< దానియేలు 12 >

1 “ఆ కాలంలో నీ ప్రజల పక్షాన నిలిచే మహా అధిపతి మిఖాయేలు వస్తాడు. అప్పుడు నీ ప్రజలు రాజ్యంగా కూడిన కాలం మొదలుకుని ఈ కాలం వరకూ ఎప్పుడూ కలగనంత ఆపద కలుగుతుంది. అయితే నీ ప్రజల్లో గ్రంథంలో పేరున్న వారు తప్పించుకుంటారు.
Tanī laikā celsies Miķelis, tas lielais valdnieks, kas tavu ļaužu bērnus aizstāv, un tad būs tāds bēdu laiks, kāds vēl nav bijis, kamēr ļaudis bijuši, līdz tam laikam. Un tanī laikā tavi ļaudis taps izpestīti, visi, kas atrodas grāmatā rakstīti.
2 సమాధుల్లో నిద్రించే చాలా మంది మేలుకుంటారు. కొందరు నిత్యజీవం అనుభవించడానికి, కొందరు నిందపాలు కావడానికి నిత్యంగా అసహ్యులై పోవడానికి మేలుకుంటారు.
Un daudz no tiem, kas guļ zemes pīšļos, uzmodīsies, citi uz mūžīgu dzīvošanu, bet citi uz mūžīgu kaunu un negantību.
3 బుద్ధిమంతులైతే ఆకాశమండలం లోని జ్యోతులను పోలి ప్రకాశిస్తారు. నీతిమార్గం అనుసరించి నడుచుకొనేలా ఎవరు అనేకమందిని తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు.
Bet mācītāji spīdēs kā debess spožums, un kas daudzus veduši uz taisnību, kā zvaigznes mūžīgi mūžam.
4 దానియేలూ, నీవు ఈ మాటలను దాచి అంత్యకాలం వరకూ ఈ గ్రంథానికి సీలు వెయ్యి. చాలామంది నలుదిశల సంచరించినందువల్ల తెలివి అధికమవుతుంది.”
Un tu, Daniēl, apslēp šos vārdus un aizzieģelē šo grāmatu līdz pēdējam laikam, tad daudzi meklēs tikuši(visapkārt), un atzīšana vairosies.
5 దానియేలు అనే నేను చూస్తుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడు, ఇవతలి ఒడ్డున ఒకడు నిలబడ్డారు.
Un es, Daniēls, skatījos, un redzi, divi citi stāvēja, viens šai upes malā un otrs otrā upes malā.
6 ఆ యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసుకుని ఏటి ఎగువ భాగాన ఉన్న వ్యక్తిని చూసి ఈ ఆశ్చర్యకరమైనవి ఎప్పుడు పూర్తి అవుతాయని అడిగాడు.
Un viens sacīja uz to vīru, kas bija ģērbts nātnu drēbēs, kas upes virsū stāvēja: cik ilgi tas būs, kad tiem brīnumiem būs gals?
7 నారబట్టలు వేసుకుని ఏటి ఎగువన ఉన్న మనిషి మాట నేను విన్నాను. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఎత్తి నిత్యజీవి అయిన ఆయన నామంలో ఒట్టు పెట్టుకుని “ఒక కాలం కాలాలు అర్థకాలం పరిశుద్ధ జనం బలాన్ని కొట్టివేయడం అయిపోయాక వ్యవహారాలన్నీ సమాప్తమై పోతాయి” అన్నాడు.
Un es dzirdēju to vīru, kas bija ģērbts nātnu drēbēs un stāvēja upes virsū, tas pacēla savu labo un kreiso roku pret debesīm un zvērēja pie Tā, kas dzīvo mūžīgi, ka viss tas notiks pēc viena laika, diviem laikiem un pus laika, un kad tās svētās tautas klīšana būs beigta.
8 నేను విన్నాను గాని గ్రహింపలేకపోయాను. “స్వామీ, వీటికి అంతమేమిటి?” అని అడిగాను.
To es dzirdēju, bet nesapratu, un sacīju: mans kungs, kas būs tam visam gals?
9 అతడు “ఈ సంగతులు అంత్యకాలం వరకూ అగోచరంగా ఉండేలా సీలు చేసి ఉన్నాయి గనక, దానియేలూ, నీవు ఊరుకో” అని చెప్పాడు.
Un viņš sacīja: ej, Daniēl, jo šie vārdi ir apslēpti un aizzieģelēti līdz gala laikam.
10 ౧౦ చాలా మంది తమను శుద్ధిపరచుకుని ప్రకాశవంతులు, నిర్మలులు అవుతారు. దుష్టులు దుష్ట కార్యాలు చేస్తారు గనక అలాంటివాడు ఎవడూ ఈ సంగతులు గ్రహించలేడు. బుద్ధిమంతులు మాత్రమే గ్రహిస్తారు.
Daudzi taps šķīstīti un tīrīti un kausēti, un tie bezdievīgie būs bezdievīgi, un tie bezdievīgie visi to neliks vērā, bet tie prātīgie to liks vērā.
11 ౧౧ అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలు నాశనం కలగజేసే హేయమైన దాన్ని నిలబెట్టే వరకూ 1, 290 దినాలౌతాయి.
Un no tā laika, kad tas ikdienas upuris kļūs atņemts un tā negantība un postīšana notiks, būs tūkstoš divi simti un deviņdesmit dienas.
12 ౧౨ 1, 335 దినాలు గడిచే వరకూ ఎదురు చూసేవాడు ధన్యుడు.
Svētīgs ir, kas sagaida un aizsniedz tūkstoš trīs simti trīsdesmit un piecas dienas.
13 ౧౩ నీవు కడవరకూ నిలకడగా ఉంటే విశ్రాంతి నొంది కాలం అంతమయ్యేటప్పుడు నీకు నియమించిన పదవి పొందుతావు.
Bet tu noej līdz galam, un tu dusēsi un atkal celsies, savu daļu dabūt pastarā laikā.

< దానియేలు 12 >