< అపొస్తలుల కార్యములు 1 >
1 ౧ తియొఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత
I lañonañe valoha’e nanoekoy, ry Teofily, ami’ty nifotora’ Iesoà nanao, naho nañòke
2 ౨ ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు వరకూ ఆయన చేసిన, బోధించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథాన్ని రచించాను.
pak’ amy andro nampionjonañe azey, ie fa nanoro o Firàheñe jinobo’e añamy Arofo Masiñeio.
3 ౩ ఆయన హింసలు పొందిన తరువాత నలభై రోజులపాటు వారికి కనబడుతూ, దేవుని రాజ్య విషయాలను బోధిస్తూ, అనేక రుజువులను చూపించి వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు.
Aa naho niheneke i halovilovia’ey le niboak’ am’ iereo naho niventè’e an-tsata maro, hampatokisañe iareo t’ie veloñe, vaho niisa’ iareo efa-polo andro, le nitaroña’e i Fifehean’ Añaharey.
4 ౪ ఆయన వారిని కలుసుకుని ఈ విధంగా ఆజ్ఞాపించాడు, “మీరు యెరూషలేమును విడిచి పోవద్దు. నా ద్వారా విన్న తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టండి.
Aa ie nifañaoñe le nafanto’e te tsy hiakats’ Ierosaleme fa handiñe i nampitaman-dRaey: i Jinanji’ areo amakoy.
5 ౫ యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు గానీ కొద్ది రోజుల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు.”
Nampilipotse an-drano t’i Jaona, fe halipotse amy Arofo Masiñey nahareo te heron-kerone.
6 ౬ వారు సమకూడినప్పుడు, “ప్రభూ, ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని పునరుద్ధరిస్తావా?” అని శిష్యులు అడగగా ఆయన,
Aa ie nifanontoñe le nañontanea’ iareo ty hoe: O Rañandria, Hampolie’o am’ Israele henaneo hao i fifeheañey?
7 ౭ “కాలాలూ సమయాలూ తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మీ పని కాదు.
Hoe re tam’ iereo: Tsy anahareo ty hahafohiñe ty andro ndra o sa nalaha n-dRae amy fandilia’eio,
8 ౮ “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” అన్నాడు.
fe handrambe haozarañe nahareo te ivotraha’ i Arofo Masiñey; ho mpitalily ahy e Ierosaleme naho e Iehodà iaby naho e Samaria ao vaho pak’ antsietoitane añe.
9 ౯ ఈ మాటలు చెప్పి, వారు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారికి కనబడకుండా ఆయనను తీసుకు వెళ్ళిపోయింది.
Ie nitsarae’e le nonjoneñe vaho rinambe’ ty rahoñe tsy ho am-pahaisaha’ iareo.
10 ౧౦ ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి,
Ie mbe nitalake mb’andikerañe eñe mb’amy nionjona’ey, hehe te nijohañe añila’ iereo t’indaty roe nisarom-poty
11 ౧౧ “గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.
nanao ty hoe, Ry nte-Galilia, akore t’ie miandrandra mb’ andindìñe ey? Iesoà nirambeseñe boak’ ama’ areo mb’andindimb’eoy ro hibalike manahake i nahaisaha’ areo aze nionjoñe mb’andikerañe eñey.
12 ౧౨ అప్పుడు వారు ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినాన నడవదగినంత దూరంలో ఉంది.
Aa le nibalike mb’e Ierosaleme mb’eo iereo, boak’ami’ty vohitse atao Oliva, mañeva fañaveloan-tSabotse boake Ierosaleme.
13 ౧౩ వారు పట్టణంలో ప్రవేశించి, తాము బస చేస్తున్న మేడగదిలోకి వెళ్ళారు. వారెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, ఉద్యమ కారుడైన సీమోను, యాకోబు కుమారుడు యూదా.
Ie nigodañe ao iereo le niañambone mb’ añ’ efetse ambone ami’ty nitobea’ i Petera naho Iakobe naho i Jaona naho i Andrea, i Filipo naho i Tomasy, i Bartolomeo naho i Matio, Iakobe ana’ i Alfeo naho i Simona Zelota, vaho i Jodasy ana’ Iakobe.
14 ౧౪ వీరూ, వీరితో కూడా కొందరు స్త్రీలూ, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ ఏకగ్రీవంగా, నిలకడగా ప్రార్థన చేస్తూ ఉన్నారు.
Ie nitraok’ ìna naho nitolom-pitalaho naho halaly miharo amo Rakembao naho i Marie rene’ Iesoà vaho o roahalahi’eo.
