< కొలొస్సయులకు 4 >
1 ౧ యజమానులారా, పరలోకంలో మీకు ఒక యజమాని ఉన్నాడని తెలుసుకోండి. మీ దాసుల పట్ల న్యాయమైన, సరైన దానిని చేయండి.
Jūs kungi, kas ir pareizi un pēc tiesas, to dariet tiem kalpiem, zinādami, ka jums arīdzan Kungs ir debesīs.
2 ౨ ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.
Esiet pastāvīgi iekš lūgšanas un esiet nomodā iekš tās ar pateicību,
3 ౩ దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను.
Lūgdami turklāt arī par mums, ka Dievs mums gribētu atvērt tā vārda durvis, runāt Kristus noslēpumu, kā dēļ es arī esmu saistīts,
4 ౪ నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.
Lai es to varu darīt zināmu, tā kā man pienākas runāt.
5 ౫ సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
Staigājiet iekš gudrības priekš tiem, kas ir ārā, laiku vērā ņemdami.
6 ౬ మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.
Jūsu valoda lai ir arvien mīlīga un ar sāli sālīta, ka jūs zināt ikvienam atbildēt, kā pienākas.
7 ౭ ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు.
Kā man klājās, par to Tihikus jums ziņu dos, tas mīļais brālis un uzticīgais palīgs un amata biedrs iekš Tā Kunga,
8 ౮ ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను.
Ko es tāpēc esmu sūtījis pie jums, lai es ziņu dabūtu, kā jums klājās, un lai tas jūsu sirdis iepriecinātu,
9 ౯ ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు.
Ar Onezimu, to uzticīgo un mīļo brāli, kas no jūsu draudzes; tie jums visu stāstīs, kā te iet.
10 ౧౦ నాతో కూడా చెరసాల్లో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు అభివందనాలు చెబుతున్నారు. ఈ మార్కు “మీ దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకోండి” అని మిమ్మల్ని గతంలోనే ఆదేశించాను గదా.
Aristarks, mans cietuma biedrs, jūs sveicina, un Marks, Barnabas brāļa dēls, par ko jūs pavēles esat dabūjuši (kad tas pie jums nāks, tad to uzņemiet),
11 ౧౧ ఇంకా యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు అభివందనాలు చెబుతున్నాడు. వీరంతా సున్నతి పొందిన వర్గంలో ఉన్నవారు. వీరే దేవుని రాజ్యం కోసం నాకు జత పనివారు. వీరు నాకు ఆదరణగా ఉన్నారు.
Un Jēzus, ar pavārdu Justs, kas ir no apgraizīšanas. Šie vien ir mani darba biedri pie Dieva valstības, kas man bijuši par iepriecināšanu.
12 ౧౨ మీలో ఒకడూ క్రీస్తు యేసు సేవకుడూ అయిన ఎపఫ్రా మీకు అభివందనాలు చెబుతున్నాడు. దేవుని సంకల్పమంతటిలో మీరు సంపూర్ణులుగానూ నిశ్చయతగలిగి నిలకడగానూ ఉండాలని ఇతడు ఎప్పుడూ మీ కోసం తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు.
Epafra, kas ir no jūsu draudzes, Kristus kalps, jūs sveicina, vienmēr par jums cīnīdamies iekš lūgšanām, ka jūs pilnīgi un stipri pastāviet visā Dieva prātā.
13 ౧౩ ఇతడు మీకోసం, లవొదికయ వారి కోసం, హియెరాపొలి వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇది ఇతని గూర్చి నా సాక్ష్యం.
Jo es tam dodu liecību, ka viņš karsti darbojās par jums un par tiem Laodiķeā un par tiem Hierapolē.
14 ౧౪ ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు.
Lūkas, tas ārsts, tas mīļais, un Demas jūs sveicina.
15 ౧౫ లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు తెలియజేయండి.
Sveicinājiet tos brāļus Laodiķeā, un Nimfu un to Dieva draudzi viņa namā.
16 ౧౬ ఈ పత్రిక మీరు చదివాక లవొదికయలోని సంఘంలో చదివించండి. అలాగే నేను లవొదికయ సంఘానికి రాసి పంపిన పత్రికను మీరు తెప్పించుకుని చదవండి.
Un kad tā grāmata no jums ir lasīta, tad gādājiet, ka tā arī Laodiķeas draudzē top lasīta, un ka jūs arīdzan to grāmatu no Laodiķeas lasāt.
17 ౧౭ అలాగే, “ప్రభువులో నీకు అప్పగించిన సేవను నెరవేర్చడానికి జాగ్రతపడు” అని అర్ఖిప్పుతో చెప్పండి.
Un sakāt Arhipam: kopi to amatu, ko tu esi dabūjis iekš Tā Kunga, ka tu to pilnīgi izdari.
18 ౧౮ పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండుగాక.
Tā sveicināšana ar manu, Pāvila, roku. Pieminiet manas saites! Žēlastība lai ir ar jums! Āmen!