< ఆమోసు 2 >

1 యెహోవా చెప్పేదేమిటంటే “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు.
Сия глаголет Господь: за три нечестия Моавля и за четыри не отвращуся его, понеже сожгоша кости царя Идумейска в пепел:
2 మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.
и послю огнь на Моава, и пояст основания градов его, и умрет со безсилием Моав, с воплем и гласом трубным:
3 దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.
и потреблю судию из него и вся князи его избию с ним, глаголет Господь.
4 యెహోవా చెప్పేదేమిటంటే “యూదా మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఆయన విధులను గైకొనలేదు.
Сия глаголет Господь: за три нечестия сынов Иудиных и за четыри не отвращуся их, понеже отринуша закон Господень и повелений Его не сохраниша, и прельстиша их суетная их, яже сотвориша, имже последоваша отцы их вслед их:
5 యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”
и послю огнь на Иуду, и пояст основания Иерусалимля.
6 యెహోవా తెలియజేసేది ఏంటంటే “ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.
Сия глаголет Господь: за три нечестия Израиля и за четыри не отвращуся его, понеже продаша праведнаго на сребре и убогаго на сапозех,
7 నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.
ходящих на прасе земнем, и бияху пястию во главы убогих, и путь смиренных совращаху: и сын и отец его влазяста ко единей рабыни, яко да осквернавят имя Бога своего:
8 తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని తమ దేవుని మందిరంలో తాగుతారు.
и ризы своя связующе ужами, и завесы творяху держащыяся требища, и вино от оболганий пияху в дому бога своего.
9 దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా!
Аз же отвергох Аморреа от лица их, егоже бе высота якоже высота кедрова, и крепок бяше якоже дуб, и изсуших плод его с верха и корение его из низу.
10 ౧౦ ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి, అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.
Аз же изведох вы из земли Египетския и обводих вы в пустыни четыредесять лет, еже прияти в наследие землю Аморрейску.
11 ౧౧ మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” యెహోవా వెల్లడించేది ఇదే.
И поях от сынов ваших во пророки и от юнот ваших во освящение: еда несть сих, сынове Израилевы? Глаголет Господь.
12 ౧౨ “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.
И напаясте освященныя вином и пророком заповедасте глаголюще: не прорицайте.
13 ౧౩ చూడండి. ధాన్యంతో నిండిన బండి ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.
Сего ради, се, Аз повращу под вами, якоже вратится колесница полна тростия:
14 ౧౪ చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.
и погибнет бегство от скоротекущаго, и крепкий не удержит крепости своея, и храбрый не спасет души своея,
15 ౧౫ విలుకాడు నిలబడలేడు. వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
и стреляяй из лука не постоит, и быстрый ногама своима не уцелеет, и конник не спасет души своея,
16 ౧౬ ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా నగ్నంగా పారిపోతారు. యెహోవా ప్రకటించేది ఇదే.”
и крепкий не обрящет сердца своего в силах, наг побегнет в той день, глаголет Господь.

< ఆమోసు 2 >