< ఆమోసు 5 >
1 ౧ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని గురించి నేను దుఃఖంతో చెప్పే ఈ మాట వినండి.
이스라엘 족속아 내가 너희에게 대하여 애가로 지은 이 말을 들으라
2 ౨ ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.
처녀 이스라엘이 엎드러졌음이여 다시 일어나지 못하리로다 자기 땅에 던지움이여 일으킬 자 없으리로다
3 ౩ యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “ఇశ్రాయేలు వారిలో ఒక పట్టణం నుంచి వెయ్యి మంది బయలుదేరితే వంద మంది మాత్రమే తప్పించుకుని వస్తారు. వంద మంది బయలుదేరితే పది మంది మాత్రమే తప్పించుకుని వస్తారు.”
주 여호와께서 가라사대 이스라엘 중에서 천명이 나가던 성읍에는 백명만 남고 백명이 나가던 성읍에는 열명만 남으리라 하셨느니라
4 ౪ ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెబుతున్నాడు, “నన్ను వెతికి జీవించండి.
여호와께서 이스라엘 족속에게 이르시기를 너희는 나를 찾으라! 그리하면 살리라
5 ౫ బేతేలును ఆశ్రయించవద్దు. గిల్గాలులో అడుగు పెట్టవద్దు. బెయేర్షెబాకు పోవద్దు. గిల్గాలు వారు తప్పకుండా బందీలవుతారు. బేతేలుకు ఇక దుఖమే.”
벧엘을 찾지 말며 길갈로 들어가지 말며 브엘세바로도 나아가지말라 길갈은 정녕 사로잡히겠고 벧엘은 허무하게 될 것임이라 하셨나니
6 ౬ యెహోవాను ఆశ్రయించి జీవించండి. లేకపోతే ఆయన యోసేపు వంశం మీద నిప్పులాగా పడతాడు. అది దహించి వేస్తుంది. బేతేలులో ఎవరూ దాన్ని ఆర్పలేరు.
너희는 여호와를 찾으라! 그리하면 살리라 염려컨대 저가 불 같이 요셉의 집에 내리사 멸하시리니 벧엘에서 그 불들을 끌 자가 없을까 하노라
7 ౭ వాళ్ళు న్యాయాన్ని భ్రష్టం చేసి, నీతిని నేలపాలు చేస్తున్నారు.
공법을 인진으로 변하며 정의를 땅에 던지는 자들아!
8 ౮ ఆయన నక్షత్ర మండలాలను చేసిన వాడు. చీకటిని తెలవారేలా చేసేవాడు. పగటిని రాత్రి చీకటిగా మార్చేవాడు. సముద్రపు నీటిని మబ్బుల్లాగా చేసి భూమి మీద కుమ్మరిస్తాడు.
묘성과 삼성을 만드시며 사망의 그늘로 아침이 되게 하시며 백주로 어두운 밤이 되게 하시며 바닷물을 불러 지면에 쏟으시는 자를 찾으라 그 이름이 여호와시니라
9 ౯ ఆయన పేరు యెహోవా. బలవంతుల మీదికి ఆయన అకస్మాత్తుగా నాశనం రప్పిస్తే కోటలు నాశనమవుతాయి.
저가 강한 자에게 홀연히 패망이 임하게 하신즉 그 패망이 산성에 미치느니라
10 ౧౦ పట్టణ గుమ్మం దగ్గర బుద్ధి చెప్పే వారిని వాళ్ళు అసహ్యించుకుంటారు. యథార్థంగా మాట్లాడే వారిని ఏవగించుకుంటారు.
무리가 성문에서 책망하는 자를 미워하며 정직히 말하는 자를 싫어하는도다
11 ౧౧ మీరు పేదలను అణగదొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు, కాబట్టి మీరు చెక్కిన రాళ్ళతో ఇళ్ళు కట్టుకున్నా వాటిలో నివసించరు. మీకు చక్కటి ద్రాక్ష తోటలు ఉన్నా ఆ ద్రాక్ష మద్యం తాగరు.
너희가 가난한 자를 밟고 저에게서 밀의 부당한 세를 취하였은즉 너희가 비록 다듬은 돌로 집을 건축하였으나 거기 거하지 못할 것이요 아름다운 포도원을 심었으나 그 포도주를 마시지 못하리라
12 ౧౨ మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.
