< అపొస్తలుల కార్యములు 5 >

1 అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరాతో కలిసి పొలం అమ్మాడు.
Один чоловік, на ім’я Ананія, разом зі своєю дружиною Сапфірою продав свою земельну ділянку
2 భార్యకు తెలిసే అతడు ఆ డబ్బులో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
й [частину] вартості ділянки залишив собі з відома своєї дружини. А решту грошей приніс та поклав до ніг апостолів.
3 అప్పుడు పేతురు, “అననీయా!, నీ భూమి ఖరీదులో కొంత దాచుకుని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకు మోసగించావు?
Тоді Петро сказав йому: «Ананіє, чому сатана наповнив твоє серце, щоб ти збрехав Святому Духові та залишив собі [частину] ціни ділянки?
4 అది నీ దగ్గరున్నపుడు నీదే గదా? అమ్మిన తరువాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు” అని అతనితో చెప్పాడు.
Чи не була вона твоєю до того, як ти її продав? І те, що ти отримав за продаж, чи не було у твоїй владі? Чому ти замислив цей вчинок у твоєму серці? Ти збрехав не людям, а Богові!»
5 అననీయ ఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది విన్న వారందరికీ చాలా భయం వేసింది.
Почувши ці слова, Ананія впав та помер. Великий страх охопив усіх, хто почув про це.
6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతణ్ణి గుడ్డలో చుట్టి మోసుకుపోయి పాతిపెట్టారు.
Молоді люди підійшли, загорнули тіло, винесли та поховали його.
7 సుమారు మూడుగంటల తరువాత అతని భార్య ఏం జరిగిందో తెలియక లోపలికి వచ్చింది.
Через три години прийшла його дружина, яка не знала нічого про те, що сталося.
8 అప్పుడు పేతురు, “మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మారా? నాతో చెప్పు” అని ఆమెనడిగాడు. అందుకామె, “అవును, యింతకే అమ్మాము” అని చెప్పింది.
Петро спитав її: ―Скажи мені, чи за таку ціну ви продали ділянку? ―Так, – відповіла вона, – за таку.
9 అందుకు పేతురు, “ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు? ఇదిగో, నీ భర్తను పాతిపెట్టిన వారింకా లోపలికైనా రాలేదు. వారు నిన్నూ మోసికుని పోతారు” అని ఆమెతో చెప్పాడు.
Петро сказав їй: ―Чому ви змовилися між собою спокусити Духа Господнього? Чуєш кроки біля дверей? Це повертаються ті, що поховали твого чоловіка. Вони й тебе винесуть.
10 ౧౦ వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు.
Тієї ж миті вона впала біля його ніг і померла. Молоді люди, увійшовши, знайшли її мертвою. Тоді винесли й поховали її поряд із чоловіком.
11 ౧౧ సంఘమంతటికీ, ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది.
Великий страх охопив усю церкву й всіх, хто чув про це.
12 ౧౨ ప్రజల మధ్య అపొస్తలుల ద్వారా అనేక సూచకక్రియలూ అద్భుతాలూ జరుగుతూ ఉన్నాయి. నమ్మిన వారంతా కలిసి సొలొమోను మంటపంలో కలుసుకుంటూ ఉన్నారు.
Руками апостолів у народі робилися чудеса та знамення. Усі збиралися разом у колонаді Соломона,
13 ౧౩ తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసే ధైర్యం లేదు. అయితే
і ніхто зі сторонніх не мав сміливості приєднатися до них, хоча народ їх дуже поважав.
14 ౧౪ సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ ఉన్నారు. చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు.
А число тих, хто повірив у Господа, зростало – безліч чоловіків та жінок.
15 ౧౫ పేతురు వస్తూ ఉంటే ప్రజలు రోగులను వీధుల్లోకి తెచ్చి, వారి మీద అతని నీడ అయినా పడాలని మంచాల మీదా పరుపుల మీదా వారిని ఉంచారు.
