< ఆమోసు 2 >
1 ౧ యెహోవా చెప్పేదేమిటంటే “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు.
耶和华如此说: 摩押三番四次地犯罪, 我必不免去她的刑罚; 因为她将以东王的骸骨焚烧成灰。
2 ౨ మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను. అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది. యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.
我却要降火在摩押, 烧灭加略的宫殿。 摩押必在哄嚷呐喊吹角之中死亡。
3 ౩ దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను. అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.
我必剪除摩押中的审判者, 将其中的一切首领和他一同杀戮。 这是耶和华说的。
4 ౪ యెహోవా చెప్పేదేమిటంటే “యూదా మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి, ఆయన విధులను గైకొనలేదు.
耶和华如此说: 犹大人三番四次地犯罪, 我必不免去他们的刑罚; 因为他们厌弃耶和华的训诲, 不遵守他的律例。 他们列祖所随从虚假的偶像使他们走迷了。
5 ౫ యూదా మీద నేను అగ్ని పంపిస్తాను. అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”
我却要降火在犹大, 烧灭耶路撒冷的宫殿。
6 ౬ యెహోవా తెలియజేసేది ఏంటంటే “ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు. చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.
耶和华如此说: 以色列人三番四次地犯罪, 我必不免去他们的刑罚; 因他们为银子卖了义人, 为一双鞋卖了穷人。
7 ౭ నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు. అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు. తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.
他们见穷人头上所蒙的灰也都垂涎, 阻碍谦卑人的道路。 父子同一个女子行淫, 亵渎我的圣名。
8 ౮ తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు. జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని తమ దేవుని మందిరంలో తాగుతారు.
他们在各坛旁铺人所当的衣服,卧在其上, 又在他们神的庙中喝受罚之人的酒。
9 ౯ దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా! పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ నేను నాశనం చేశాను గదా!
我从以色列人面前除灭亚摩利人。 他虽高大如香柏树,坚固如橡树, 我却上灭他的果子,下绝他的根本。
10 ౧౦ ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి, అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.
我也将你们从埃及地领上来, 在旷野引导你们四十年, 使你们得亚摩利人之地为业。
11 ౧౧ మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను. మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను. ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?” యెహోవా వెల్లడించేది ఇదే.
我从你们子弟中兴起先知, 又从你们少年人中兴起拿细耳人。 以色列人哪,不是这样吗? 这是耶和华说的。
12 ౧౨ “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు. ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.
你们却给拿细耳人酒喝, 嘱咐先知说:不要说预言。
13 ౧౩ చూడండి. ధాన్యంతో నిండిన బండి ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.
看哪,在你们所住之地,我必压你们, 如同装满禾捆的车压物一样。
14 ౧౪ చురుకైన వారు సైతం తప్పించుకోలేరు. బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.
快跑的不能逃脱; 有力的不能用力; 刚勇的也不能自救。
15 ౧౫ విలుకాడు నిలబడలేడు. వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు. రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
拿弓的不能站立; 腿快的不能逃脱; 骑马的也不能自救。
16 ౧౬ ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా నగ్నంగా పారిపోతారు. యెహోవా ప్రకటించేది ఇదే.”
到那日,勇士中最有胆量的, 必赤身逃跑。 这是耶和华说的。