< దానియేలు 10 >
1 ౧ పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.
Ní ọdún kẹta Kirusi ọba Persia, a fi ìran kan hàn Daniẹli (ẹni tí à ń pè ní Belteṣassari). Òtítọ́ ni ọ̀rọ̀ ìran náà, ó sì ní í ṣe pẹ̀lú àsìkò ìpọ́njú ńlá, òye ọ̀rọ̀ náà wá bá a nínú ìran.
2 ౨ ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను.
Ní àsìkò náà, èmi Daniẹli ṣọ̀fọ̀ fún ọ̀sẹ̀ mẹ́ta.
3 ౩ మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు.
Èmi kì í jẹ oúnjẹ tí ó dára, èmi kò fi ẹran tàbí wáìnì kan ẹnu mi, bẹ́ẹ̀ ni èmi kò fi òróró para títí ọ̀sẹ̀ mẹ́ta fi kọjá.
4 ౪ మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.
Ní ọjọ́ kẹrìnlélógún oṣù àkọ́kọ́, bí mo ti dúró sí etí i bèbè odò ńlá Tigirisi,
5 ౫ నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
mo wo òkè, mo rí ọkùnrin kan tí ó wọ aṣọ àlà, ẹ̀gbẹ́ ẹni tí a fi wúrà Upasi dáradára dì ní àmùrè.
6 ౬ అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది.
Ara rẹ̀ dàbí berili, ojú u rẹ̀ dàbí mọ̀nàmọ́ná, ẹyin ojú u rẹ̀ dàbí iná àtẹ̀tàn, apá àti ẹsẹ̀ rẹ̀ dàbí ìtànná ìmọ́lẹ̀ tí o kún fún idẹ, àti ohùn rẹ̀ dàbí i ti ìjọ ènìyàn púpọ̀.
7 ౭ దానియేలు అనే నాకు ఈ దర్శనం కలిగినప్పుడు నాతో ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గానీ భయంతో గడగడా వణుకుతూ దాక్కోవాలని పారిపోయారు.
Èmi Daniẹli, ni ẹnìkan tí ó rí ìran náà, àwọn ọkùnrin tí ó wà pẹ̀lú u mi, wọn kò rí i, ṣùgbọ́n ìpayà ńlá dà bò wọ́n, wọ́n sálọ wọ́n sì fi ara pamọ́.
8 ౮ నేను ఒంటరిగా ఆ గొప్ప దర్శనాన్ని చూశాను. అందువల్ల నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమై పోయింది. నాలో బలమేమీ లేకపోయింది.
Ó sì ku èmi nìkan, tí mo rí ìran ńlá yìí, kò sì ku okun kankan fún mi, ojú u mi sì rẹ̀wẹ̀sì gidigidi, n kò sì ní agbára mọ́.
9 ౯ నేను అతని మాటలు విన్నాను. నేను అతని మాటలు విని నేలపై సాష్టాంగపడి గాఢనిద్ర పోయాను.
Nígbà náà, ni mo gbọ́ tí ó ń sọ̀rọ̀, bí mo ṣe tẹ́tí sílẹ̀ sí i, mo sùn lọ fọnfọn, ní ìdojúbolẹ̀.
10 ౧౦ అప్పుడొకడు నన్ను చేత్తో తాకి నా మోకాళ్లను అరచేతులను నేలపై మోపి నన్ను నిలబెట్టి
Ọwọ́ kan kàn mí, ó gbé mi dìde ní ìwárìrì lórí ọwọ́ àti eékún mi.
11 ౧౧ “దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.
Ó sọ pé, “Daniẹli ẹni tí a yàn fẹ́ gidigidi gba ọ̀rọ̀ tí mo fẹ́ bá ọ sọ yìí yẹ̀ wò dáradára, kí o sì dìde, nítorí tí a rán mi sí ọ.” Bí ó ṣe sọ èyí fún mi, mo dìde ní ìwárìrì.
12 ౧౨ అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను.
