< ఆమోసు 6 >
1 ౧ సీయోనులో హాయిగా సుఖపడే వారికి బాధ తప్పదు. సమరయ కొండల మీద దర్జాగా బతికే వారికి బాధ తప్పదు. ఇశ్రాయేలు వారికి సలహాదారులుగా ఉన్న గొప్ప రాజ్యాల్లోని ముఖ్య పెద్దలకు బాధ తప్పదు.
Ac mau fuka upaiya nu suwos su muta insraelak in Zion, ac nu suwos su moul in misla Samaria. Kowos pa mwet fulat lun mutunfacl pwengpeng se inge Israel, su mwet uh fahsri in suk kasru se.
2 ౨ మీ నాయకులు ఇలా చెబుతున్నారు, కల్నేకు వెళ్లి చూడండి. అక్కడ నుంచి హమాతు అనే గొప్ప పట్టణానికి వెళ్ళండి. ఆ తరువాత ఫిలిష్తీయుల పట్టణం గాతు వెళ్ళండి. అవి మీ రెండు రాజ్యాలకంటే గొప్పవి కావా? వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి కావా?
Fahlawin ac liye siti Calneh. Na sifilpa oatula fahsr nu in siti lulap Hamath, na tufokla nu in siti Gath lun mwet Philistia. Ya acn ingan ku liki tokosrai lun Judah ac Israel? Ya acn lalos yohk liki acn lowos?
3 ౩ విపత్తు రోజు దూరంగా ఉందనుకుని దౌర్జన్య పాలన త్వరగా రప్పించిన వారవుతున్నారు.
Kowos tia lungse in fwack mu sie len in ongoiya ac tuku. A ma kowos oru ingan aksayema len sac.
4 ౪ వాళ్ళు దంతపు మంచాల మీద పడుకుని, పరుపుల మీద ఆనుకుని కూర్చుంటారు. మందలోని గొర్రె పిల్లలను, సాలలో కొవ్విన దూడలను కోసుకుని తింటారు.
Ac mau fuka upaiya nu suwos su lungse oanoanla fin mwe muta wowo lowos, ac mongo ikwen cow fusr ac sheep fusr!
5 ౫ తీగ వాయిద్యాల సంగీతంతో పిచ్చిపాటలు పాడుతూ దావీదులాగా వాయిద్యాలను మరింత మెరుగ్గా వాయిస్తారు.
Kowos lungse na kinala on sasu oana David, ac sritalkin ke mwe on nutuwos.
6 ౬ ద్రాక్షారసంతో పాత్రలు నింపి తాగుతారు. పరిమళ తైలాలు పూసుకుంటారు కానీ యోసేపు వంశం వారికి వచ్చే నాశనానికి విచారించరు.
Kowos nwakla ahlu na lulap ke wain ac numla, ac kowos akmusrakin ono na keng, a kowos tiana asor ke musalla lun Israel.
7 ౭ కాబట్టి బందీలుగా వెళ్లే వారిలో వీళ్ళే మొదట వెళతారు. సుఖభోగాలతో జరుపుకునే విందు వినోదాలు ఇక ఉండవు.
Ke ma inge kowos pa ac som emeet nu in sruoh. Kufwa lowos ac warongrong lowos an ac fah wanginla.
8 ౮ “యాకోబు వంశీకుల గర్వం నాకు అసహ్యం. వారి రాజ భవనాలంటే నాకు ద్వేషం. కాబట్టి వారి పట్టణాన్ని దానిలో ఉన్నదంతా ఇతరుల వశం చేస్తాను. నేను, ప్రభువైన యెహోవాను. నా తోడని ప్రమాణం చేశాను.” సేనల దేవుడు, యెహోవా ప్రభువు వెల్లడించేది ఇదే.
LEUM GOD Fulat ac Kulana El orala sie wulela ku ke Inel, ac fahk, “Nga kwase inse fulat lun mwet Israel, ac nga tia pac kuhnkuni lohm lulap ac kato selos. Nga fah kitala siti fulat selos ac ma nukewa loac nu sin mwet lokoalok lalos.”
9 ౯ ఒక్క కుటుంబంలో పదిమంది మిగిలి ఉన్నా వాళ్ళంతా చస్తారు.
Fin pa oasr mwet singoul lula in sie lohm, elos kewa ac misa.
10 ౧౦ వాళ్ళ శవాలను ఇంట్లో నుంచి తీసుకు పోడానికి ఒక బంధువు వాటిని దహనం చేసే వాడితోపాటు వచ్చి, ఇంట్లో ఉన్న వాడితో “నీతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “లేడు” అంటాడు. “మాట్లాడకు. మనం యెహోవా పేరు ఎత్తకూడదు” అంటాడు.
Sie mwet ma sou lun sie mwet misa, su ma kunel in esukak monin mwet misa, fah usla mano sac liki lohm sac. El fah pang nu sin kutena su srakna muta in lohm ah, ac siyuk, “Oasr mwet lula ingan?” Na sie pusra ac fah topuk, “Wangin!” Na sou se lun mas uh fah fahk, “Koasrlong! Kut enenu in karinganangna kut in tia fahk Inen LEUM GOD.”
11 ౧౧ ఎందుకంటే గొప్ప కుటుంబాలు, చిన్న కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి, అని మీకు యెహోవా ఆజ్ఞ ఇస్తాడు.
Pacl se LEUM GOD El sapkin, na lohm lulap ac lohm srisrik nukewa fah kunanula nu ke ip srisrik.
12 ౧౨ గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.
Mwet uh tia ku in sang cow uh kihling in meoa uh, oayapa horse uh tiana ku in kasrusr fin eot lulap. A kowos furokla nununku suwohs nu ke pwasin, ac ma pwaye nu ke ma sutuu uh.
13 ౧౩ లొదెబారు పట్ల ఆనందించే మీరు, “మా సొంత బలంతో కర్నాయింను వశం చేసుకోలేదా?” అంటారు.
Kowos filangkin mu kowos sruokya siti srisrik Lodebar lowos. Kowos konkin ac fahk, “Kut sruokya pac acn Karnaim ke ku lasr sifacna.”
14 ౧౪ అయితే సేనల దేవుడు, యెహోవా ప్రభువు చెప్పేది ఇదే, “ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక రాజ్యాన్ని రప్పిస్తాను. వాళ్ళు లెబో హమాతు ప్రదేశం మొదలు అరాబా వాగు వరకూ మిమ్మల్ని బాధిస్తారు.”
LEUM GOD Kulana El sifacna fahk, “Mwet Israel, nga ac supwaot sie un mwet mweun liki sie facl sac in sruokya acn suwos ac mutala we. Elos ac fah akkeokye kowos, mutawauk ke Innek In Utyak Nu Hamath tafunyen epang, fahla nwe ke Infacl srisrik soko Arabah tafunyen eir.”