< ఆమోసు 8 >

1 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప!
Ово ми показа Господ: Гле, котарица летњег воћа.
2 ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.
И рече: Шта видиш, Амосе? А ја рекох: Котарицу летњег воћа. А Господ ми рече: Дође крај народу мом Израиљу, нећу га више пролазити.
3 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మందిరంలో వాళ్ళు పాడే పాటలు ఏడుపులవుతాయి. ఆ రోజు శవాలు విపరీతంగా పడి ఉంటాయి. నిశ్శబ్దంగా వాటిని అన్ని చోట్లా పడేస్తారు” అన్నాడు.
И песме ће црквене бити ридање у онај дан, говори Господ; биће мноштво мртвих телеса, која ће се свуда побацати ћутећи.
4 దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.
Чујте ово, који прождирете убоге и сатирете сиромахе у земљи,
5 వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.
Говорећи: Кад ће проћи младина да продајемо жито? И субота да отворимо пшеницу? Умањујући ефу и повећавајући сикал и варајући лажним мерилима;
6 పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం. దీనులను, ఒక జత చెప్పులకు కొందాం.”
Да купујемо сиромахе за новце и убогог за једне опанке, и да продајемо очинке од пшенице.
7 యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”
Закле се Господ славом Јаковљевом: Нећу никада заборавити ниједно дело њихово.
8 దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.
Неће ли се земља потрести од тога, и протужити сваки који живи на њој? И неће ли се сва разлити као река? И неће ли се однети и потопити као од реке мисирске?
9 యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది.
И у онај дан, говори Господ Господ, учинићу да сунце зађе у подне, и помрачићу земљу за белог дана.
10 ౧౦ మీ పండగలను దుఃఖదినాలుగా మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. మీ అందరి తలలు బోడిచేస్తాను. ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.
И претворићу празнике ваше у жалост и све песме ваше у плач, и метнућу кострет око свих бедара, и учинићу да свака глава оћелави и да буде жалост као за јединцем, и крај ће јој бити као горак дан.
11 ౧౧ యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.
Гле, иду дани, говори Господ Господ, кад ћу пустити глад на земљу, не глад хлеба ни жеђ воде, него слушања речи Господњих.
12 ౧౨ యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు కానీ అది వారికి దొరకదు.
И потуцаће се од мора до мора, и од севера до истока трчаће тражећи реч Господњу, и неће је наћи.
13 ౧౩ ఆ రోజు అందమైన కన్యలూ యువకులూ దాహంతో సోలిపోతారు.
У то ће време обамирати лепе девојке и младићи од жеђи,
14 ౧౪ సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, ‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ ‘బెయేర్షెబా, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”
Који се куну кривицом самаријском и говоре: Тако да је жив Бог твој, Дане, и тако да је жив пут у Вирсавеју. И пашће, и неће више устати.

< ఆమోసు 8 >