Nígbà náà ni ó tẹ̀síwájú, pé, “Má ṣe bẹ̀rù Daniẹli. Láti ọjọ́ àkọ́kọ́ tí ìwọ ti fi ọkàn rẹ sílẹ̀ níwájú Ọlọ́run rẹ, a gbọ́ ọ̀rọ̀ rẹ, mo sì wá nítorí ọ̀rọ̀ náà.
13 ౧౩ పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.
Ṣùgbọ́n ọmọ-aládé ìjọba Persia dá mi dúró fún ọjọ́ mọ́kànlélógún. Nígbà náà ni Mikaeli, ọ̀kan lára ìjòyè àwọn ọmọ-aládé, wá láti ràn mi lọ́wọ́, nítorí a dá mi dúró níbẹ̀ pẹ̀lú ọba Persia.
14 ౧౪ ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.
Ní ìsinsin yìí mo wá láti ṣàlàyé ohun tí yóò ṣẹlẹ̀ sí àwọn ènìyàn rẹ ní ọjọ́ iwájú, nítorí ìran náà ń sọ nípa ọjọ́ iwájú.”
15 ౧౫ అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం నేలకు వంచుకుని మౌనంగా ఉండిపోయాను.
Bí ó sì ti ń sọ nǹkan wọ̀nyí fún mi, mo sì dorí kodò mo sì dákẹ́.
16 ౧౬ అప్పుడు మనిషి ఆకారం గల ఒకడు నా పెదాలు ముట్టుకున్నాడు. నేను నోరు తెరిచి నా ఎదుట నిలబడి ఉన్నవాడితో ఇలా అన్నాను. “అయ్యా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందువల్ల నా బలం ఉడిగి పోయింది.
Nígbà náà, ni ẹnìkan tí ó rí bí ènìyàn fi ọwọ́ kan ètè mi, mo la ẹnu mi, mo sì bẹ̀rẹ̀ sí ní sọ ọ̀rọ̀, mo sọ fún ẹni tí ó dúró níwájú mi, “Ìrònú sì mú mi, nítorí ìran náà, olúwa mi, n kò sì ní okun.
17 ౧౭ తమరి సేవకుడినైన నేను నా యజమాని ఎదుట ఎలా మాటలాడతాను? నా బలం ఉడిగి పోయింది. ఊపిరాడకుండా ఉంది” అని చెప్పగా
Ǹjẹ́ báwo ni èmi ìránṣẹ́ ẹ̀ rẹ ṣe lè bá ọ sọ̀rọ̀, olúwa mi? Agbára mi ti lọ, agbára káká ni mo fi ń mí.”
18 ౧౮ అతడు మళ్ళీ నన్ను ముట్టి నన్ను బలపరచి “నీవు చాలా ఇష్టమైన వాడివి. భయపడకు.
Ẹ̀wẹ̀, ẹnìkan tí ó rí bí ènìyàn fi ọwọ́ kàn mí, ó sì fún mi ní agbára.
19 ౧౯ నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు. అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను.
Ó sì wí pé, “Má ṣe bẹ̀rù, ìwọ ọkùnrin olùfẹ́ gidigidi. Àlàáfíà ni fún ọ, mú ara le, àní mú ara le.” Nígbà tí ohun bá mi sọ̀rọ̀, a sì mú mi lára le. “Mo sì wí pé, kí olúwa mi kí ó máa sọ̀rọ̀, níwọ̀n ìgbà tí ìwọ ti mú mi ní ara le.”
20 ౨౦ అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు.
Nígbà náà, ni ó wí pé, “Ṣé o mọ ìdí tí mo fi tọ̀ ọ́ wá? Láìpẹ́ èmi yóò yípadà lọ bá àwọn ọmọ-aládé Persia jà, nígbà tí mo bá lọ àwọn ọmọ-aládé Giriki yóò wá;
21 ౨౧ అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”
ṣùgbọ́n ní àkọ́kọ́, èmi yóò sọ ohun tí wọ́n kọ sínú ìwé òtítọ́ fún ọ. (Kò sí ẹni tí ó kún mi lọ́wọ́ fún nǹkan wọ̀nyí bí kò ṣe Mikaeli, ọmọ-aládé e yín.