Люди виносили на вулиці хворих і клали на ліжка та килими, щоб хоч тінь Петра впала на них, коли він проходитиме.
16 ౧౬ యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు, రోగులనూ దురాత్మల చేత బాధల పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగుపడ్డారు.
З навколишніх міст багато [людей] сходилося до Єрусалима, приносячи хворих і тих, кого мучили нечисті духи, і всі отримували зцілення.
17 ౧౭ ప్రధాన యాజకుడూ అతనితో పాటు ఉన్నవారంతా, అంటే సద్దూకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి
Тоді первосвященник і всі, хто належав до угрупування садукеїв, переповнилися заздрощами й, піднявшись,
18 ౧౮ అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు.
схопили апостолів та вкинули їх до громадської в’язниці.
19 ౧౯ అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి
Але ангел Господа вночі відчинив двері в’язниці та, вивівши їх на вулицю, сказав їм:
20 ౨౦ ఈ జీవాన్ని గూర్చిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పండి” అని వారితో అన్నాడు.
«Ідіть у Храм, станьте там та говоріть народові всі слова цього [нового] життя».
21 ౨౧ వారా మాట విని, ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకుడూ, అతనితో ఉన్నవారూ వచ్చి, మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాలకు పంపారు.
Почувши це, вони вдосвіта зайшли в Храм та навчали людей. Тим часом первосвященник і всі, хто був разом із ним, скликали Синедріон і раду всіх старійшин із синів Ізраїлевих та надіслали до в’язниці привести апостолів.
22 ౨౨ భటులు అక్కడికి వెళ్ళి, వారు చెరసాలలో కనబడక పోయేసరికి తిరిగి వచ్చి
Але коли стражники прийшли, то не знайшли апостолів у в’язниці, й, повернувшись, повідомили про це,
23 ౨౩ “చెరసాల చాలా భద్రంగా మూసి ఉంది. కావలివారు తలుపుల ముందు నిలబడి ఉండడం చూశాం గానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకెవరూ కనబడలేదు” అని వారికి చెప్పారు.
кажучи: «В’язницю ми знайшли надійно зачиненою, охорона була перед дверима, але коли ми відчинили, то всередині нікого не знайшли».
24 ౨౪ దేవాలయం అధికారీ, ప్రధాన యాజకులూ ఆ మాట విని ‘ఇది ఏమవుతుందో’ అని వారి విషయమై అయోమయంలో పడిపోయారు.
Почувши ці слова, начальник храмової охорони та первосвященники дуже здивувались, як це могло статися.
25 ౨౫ అప్పుడొకడు వచ్చి, “మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు” అని చెప్పాడు.
Аж тут прийшов хтось та сказав їм: «Ось люди, яких ви вкинули у в’язницю, стоять у Храмі та навчають народ».
26 ౨౬ అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి, ప్రజలు రాళ్లతో కొడతారేమోనని భయపడి,
Тоді начальник храмової охорони пішов зі стражниками та привів апостолів, але не силоміць, оскільки боялися, щоб народ не побив їх камінням.
27 ౨౭ సౌమ్యంగానే వారిని తీసుకుని వచ్చి మహాసభ ముందుంచాడు.
Апостолів привели та поставили перед Синедріоном, і первосвященник спитав їх:
28 ౨౮ ప్రధాన యాజకుడు వారితో, “ఈ నామంలో బోధించవద్దని మేము మీకు కచ్చితంగా ఆజ్ఞాపించాము గదా. అయినా మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, ఈ వ్యక్తి హత్యానేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు” అని చెప్పాడు.
―Чи ми не наказали вам суворо не навчати в це ім’я? Ви ж наповнили Єрусалим своїм вченням і бажаєте зробити нас винними за кров Цієї Людини.
29 ౨౯ అందుకు పేతురు, మిగిలిన అపొస్తలులు ఇలా జవాబిచ్చారు, “మనుషులకు కాక, దేవునికే మేము లోబడాలి గదా.
Петро та інші апостоли відповіли: ―Нам треба слухатися більше Бога, ніж людей!
