< ఆమోసు 1 >
1 ౧ ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు.
Juda gam’a, Teko’ah kho’a cheng kelngoi ching hat, Amos kitipa heng’a, hiche thuhi ana lhung e. Judah gam’a Uzziah lengvaipoh lai chuleh Israel gam’a Jehoash chapa Jeroboam lengvaipoh laiya, ling kiho masang kum nina-a chu, hiche thuhi Amos in themgao thilmua anamu ahi.
2 ౨ అతడు ఇలా చెప్పాడు, “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.”
Aman hitin aseije, “Pakai ogin gimnei tah chu, Zion lhanga kon a hung kitum ding, chuleh Jerusalem khopia kon’a gamtin thong leuva hung ging ding ahi. Chuleh kelngoi ching ho hamhing dum jouse goplha ding, Carmel lhang’a hamhing ho geija goplha-a thigam dingu ahi.”
3 ౩ యెహోవా చెప్పేదేమిటంటే, “దమస్కు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండాా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు.
Pakaiyin hitin aseiye, “Keiman Damascus khopi talen manlouva ka lha louhel ding ahi. Ajeh chu amiten chonset abol bol jing uvin, anga deh pouvin ahi. Amahon Gilead mun’ah kamite chu thih kangkuiya chang kikui bangin abol’un, ahi.
4 ౪ నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది.
Hijeh’a chu Keiman Hazael lengpa inpi meiya kahal lhah ding, chuleh Ben-hadad lengpa kulpi jong kasuhmang ding ahi.
5 ౫ దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను. బికత్ ఆవెనులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. బెత్ ఏదేనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఆరాము ప్రజలు బందీలుగా కీరు ప్రాంతానికి వెళ్తారు.” అని యెహోవా చెబుతున్నాడు.
Keiman Damascus khopi kotpi ka tumboh ding, chuleh Aven phaicham a cheng miho katha gam ding ahi.
6 ౬ యెహోవా చెప్పేదేమిటంటే, “గాజా మూడుసార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోము వారి వశం చేశారు.
Pakaiyin hitin aseije, “Gaza khopi talen manlouva kalha louhel ding ahi. Ajeh chu amiten chonset abol bol jeng’un, anga deh pouvin ahi. Amahon kho jousea miho abon’un sohchang in atolmang un, Edom gam’a soh in ajohdoh gam tauvin ahi.
7 ౭ గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది.
Hijeh’a chu Keiman Gaza khopi bang ho meiya kahal lhah ding, chuleh akulpi jouse jong kasuhmang ding ahi.
8 ౮ అష్డోదులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. అష్కెలోనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఎక్రోనుకు విరోధంగా నా చెయ్యి ఎత్తుతాను. ఇంకా మిగిలిన ఫిలిష్తీయులు నాశనమవుతారు” అని యెహోవా ప్రభువు చెబుతున్నాడు.
Keiman Ashdod mite ka suhgam ding, chuleh Ashkelon lengpa jong ka suhmang ding ahi. Chuteng Ekron douna-a keiman ka khut kalha ding, Chuleh Philistine mi ahing doh amoh chengse jong thigam diu ahi,” tin Hatchung nung Pakaiyin aseiye.
9 ౯ యెహోవా చెప్పేదేమిటంటే, “తూరు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాళ్ళు ప్రజా సమూహాలన్నిటినీ ఎదోముకు అప్పగించారు. వాళ్ళు సోదర భావంతో చేసుకున్న నిబంధనను తెగతెంపులు చేసుకున్నారు.
Pakaiyin hitin aseiye, “Tyre khopi talen manlouva kalha louhel ding ahi. Ajeh chu amiten chonset abol bol jengun, anga deh pouve. Amahon Israel toh sopi unao hina akitepnau asukeh’un, khojousea miho abon’un Edom gam’a soh chang in ajoh doh gam tauvin ahi.
10 ౧౦ నేను తూరు ప్రాకారాల మీదికి అగ్ని పంపిస్తాను. అది దాని రాజ భవనాలను దహించి వేస్తుంది.”
Hijeh’a chu, Keiman Tyre khopi bang ho meiya ka hallhah ding, chuleh akulpi jouse jong ka suhmang ding ahi,” ati.
11 ౧౧ యెహోవా చెప్పేదేమిటంటే, “ఎదోము మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాడు జాలి చూపకుండా కత్తి పట్టుకుని తన సోదరులను తరిమాడు. అతని కోపం ఎప్పుడూ రగులుతూనే ఉంది. అతని ఆగ్రహం ఎప్పటికీ నిలిచే ఉంది.
Pakaiyin hitin aseiye, “Edom mite talen man louva kalha louhel ding ahi. Ajeh chu amahon chonset abol bol jeng uvin, anga deh pouvin ahi. Amahon asopite, Israelte, chung’a chemjam apan’un adel jeng’un, dipdamna beijin aboltauve. Amahon, alungdam theilou jeh’un, asopite chu asat jing’un, chuleh nasatah in lunghang den in aum tauvin ahi.
12 ౧౨ తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.”
Hijeh’a chu Keiman Teman meiya kahal ding, chuleh Bozrah kulpi jouse jong ka suhmang ding ahi.
13 ౧౩ యెహోవా చెప్పేదేమిటంటే, “అమ్మోనీయులు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎందుకంటే తమ సరిహద్దులను ఇంకా విశాలం చేసుకోవాలని వారు గిలాదులోని గర్భవతుల కడుపులు చీల్చారు.
Pakaiyin hitin aseiye, “Ammon mite talen man louva kalha louhel ding ahi. Ajeh chu amahon chonset abol bol jeng uvin, anga dehpouvin ahi. Amahon gamgi kehbe na ding in, Gilead chu gal asat khum’un, numei gailai ho chemjam in agai acheuvin ahi.
14 ౧౪ రబ్బా ప్రాకారాలను కాల్చేస్తాను. యుద్ధ ధ్వనులతో, సుడి గాలి వీచేటప్పుడు కలిగే ప్రళయం లాగా అది రాజ భవనాలను దహించివేస్తుంది.
Hijeh’a chu keiman Rabbah khopi bangho meiya kahallhah ding, chuleh akulpi jouse jong kasuhmang ding ahi. Hiche gal chu, chimpei nasatah kipei bang ding, chuleh huise gimnei tah gin bang’a, mi peng in husa kithong ding ahi.
15 ౧౫ వారి రాజు, అతని అధిపతులందరూ బందీలుగా దేశాంతరం పోతారు” అని యెహోవా చెబుతున్నాడు.
Chutah leh alengpau leh leng chapate jouse abon’uva, migam’a sohchang ding’a kitolmang soh diu ahi,” tin Pakaiyin aseiye.