너희의 허물이 많고 죄악이 중함을 내가 아노라 너희는 의인을 학대하며 뇌물을 받고 성문에서 궁핍한 자를 억울하게 하는 자로다
13 ౧౩ అది గడ్డుకాలం గనక ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.
그러므로 이런 때에 지혜자가 잠잠하나니 이는 악한 때임이니라
14 ౧౪ మీరు బతికేలా చెడు విడిచి మంచి వెతకండి. అలా చేస్తే మీరనుకున్నట్టు యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు తప్పకుండా మీతో ఉంటాడు.
너희는 살기 위하여 선을 구하고 악을 구하지 말지어다 만군의 하나님 여호와께서 너희의 말과 같이 너희와 함께 하시리라
15 ౧౫ చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.
너희는 악을 미워하고 선을 사랑하며 성문에서 공의를 세울지어다 만군의 하나님 여호와께서 혹시 요셉의 남은 자를 긍휼히 여기시리라
16 ౧౬ అందుచేత యెహోవా ప్రభువు, సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు.
그러므로 주 만군의 하나님 여호와께서 말씀하시기를 사람이 모든 광장에서 울겠고 모든 거리에서 오호라, 오호라, 하겠으며 농부를 불러다가 애곡하게 하며 울음군을 불러다가 울게 할 것이며
17 ౧౭ ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.”
모든 포도원에서도 울리니 이는 내가 너희 가운데로 지나갈 것임이니라 이는 여호와의 말씀이니라
18 ౧౮ యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది.
화 있을진저 여호와의 날을 사모하는 자여 너희가 어찌하여 여호와의 날을 사모하느뇨 그 날은 어두움이요 빛이 아니라
19 ౧౯ ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురు పడినట్టు, లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది.
마치 사람이 사자를 피하다가 곰을 만나거나 혹 집에 들어가서 손을 벽에 대었다가 뱀에게 물림 같도다
20 ౨౦ యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? కాంతితో కాక చీకటిగా ఉండదా?
여호와의 날이 어찌 어두워서 빛이 없음이 아니며 캄캄하여 빛남이 없음이 아니냐?
21 ౨౧ మీ పండగ రోజులు నాకు అసహ్యం. అవి నాకు గిట్టవు. మీ ప్రత్యేక సభలంటే నాకేమీ ఇష్టం లేదు.
내가 너희 절기를 미워하여 멸시하며 너희 성회들을 기뻐하지 아니하나니
22 ౨౨ నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.
너희가 내게 번제나 소제를 드릴지라도 내가 받지 아니할 것이요 너희 살진 희생의 화목제도 내가 돌아보지 아니하리라
23 ౨౩ మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి. మీ తీగ వాయిద్యాల సంగీతం నేను వినను.
네 노래 소리를 내 앞에서 그칠지어다 네 비파 소리도 내가 듣지 아니하리라
24 ౨౪ నీళ్లలా న్యాయాన్ని పారనివ్వండి. నీతిని ఎప్పుడూ ప్రవహించేలా చేయండి.
오직 공법을 물 같이 정의를 하수 같이 흘릴지로다
25 ౨౫ ఇశ్రాయేలీయులారా, అరణ్యంలో నలభై ఏళ్ళు మీరు బలులనూ నైవేద్యాలనూ నాకు తెచ్చారా?
이스라엘 족속아 너희가 사십년 동안 광야에서 희생과 소제물을 내게 드렸느냐?
26 ౨౬ మీరు మీకోసం కైవాను అనే నక్షత్ర దేవుడి విగ్రహాలను చేసుకున్నారు. సిక్కూతు అనే దేవుడి విగ్రహాన్ని రాజుగా మీరు మోసుకొచ్చారు.
너희가 너희 왕 식굿과 너희 우상 기윤 곧 너희가 너희를 위하여 만들어서 신으로 삼은 별 형상을 지고 가리라
27 ౨౭ కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని బందీలుగా తీసుకుపోతాను, అని యెహోవా చెబుతున్నాడు. ఆయన పేరు సేనల అధిపతి అయిన దేవుడు.
내가 너희를 다메섹 밖으로 사로잡혀 가게 하리라 이는 만군의 하나님이라 일컫는 여호와의 말씀이니라