో.”
No ako toga i ne učini, znaj, o kralju: mi nećemo služiti tvojemu bogu niti ćemo se pokloniti kipu što si ga podigao.”
19 ౧౯ వాళ్ళ జవాబు విన్న నెబుకద్నెజరు కోపంతో మండిపడ్డాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల విషయంలో అతని ముఖం వికారంగా మారింది. అగ్ని గుండాన్ని మామూలు కంటే ఏడు రెట్లు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు.
Na te riječi kralj Nabukodonozor uskipje bijesom, a lice mu se iznakazi na Šadraka, Mešaka i Abed Nega.
20 ౨౦ తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు.
On naredi da se peć ugrije sedam puta jače no inače i jakim ljudima iz svoje vojske zapovjedi da svežu Šadraka, Mešaka i Abed Nega i bace u peć punu žarkoga ognja.
21 ౨౧ వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్నెగోల నిలువుటంగీలు, పైదుస్తులు, మిగిలిన దుస్తులు ఏమీ తియ్యకుండానే బంధించి మండుతున్న ఆ గుండం మధ్యలో పడేలా విసిరివేశారు.
Svezaše ih, dakle, i u plaštevima, obući i kapama baciše u zažarenu peć.
22 ౨౨ రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అగ్నిగుండం వేడి పెంచడం వల్ల షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరిన ఆ బలిష్టులైన మనుషులు అగ్నిజ్వాలల ధాటికి కాలిపోయి చనిపోయారు.
Kako kraljeva zapovijed bijaše žurna a peć preko mjere užarena, plamen ubi ljude koji su bacali Šadraka, Mešaka i Abed Nega.
23 ౨౩ షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ముగ్గురినీ బంధకాలతోనే వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండంలో విసిరివేశారు.
A tri čovjeka - Šadrak, Mešak i Abed Nego - padoše svezani u zažarenu peć.
24 ౨౪ తరువాత జరిగింది చూసిన రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఆత్రుతగా లేచి నిలబడ్డాడు. తన మంత్రులతో “మనం ముగ్గురిని బంధించి ఈ అగ్నిగుండంలో వేశాం కదా” అని అడిగాడు. వాళ్ళు “అవును రాజా” అన్నారు.
Tada se kralj Nabukodonozor zaprepasti i brzo ustade. Zapita svoje savjetnike: “Nismo li bacili ova tri čovjeka svezana u oganj?” Oni odgovoriše: “Jesmo, kralju!”
25 ౨౫ అప్పుడు రాజు “నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. వాళ్ళు బంధించబడినట్టుగానీ, కాలిపోయినట్టు గానీ లేరు. వాళ్లకి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వాళ్ళతో ఉన్న నాలుగో వ్యక్తి దైవ కుమారుని లాగా ఉన్నాడు” అని అన్నాడు.
On reče: “Ali ja vidim četiri čovjeka, odriješeni šeću po vatri i ništa im se zlo ne događa; četvrti je sličan sinu Božjemu.”
26 ౨౬ తరువాత నెబుకద్నెజరు వేడిగా ఉన్న మండుతున్న ఆ గుండం ద్వారం దగ్గరికి వచ్చాడు. “షద్రకు, మేషాకు, అబేద్నెగోల్లారా, మహోన్నతుడైన దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా దగ్గరికి రండి” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చారు.
Nabukodonozor priđe vratima užarene peći i viknu: “Šadrače, Mešače i Abed Nego, sluge Boga Višnjega, iziđite i dođite ovamo!” Tada iziđoše iz ognja Šadrak, Mešak i Abed Nego.
27 ౨౭ రాజు ఆస్థానంలోని అధికారులు, సైన్యాధిపతులు, సంస్థానాల అధిపతులు, రాజు ప్రధాన మంత్రులు అందరూ సమకూడి వాళ్ళను పరీక్షించారు. వాళ్ళ శరీరాలకు అగ్ని వల్ల ఎలాంటి హాని కలగకపోవడం, వాళ్ళ తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలకుండా ఉండడం, వాళ్ళు ధరించిన దుస్తులు చెక్కు చెదరకుండా ఉండడం, వాళ్ళ శరీరాలకు అగ్ని వాసన కూడా తగలకపోవడం గమనించారు.
Sakupiše se satrapi, starješine, upravitelji i kraljevi savjetnici da vide te ljude: oganj ne bijaše naudio njihovu tijelu, kosa im na glavi neopaljena, plaštevi im neoštećeni, nikakav se zadah ognja ne bijaše uhvatio njih.
28 ౨౮ నెబుకద్నెజరు “షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుడికి స్తుతి కలుగు గాక. తమ దేవునికి తప్ప మరి ఎవరికీ నమస్కరించమనీ, ఎవరినీ పూజించమనీ చెప్పి రాజు ఆజ్ఞను ధిక్కరించారు. తనను నమ్ముకున్న తన సేవకులను ఆ దేవుడు తన దూతను పంపించి రక్షించాడు.
Nabukodonozor viknu: “Blagoslovljen bio Bog Šadrakov, Mešakov i Abed Negov, koji je poslao svog anđela i izbavio svoje sluge, one koji se uzdahu u njega te se ne pokoriše kraljevoj naredbi, već radije predadoše svoje tijelo ognju negoli da štuju ili se klanjaju drugome osim svome Bogu!
29 ౨౯ కనుక ఇప్పుడు నేనిచ్చే ఆజ్ఞ ఏమిటంటే, ఏ ప్రజల్లో గానీ, ఏ ప్రాంతంలో గానీ, ఏ భాష మాట్లాడేవాళ్ళలో గానీ ఎవరైనా షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేవాళ్ళ దేవుణ్ణి అవమానపరిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. వాళ్ళ గృహాలను సమూల నాశనం చేయిస్తాను. వాళ్ళ దేవుడు రక్షించినట్టు మరి ఏ దేవుడూ రక్షించలేడు.”
Naređujem dakle: O narodi, plemena i jezici, svatko između vas tko bi pogrdio Boga Šadrakova, Mešakova i Abed Negova neka bude raskomadan, a njegova kuća pretvorena u smetlište, jer nema boga koji bi mogao izbaviti kao ovaj.”
30 ౩౦ అప్పటి నుండి రాజు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బబులోను సంస్థానంలో ఉన్నత స్థానాల్లో అధికారులుగా నియమించాడు.
Tada kralj uzvisi Šadraka, Mešaka i Abed Nega na visoke položaje u pokrajini babilonskoj.

< దానియేలు 3 >