30 ౩౦ మీరు మానుకు వేలాడదీసి చంపిన యేసును మన పితరుల దేవుడు లేపాడు.
Бог наших батьків воскресив Ісуса, Якого ви вбили, розіп’явши на хресті.
31 ౩౧ ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన, పాప క్షమాపణ దయచేయడానికి దేవుడాయన్ని అధికారిగా, రక్షకునిగా తన కుడి వైపున ఉండే స్థాయికి హెచ్చించాడు.
Його Бог возніс та поклав праворуч від Себе як Засновника та Спасителя, щоб дати Ізраїлеві покаяння та прощення гріхів.
32 ౩౨ మేమూ, దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మా, ఈ సంగతులకు సాక్షులం.”
Свідками цих слів є ми та Дух Святий, Якого Бог дав тим, хто підкоряється Йому.
33 ౩౩ వారీమాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూశారు.
Коли вони почули це, то розлютилися й хотіли їх убити.
34 ౩౪ అప్పుడు అందరి గౌరవం చూరగొన్న ధర్మశాస్త్ర బోధకుడు గమలీయేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను కాసేపు బయట ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇలా అన్నాడు.
Але один фарисей, на ім’я Гамалиїл, учитель Закону, якого поважав весь народ, піднявся в Синедріоні та наказав, щоб чоловіків вивели на деякий час.
35 ౩౫ “ఇశ్రాయేలీయులారా, ఈ మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా.
Тоді промовив: «Ізраїльтяни, будьте уважні, що ви збираєтесь зробити цим людям.
36 ౩౬ కొంతకాలం క్రితం థూదా లేచి తాను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు. అతడు హతుడయ్యాడు. అతనిని అనుసరించిన వారంతా చెల్లా చెదరై పోయారు.
Адже нещодавно повстав Тевда, видаючи себе за когось великого; до нього приєдналося близько чотирьохсот чоловіків. Коли його було вбито, усі послідовники розійшлися, і все закінчилося нічим.
37 ౩౭ అతని తరువాత జనాభా లెక్కలు తీసే రోజుల్లో గలిలయవాడైన యూదా అనేవాడు లేచి, కొంతమందిని తన వైపుకు ఆకర్షించాడు. వాడు కూడా నశించిపోయాడు, వాణ్ణి అనుసరించిన వారంతా చెదరిపోయారు.
Після нього в дні перепису піднявся Юда з Галілеї й потягнув народ за собою. Він загинув, а всі його послідовники розсіялися.
38 ౩౮ కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి వెళ్ళకుండా వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన గానీ వారి పని గానీ మనుషుల వలన కలిగినదైతే, అది వ్యర్థమై పోతుంది.
І зараз кажу вам: облиште цих людей та відпустіть їх. Якщо цей задум та справа від людей, вона зійде нанівець.
39 ౩౯ దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొకవేళ దేవునితో పోరాడే వారవుతారేమో సుమా.”
Але якщо походить від Бога, то не зможете зупинити їх. Щоб часом не виявилось, що ви воюєте з Богом». Його слова переконали їх.
40 ౪౦ వారతని మాటకు అంగీకరించి, అపొస్తలులను పిలిపించి వారిని కొట్టించి, యేసు నామంలో బోధించ వద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు.
Вони покликали апостолів та, побивши їх, наказали їм ще раз не говорити в ім’я Ісуса та відпустили.
41 ౪౧ ఆ నామాన్ని బట్టి అవమానం పొందడానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్ళిపోయారు.
Апостоли залишили Синедріон, радіючи, що виявилися гідними перенести ганьбу за ім’я Ісуса.
42 ౪౨ ప్రతిరోజూ దేవాలయంలో, ఇంటింటా మానకుండా బోధిస్తూ, యేసే క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.
Щодня в Храмі й по домах вони не переставали навчати та звіщати Добру Звістку, що Ісус є Христос.

< అపొస్తలుల కార్యములు 5 >