< దానియేలు 12 >
1 ౧ “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.
१आणि मीखाएल जो मोठा अधिपती तुझ्या लोकांच्या संतानांसाठी उभा असतो तो त्या समयी उभा राहील; आणि राष्ट्र झाल्यापासून त्या वेळेपर्यंत कधी झाला नाही असा कष्टाचा समय होईल; आणि त्या वेळेस तुझे लोक सोडवले जातील, प्रत्येक जो पुस्तकात लिहिलेला सापडेल तो सोडवला जाईल.
2 ౨ సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.
२अनेक लोक जे मातीत निजलेले आहेत ते काही सार्वकालीन जीवनासाठी तर काही सार्वकालीन लज्जा आणि तिरस्कार मिळविण्यास उठतील.
3 ౩ బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.
३जे सुज्ञ ते आकाशातील प्रकाशासारखे चकाकतील आणि जे पुष्काळास न्यायीपणाकडे वळवणारे सदासर्वदा ताऱ्याप्रमाणे चमकतील.
4 ౪ దానియేలూ, నీవు ఈ మాటలను దాచి అంత్యకాలం వరకూ ఈ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.”
४पण तू दानीएला, ही वचने आणि पुस्तकाचे रहस्य गुप्त ठेव, अगदी अंतसमयापर्यंत अनेक लोक इकडे तिकडे धावतील आणि ज्ञान वाढत जाईल.
5 ౫ దానియేలు అనే నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడు, ఇవతలి ఒడ్డున ఒకడు నిలబడ్డారు.
५मग मी दानीएलाने पाहिले आणि तिथे दोघे उभे होते एक नदीच्या या काठवर उभा होता आणि दुसरा पलीकडील काठावर उभा होता.
6 ౬ ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకుని ఏటి ఎగువ భాగాన ఉన్న వ్యక్తిని చూసి ఈ ఆశ్చర్యకరమైనవి ఎప్పుడు పూర్తి అవుతాయని అడిగాడు.
६त्यापैकी एकाने तागाची वस्त्रे घातलेल्यास विचारले जो नदीच्या पाण्यावर होता या अद्भुत गोष्टीचा अंत होण्यास किती वेळ लागेल?
7 ౭ నారబట్టలు వేసుకుని ఏటి ఎగువన ఉన్న మనిషి మాట నేను విన్నాను. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఎత్తి నిత్యజీవి అయిన ఆయన నామంలో ఒట్టు పెట్టుకుని “ఒక కాలం కాలాలు అర్థకాలం పరిశుద్ధ జనం బలాన్ని కొట్టివేయడం అయిపోయాక వ్యవహారాలన్నీ సమాప్తమై పోతాయి” అన్నాడు.
७मी त्याची वाणी एकेली जो तागाची वस्त्रे घातलेला पुरुष नदीतल्या जलांच्या वरती होता, त्याने आपला उजवा व डावा हात आकाशावर करून म्हटले, जो सदाजीवी आहे त्याची शपथ वाहून म्हटले, एक समय, दोन समय आणि अर्धा समय, साडे तीन वर्ष जेव्हा पवित्रजनांच्या बलाचा चुराडा होईल तेव्हा हे पूर्ण करण्यात येईल. हे त्याचे म्हणणे माझ्या कानी पडले.
8 ౮ నేను విన్నాను గాని గ్రహింపలేకపోయాను. “స్వామీ, వీటికి అంతమేమిటి?” అని అడిగాను.
८मी ऐकले, पण मला समजले नाही तेव्हा मी विचारले, “माझ्या स्वामी, ह्याचा परिणाम काय?”
9 ౯ అతడు “ఈ సంగతులు అంత్యకాలం వరకూ అగోచరంగా ఉండేలా సీలు చేసి ఉన్నాయి గనక, దానియేలూ, నీవు ఊరుకో” అని చెప్పాడు.
९तो म्हणाला, दानीएला स्वस्थ रहा, कारण ही वचने मुद्रित करून अंतसमयापर्यंत गुप्त ठेवण्यात आली आहे.
10 ౧౦ చాలా మంది తమను శుద్ధిపరచుకుని ప్రకాశవంతులు, నిర్మలులు అవుతారు. దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు గనక అలాంటివాడు ఎవడూ ఈ సంగతులు గ్రహించలేడు. బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు.
१०पुष्कळ शुध्द, स्वच्छ आणि पवित्र केले जातील पण दुष्ट दुष्टपणा करतील, दुष्टांपैकी कोणास समजणार नाही पण जे ज्ञानी ते समजतील.
11 ౧౧ అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలు నాశనం కలగజేసే హేయమైన దాన్ని నిలబెట్టే వరకూ 1, 290 దినాలౌతాయి.
११रोजचे बलीहवन या वेळेपासून बंद करण्यात येईल आणि नाशदायी अमंगळाची स्थापना होईल तेव्हापासून 1, 290 दिवस लोटतील.
12 ౧౨ 1, 335 దినాలు గడిచే వరకూ ఎదురు చూసేవాడు ధన్యుడు.
१२जो धीराने 1, 335 दिवस वाट पाहील तो धन्य.
13 ౧౩ నీవు కడవరకూ నిలకడగా ఉంటే విశ్రాంతి నొంది కాలం అంతమయ్యేటప్పుడు నీకు నియమించిన పదవి పొందుతావు.
१३तू आपल्या मार्गाने अंतापर्यंत जा, तू तुझे वतन प्राप्त करायला शेवटच्या दिवसात उठविला जाशील.