< ఆమోసు 7 >
1 ౧ యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. రాజుకు రావలసిన కోత తరువాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు ఆయన మిడతల గుంపు పుట్టించాడు.
Xudavənd Rəbb mənə bu görüntünü göstərdi: budur, padşahın payı biçiləndən sonra əmələ gələn ot bitməyə başlayanda O, çəyirtkə sürüsü düzəldirdi.
2 ౨ అవి పచ్చికనంతా తినేసినప్పుడు నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, దయచేసి క్షమించు. యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది”
Çəyirtkələr ölkədə bütün bitkiləri yeyib-qurtarmaq üzrə olanda mən dedim: “Ya Xudavənd Rəbb, yalvarıram, bağışla. Buna Yaqub nəsli necə dözər? Axı o kiçikdir”.
3 ౩ దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది జరగదు” అన్నాడు.
Buna görə Rəbb bu niyyətdən döndü. Rəbb dedi: “Bu olmayacaq”.
4 ౪ యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. శిక్షించడానికి యెహోవా ప్రభువు అగ్ని రప్పించాడు. అది భూమి కిందున్న అగాధ మహా జలాన్ని ఎండగొట్టి భూమిని కూడా మింగేసేదే.
Sonra Xudavənd Rəbb mənə bu görüntünü göstərdi: budur, Xudavənd Rəbb cəza vermək üçün alov çağırdı. Alov dənizləri dibindən udaraq torpağı da yandırıb-yaxmaq üzrə olanda
5 ౫ అయితే నేనిలా అన్నాను. “యెహోవా ప్రభూ, యాకోబు వంశం కొద్దిమందేగా. అది ఎలా నిలదొక్కుకుంటుంది?”
mən dedim: “Ya Xudavənd Rəbb, yalvarıram, əl saxla. Buna Yaqub nəsli necə dözər? Axı o kiçikdir”.
6 ౬ దీని గురించి యెహోవా మనస్సు మార్చుకుని “అది కూడా జరగదు” అన్నాడు.
Buna görə Rəbb bu niyyətdən də döndü. Xudavənd Rəbb dedi: “Bu olmayacaq”.
7 ౭ ఆయన నాకిది చూపించాడు. చూడు, మట్టపు గుండు చేతిలో పట్టుకుని ప్రభువు గోడ పక్కన నిలబడ్డాడు.
Sonra mənə bu görüntünü göstərdi: budur, Xudavənd şaqulla düz tikilmiş bir divarın yanında dayanıb. Onun əlində bir şaqul var idi.
8 ౮ యెహోవా నాతో ఇలా అన్నాడు. “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” “మట్టపు గుండు” అన్నాను. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు. “నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేయబోతున్నాను. ఇక ఏమాత్రం నేను వాళ్ళను వదిలిపెట్టను.
Rəbb məndən soruşdu: “Amos, sən nə görürsən?” Mən cavab verdim: “Bir şaqul”. Xudavənd dedi: “Budur, Mən xalqım İsraili yoxlamaq üçün aralarına bir şaqul qoyuram. Artıq onlardan əl çəkməyəcəyəm.
9 ౯ ఇస్సాకు వంశం వారి ఉన్నత స్థలాలు నాశనమవుతాయి. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలాలు పాడైపోతాయి. యరొబాము వంశానికి విరోధంగా కత్తి ఎత్తుతాను.”
İshaqın nəslinin səcdəgahları xaraba qalacaq, İsrailin Müqəddəs məkanları viran olacaq. Yarovamın nəslinə qarşı qılıncla çıxacağam”».
10 ౧౦ అప్పుడు బేతేలు యాజకుడు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యరొబాముకు ఇలా కబురు పంపాడు “ఇశ్రాయేలీయుల మధ్య, ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. అతని మాటలు దేశం సహించలేదు.”
Bet-El kahini Amasya İsrail padşahı Yarovama belə xəbər göndərdi: «Amos İsrail nəsli arasında sənə qarşı qəsd hazırlayır. Onun sözlərinin öhdəsindən bu ölkə gələ bilməz.
11 ౧౧ అప్పుడు ఆమోసు, యరొబాము కత్తితో చస్తాడు. ఇశ్రాయేలీయులు తప్పకుండా తమ దేశాన్నివిడిచి బందీలుగా వెళతారు అన్నాడు.
Çünki Amos belə deyir: “Yarovam qılıncdan keçirilib öləcək. İsrail xalqı öz torpağından hökmən sürgünə aparılacaq”».
12 ౧౨ అమజ్యా ఆమోసుతో ఇట్లన్నాడు. “దీర్ఘదర్శీ, వెళ్ళిపో! యూదా దేశానికి పారిపో. అక్కడే ప్రవచించుకుంటూ పొట్ట పోసుకో.
Sonra Amasya Amosa dedi: «Ey görücü, buradan get, Yəhuda torpağına qaç. Peyğəmbərliyini orada et, onların çörəyini ye.
13 ౧౩ బేతేలులో ఇంక ఎంత మాత్రం ప్రవచించవద్దు. రాజు నివసించే స్థలం, రాజభవనం ఇక్కడ ఉన్నాయి.”
Bir də Bet-Eldə peyğəmbərlik etmə, çünki bura padşahın müqəddəs məkanı və padşahlıq məbədidir».
14 ౧౪ అందుకు ఆమోసు అమజ్యాతో ఇలా అన్నాడు. “నేను ప్రవక్తను కాదు, ప్రవక్త కొడుకును కూడా కాదు. నేను గొర్రెల కాపరిని. మేడి చెట్లు చూసుకుంటాను.
Amos Amasyaya cavab verib dedi: «Mən nə peyğəmbərəm, nə də peyğəmbərin şagirdi. Mən yalnız bir çobanam, firon ənciri ağaclarını yetişdirirəm.
15 ౧౫ అయితే, నేను నా మందలను కాస్తూ ఉంటే యెహోవా నన్ను పిలిచి, ‘నువ్వు వెళ్లి నా ప్రజలైన ఇశ్రాయేలు వారికి ప్రవచించు’ అన్నాడు.”
Mən sürü otaran idim, Rəbb məni götürüb belə dedi: “Get, xalqım İsrailə peyğəmbərlik et”.
16 ౧౬ అందుచేత యెహోవా మాట వినండి. మీరిలా అంటున్నారు, ఇశ్రాయేలీయులను గురించి ప్రవచించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా మాట జారవద్దు.
İndi isə Rəbbin sözünü dinlə. Sən “İsrailə qarşı peyğəmbərlik etmə və İshaq nəslinin əleyhinə vəz etmə” deyirsən.
17 ౧౭ యెహోవా చెప్పేదేమిటంటే, నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. నీ కొడుకులూ కూతుళ్ళు కత్తితో హతమౌతారు. శత్రువులు నీ భూమిని కొలిచి పంచుకుంటారు. నువ్వు అపవిత్ర దేశంలో ప్రాణం విడుస్తావు. కచ్చితంగా ఇశ్రాయేలీయులు తమ దేశం విడిచి బందీలవుతారు.
Buna görə də Rəbb belə deyir: “Sənin arvadın şəhərdə fahişəlik edəcək, Oğulların və qızların qılıncdan keçiriləcək, Torpağın ölçülüb paylanacaq. Sən isə yad eldə – murdar bir ölkədə öləcəksən. İsrail xalqı öz torpağından hökmən sürgünə aparılacaq”.