< ఆమోసు 6 >

1 సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు. సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు. ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.
Ai dykk som sit trygge på Sion, utan sut på Samarias berg, dei fremste i det gjævaste folk, som fær vitjing av Israels hus!
2 మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి. అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి. ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి. అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా? వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా?
Drag burt til Kalne og sjå, og endå lenger, til Stor-Hamat fram, og stig ned til Gat i Filistarland! Er dei betre enn desse riki? Er deira land større enn dykkar?
3 విపత్తు రోజు దూరంగా ఉందనుకుని దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు.
De som vond-dagen set på dør og valdsmannen sessar på stol.
4 వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
På filsbeins-sæte dei ligg, og late på pallen dei heng. Av fenaden lambi dei et, og gjødkalv-bingen gjev steik.
5 తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.
Dei sullar til harpe-slått liksom David dei lagar seg spel.
6 ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
Av bollar drikk dei vin, og med dyraste olje seg salvar, dei sturar ikkje for Josefs skade.
7 కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు. సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు.
Difor skal desse vera fremst i den landlyste flokken, og letings-sullen vert slutt.
8 “యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం. వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం. కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను. నేను, ప్రభువైన యెహోవాను. నా తోడని ప్రమాణం చేశాను.” సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే.
Herren, Herren hev svore ved seg sjølv, segjer Herren, allhers Gud: Jakobs høgferd mislikar eg, eg hatar hans slott, og by og bol gjev eg upp.
9 ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు.
Og um det so berre var tie mann att i eitt einaste hus, dei skal døy.
10 ౧౦ వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.
Og frenden og brennaren kjem til å bera beini or huset. Spør han so den som er inst inni huset: «Er det nokon att hjå deg?» Han svarar: «Nei, » so segjer han: «Hyss!» For ikkje må nemnast Herrens namn.
11 ౧౧ ఎందుకంటే గొప్ప కుటుంబాలు, చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.
For sjå, Herren byd: det store huset skal skakast i knas, og det vesle til dess at det brest.
12 ౧౨ గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
Tru hestarne spring i brattberg ikring, tru uksen på sjøen dreg plogen, sidan de til forgift brigdar retten og vender rettferd til malurt?
13 ౧౩ లొదెబారు పట్ల ఆనందించే మీరు, “మా సొంత బలంతో కర్నాయింను వశం చేసుకోలేదా?” అంటారు.
I heimløyser hev dei si frygd, dei kved: «Var me ikkje hæve, at me hev vunne oss velde?»
14 ౧౪ అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే, “ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను. వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ మిమ్మల్ని బాధిస్తారు.”
For sjå, eg reiser imot dykk, Israels hus, eit folk, segjer Herren, allhers Gud. Og det skal dykk slå, frå Hamats grensa til øydemarks å.

< ఆమోసు 6 >