15 ౧౫ ఆ రోజుల్లో సుమారు నూట ఇరవై మంది శిష్యులు సమావేశమై ఉన్నపుడు పేతురు వారి మధ్య నిలబడి,
Niongak’ añivo’ o rolongoo amy andro rezay t’i Petera (va’e zato tsy roapolo ty aman-tahinañe nifanontoñe ao) le nanao ty hoe:
16 ౧౬ “సోదరులారా, యేసును పట్టుకున్నవారికి దారి చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉంది.
Ry longo, tsi-mete tsy niheneke i Sokitse Masiñe nitokie’ i Arofo Masiñey am-palie’ i Davide i Jodasy niaolo o nitsepake Iesoàoy.
17 ౧౭ ఇతడు మనలో ఒకడుగా లెక్కలోకి వచ్చి ఈ పరిచర్యలో భాగం పొందాడు.
Ie nivolilieñe aman-tika naho nandrambe anjara amo fitoroñañe zao.
18 ౧౮ ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన డబ్బుతో ఒక పొలం కొన్నాడు. అతడు తలకిందులుగా పడి శరీరం బద్దలై పేగులన్నీ బయటికి వచ్చాయి.
(Nahazoan-teteke indatiy amy tamben-tahi’ey, ie nitsirikoake naho niponake, vaho hene niforotrake o tsinai’eo.)
19 ౧౯ ఈ విషయం యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలిసింది. కాబట్టి వారి భాషలో ఆ పొలాన్ని ‘అకెల్దమ’ అంటున్నారు. దాని అర్థం ‘రక్త భూమి.’ ఇందుకు రుజువుగా,
Nanitsike o mpimoneñe e Ierosaleme ao iabio izay vaho tinoka’ iereo ty hoe Akeldama i tonday ami’ty saontsi’ iareo, midika ty hoe: Tondan-dio.
20 ౨౦ ‘అతని ఇల్లు పాడైపోవు గాక, దానిలో ఎవ్వడూ కాపురముండకపోవు గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసికొనును గాక,’ అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంది.
Toe nipatereñe amy boken-Tsaboy, ty hoe: Adono hangoakoake ty traño’e, tsy hiambesara’ ondaty ka, vaho: ho rambese’ ty ila’e i fehe’ey.
21 ౨౧ “కాబట్టి యోహాను బాప్తిసమిచ్చింది మొదలు ప్రభువైన యేసు మన దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిన రోజు వరకూ,
Aa naho ondaty nirekets’ amantika amy ze hene andro niziliha’ i Iesoà Talè naho niakara’e amantika,
22 ౨౨ ఆయన మన మధ్య ఉన్న కాలమంతా మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడ ఆయన పునరుత్థానం గురించి సాక్షిగా ఉండాలి” అని చెప్పాడు.
mifototse amy nampilipora’ i Jaonay pak’amy andro nandrambesañe aze aman-tikañeio; le raik’ amy rezay ty ho mpiaman-tika valolombelo’ i fitroara’ey.
23 ౨౩ అప్పుడు వారు యూస్తు, బర్సబ్బా అనే మారు పేర్లున్న యోసేపునూ, మత్తీయనూ నిలబెట్టి,
Aa le nonjoñeñe roe: Iosefe atao Barsabasy (i Josto ty añaram-binta’e), naho i Matia;
24 ౨౪ ఈ విధంగా ప్రార్థించారు. “అందరి హృదయాలను ఎరిగిన ప్రభూ,
vaho hoe iereo te nihalaly: Ry Iehovà, mpaharofoanañe ze kila arofo, atorò anay ty jinobo’o amo roe retoañe,
25 ౨౫ తన చోటికి వెళ్ళడానికి యూదా దారి తప్పి పోగొట్టుకొన్న ఈ పరిచర్యలో, అపొస్తలత్వంలో పాలు పొందడానికి వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొన్న వాణ్ణి చూపించు.”
handrambesa’e anjara ami’ty fitoroñañe toy naho ty maha-Firàheñe, ie niola t’i Jodasy nivike mb’amy nevae’e ao.
26 ౨౬ తరువాత శిష్యులు వారిద్దరి మీదా చీట్లు వేస్తే మత్తీయ పేరుతో చీటి వచ్చింది కాబట్టి అతనిని పదకొండుమంది అపొస్తలులతో కలిపి లెక్కించారు.
Aa le nanoa’ iareo tsato-piso naho nitsatoke amy Matia, ie ty nitovo’ i Firàheñe folo-raik’ amby rey.