< ఆమోసు 3 >

1 ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.
以色列人哪,你们全家是我从埃及地领上来的,当听耶和华攻击你们的话:
2 లోకంలోని వంశాలన్నిటిలో మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను. కాబట్టి మీ పాపాలన్నిటికీ మిమ్మల్ని శిక్షిస్తాను.
在地上万族中,我只认识你们; 因此,我必追讨你们的一切罪孽。
3 సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?
二人若不同心,岂能同行呢?
4 దేన్నీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?
狮子若非抓食,岂能在林中咆哮呢? 少壮狮子若无所得,岂能从洞中发声呢?
5 నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా? ఉరిలో ఏదీ చిక్కకపోతే ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?
若没有机槛,雀鸟岂能陷在网罗里呢? 网罗若无所得,岂能从地上翻起呢?
6 పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?
城中若吹角,百姓岂不惊恐呢? 灾祸若临到一城,岂非耶和华所降的吗?
7 తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.
主耶和华若不将奥秘指示他的仆人—众先知, 就一无所行。
8 సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?
狮子吼叫,谁不惧怕呢? 主耶和华发命,谁能不说预言呢?
9 అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి. ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి. వాళ్ళతో ఇలా చెప్పండి, “మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై దానిలోని గందరగోళాన్ని చూడండి. అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.
要在亚实突的宫殿中 和埃及地的宫殿里传扬说: 你们要聚集在撒马利亚的山上, 就看见城中有何等大的扰乱与欺压的事。
10 ౧౦ సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.” యెహోవా ప్రకటించేది ఇదే. వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం, నాశనం దాచుకున్నారు.
那些以强暴抢夺财物、 积蓄在自己家中的人 不知道行正直的事。 这是耶和华说的。
11 ౧౧ కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు. అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు. నీ రాజ భవనాలను దోచుకుంటాడు.
所以主耶和华如此说: 敌人必来围攻这地, 使你的势力衰微, 抢掠你的家宅。
12 ౧౨ యెహోవా చెప్పేదేమిటంటే, “సింహం నోట్లో నుంచి కేవలం రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ కాపరి విడిపించేలాగా సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను. కేవలం మంచం మూల, లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”
耶和华如此说:“牧人怎样从狮子口中抢回两条羊腿或半个耳朵,住撒马利亚的以色列人躺卧在床角上或铺绣花毯的榻上,他们得救也不过如此。”
13 ౧౩ యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి. యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,
主耶和华—万军之 神说: 当听这话,警戒雅各家。
14 ౧౪ “ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు, బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను. బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.
我讨以色列罪的日子,也要讨伯特利祭坛的罪; 坛角必被砍下,坠落于地。
15 ౧౫ చలికాలపు భవనాలనూ వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను. ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి. పెద్ద భవనాలు అంతరించిపోతాయి.” యెహోవా ప్రకటించేది ఇదే.
我要拆毁过冬和过夏的房屋。 象牙的房屋也必毁灭; 高大的房屋都归无有。 这是耶和华说的。

< ఆమోసు 3 >