< అపొస్తలుల కార్యములు 6 >
1 ౧ ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు.
У тї ж дні, як намножилось учеників, було наріканнє Єленян на Євреїв, що у щоденному служенню не дбають про вдовиць їх.
2 ౨ అప్పుడు పన్నెండుమంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, “మేము దేవుని వాక్యాన్ని బోధించడం మాని భోజనాలు వడ్డించడం మంచిది కాదు.
Прикликавши ж дванайцять (апостоли) громаду учеників, рекли: Не лвчнть нам, покинувши слово Боже, служити при столах.
3 ౩ కాబట్టి సోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన వారై, మంచి పేరున్న ఏడుగురిని మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమిస్తాం.
Вигледїть же, брати, сїм мужів із вас доброї слави, повних Духа сьвятого та мудрости, котрих поставимо на сю потріб.
4 ౪ మేము మాత్రం ప్రార్థనలోనూ, వాక్య పరిచర్యలోనూ కొనసాగుతూ ఉంటాం” అన్నారు.
Ми ж у молитві і в служенню слова пробувати мем.
5 ౫ ఈ మాట అందరికీ నచ్చింది. కాబట్టి, వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండి ఉన్న స్తెఫను, ఇంకా ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, సీమోను, పర్మెనాసు, యూదామతంలోకి మారిన అంతియొకయ నివాసి నీకొలాసు అనేవారిని ఎంచుకున్నారు.
І вподобалось слово всїй громаді; і вибрали СтеФана, чоловіка, повного віри і Духа сьвятого, та Филипа, та Прохора, та Никанора, та Тимона, та Пармена, та Миколая, нововірця з Антиохиї,
6 ౬ వారిని అపొస్తలుల ముందుంచారు. అపొస్తలులు ప్రార్థన చేసి వారిమీద చేతులుంచారు.
котрих поставили перед апостолами, і помолившись положили вони руки на них.
7 ౭ దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించి శిష్యుల సంఖ్య యెరూషలేములో పెరిగిపోయింది. యాజకుల్లో కూడా చాలామంది విశ్వసించారు.
І росло слово Боже, і намножувалось число учеників у Єрусалимі вельми, й велике множество сьвящеників покорилось вірі.
8 ౮ స్తెఫను కృపతో, బలంతో నిండి ప్రజల మధ్య అద్భుతాలనూ గొప్ప సూచక క్రియలనూ చేస్తున్నాడు.
Стефан же, повний віри й сили, робив чудеса і ознаки великі між народом.
9 ౯ అయితే ‘స్వతంత్రుల సమాజం’ అనే చెందినవారూ, కురేనీయులూ, అలెగ్జాండ్రియా వారు, కిలికియ, ఆసియాకు చెందిన కొంత మందీ వచ్చి స్తెఫనుతో తర్కించారు గాని
Устали ж деякі з школи, званої Либертинців, та Киринейцїв, та Александрийцїв і тих, що з Киликиї та Азиї, перепитуючись із Стефаном.
10 ౧౦ అతని మాటల్లోని తెలివినీ, అతనిని ప్రేరేపించిన ఆత్మనూ వారు ఎదిరించలేక పోయారు.
І не здолїли встояти проти премудрости й духа, яким глаголав.
11 ౧౧ అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు.
Тодї підгустили вони людей, щоб казали, що чули ми його, як він промовляв слова хульні на Мойсея і Бога.
12 ౧౨ ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు.
І підбурили народ, і старшину, й письменників, і напавши схопили його, і привели в раду,
13 ౧౩ అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వారు, “ఈ వ్యక్తి ఎప్పుడూ ఈ పరిశుద్ధ స్థలానికీ మన ధర్మశాస్త్రానికీ విరోధంగా మాట్లాడుతున్నాడు.
і поставили кривих сьвідків, що казали: Сей чоловік не перестає слова хульні говорити проти місця сього сьвятого і проти закону
14 ౧౪ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారాలను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము” అని చెప్పారు.
чули бо ми, як він казав, що Ісус Назорей зруйнує місце се й перемінить, звичаї, котрі Мойсей передав нам.
15 ౧౫ సభలో కూర్చున్న వారంతా అతని వైపు తేరి చూసినపుడు అతని ముఖం దేవదూత ముఖంలా వారికి కనబడింది.
І дивлячись пильно на него всї, що сидїли в радї, видїли лице його якби лице ангела.