< అపొస్తలుల కార్యములు 3 >
1 ౧ మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
Lyubha limo, shaa tisha ja ligulo, malanga ga juga Nnungu, a Petili na a Yowana bhatendaga kwendangana ku Likanisha.
2 ౨ పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు.
Gene mobhago bhandunji bhatendaga kunnjigalanga mundu jumo aaliji nangwabha shibhelekwele. Kila lyubha bhatendaga kummikanga nangwabha jula pa nnango gwa Likanisha ushemwa “Nnango Gwakonja,” nkupinga ajuje shoshowe kubhandu bhajinjilangaga Nliekalu.
3 ౩ పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
Akaabhonanjeje a Petili na a Yowana bhalijinjilanga Nliekalu, gwabhajujilenje bhannjangutilanje shindu shoshowe.
4 ౪ పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు.
A Petili na a Yowana gubhannolilenje ku meyo, a Petili gubhashite, “Tulole oti uwe.”
5 ౫ అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు.
Na jwalakwe gwabhalolilenje alilolela kujangutilwa shindu.
6 ౬ అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని
Ikabheje a Petili gubhammalanjile, “Nangali ela wala shaabhu, ikabheje shingwete nne, shinukupe. Kwa mashili ga lina lya a Yeshu Kilishitu Bhanashaleti, jima ujendejende!”
7 ౭ వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
Gubhankamwile nkono gwa kunnilo, gubhannjinwile. Popo pepo makongono na iukuuku ikukolaga mashili.
8 ౮ వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.
Shangupe gwajimi, gwatandwibhe kujendajenda. Gwalongene nabhonji kujinjila ku Likanisha aliumbaumba na kwaakuya a Nnungu.
9 ౯ వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
Bhandunji bhowe bhapalinji pepala gubhammweninji alijimajima alikwaakuya a Nnungu.
10 ౧౦ ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
Bhakammanyanjeje kuti jweneju atamaga na juga pa Nnango Gwakonja, gwa Likanisha, gubhakanganigwenje kwa kaje, bhanagamanyanje gampatile.
11 ౧౧ వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
Bhandunji bhowe, bhali bhakanganigwenje, gubhatandubhenje kubhutushila kulukumbi lwashemwaga, “Lukumbi lwa a Shelemani,” pabha kweneko ni kwaliji mundu aliji nangwabha jula ali alongene na a Petili na a Yowana.
12 ౧౨ పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
Bhai, a Petili bhakaabhonanjeje bhandunji bhala gubhaalugulilenje, “Mmanganya mma Ishilaeli, kwa nndi nnakanganigwanga na genega? Pakuti nnakutukolondosheyanga meyo mbuti kwa mashili getu eu kwa uguja gwetu tuntendile akombole kujendajenda?
13 ౧౩ అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు.
A Nnungu bha ashainabhetu a Bhulaimu na a Ishaka na a Yakobho, bhashikwaakuya bhatumishi bhabho a Yeshu. Bhene bhumwaakanilenje na kwaakamuya kwa a Pilato bhabhulagwe, nkali a Pilato bhaamulishe kuti bhaleshelelwe.
14 ౧౪ పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
Ikabheje mmanganyanji mwashinkwaakananga bhaaliji bha Ukonjelo na bhanguja, nipinga agopolwe mundu juna aaliji mmulaga bhandu.
15 ౧౫ మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
Bhai, gumwaabhulegenje bhene bhali shiumilo sha gumi bhala. Ikabheje a Nnungu bhakwayuyaga, na uwe ni tubhakong'ondela bha genega pugatendeshe.
16 ౧౬ ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
Ngulupai jetu na mashili ga lina lya a Yeshu gashinkumpa mashili na kunnamyiya aju mundu junkummonanga na kummanya, malinga mmowe shinkuti kummonangashi.
17 ౧౭ సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
“Lelo ashaalongo ajangu, mmumanyinji kuti mmanganya na bhanangulungwa bhenunji mwashinkutendanga nneyo pabha nkamumanyangaga.
18 ౧౮ అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియజేసిన సంగతులను ఆయన ఇప్పుడు ఈ విధంగా నెరవేర్చాడు.
Ikabheje genega gamalile, gubhalunguyaga a Nnungu kwa malobhe ga ashinkulondola bhabho bhowe, kuti inapinjikwa a Kilishitu bhabho bhapotekwe.
19 ౧౯ కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.
Bhai, mwipetanje, mwabhujilanje a Nnungu bhanneshelelanje ilebho yenunji,
20 ౨౦ అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
ntendanje nneyo, Bhakulungwa bhampanganje kuangalala mmitima jenunji na bhampeleshelanje a Kilishitu bhubhaagwile bhayene yani a Yeshu.
21 ౨౧ అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం. (aiōn )
Ishipinjikwa bhenebho bhaigale kunnungu peko mpaka gaishile mobha ga alaya ukoto indu yowe, malinga shibhashite lugula a Nnungu kwa malobhe ga ashinkulondola bhabho bha Ukonjelo kuumila bhukala. (aiōn )
22 ౨౨ మోషే నిజంగా ఇలా అన్నాడు కదా, ‘ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.’
Pabha a Musha bhaashite, ‘Bhakulungwa a Nnungu bhenunji shibhampeleshelanje nkulondola jwabho jwa malinga nne kukoposhela munkumbi gwenunji, mumpilikanishiyanje jwenejo kwa yowe yashammalanjilanje.
23 ౨౩ ఆ ప్రవక్త చెప్పినదాన్ని పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమై పోతాడు.
Na jojowe shakane kumpilikanishiya jwene nkulondola jwa a Nnungujo, shabhingwe na bhandunji bha a Nnungu na bhulagwa.’
24 ౨౪ “సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
“Ashinkulondola bha a Nnungu bhowe, tandubhila a Shamweli na bhowe bhaakagulenje, bhatendaga lunguyanga ngani ja indu itendeka nnainoi.
25 ౨౫ ‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
Gene malagano gubhatendile a Nnungu kwa malobhe ga ashinkulondola bhabho gala ni genunji mmanganya, nninginji mmalagano gubhatendile a Nnungu na ashi nakulubhenunji, malinga shibhaabhalanjile a Bhulaimu, ‘Nnubheleko lwenu, bhandunji bhowe bha pashilambolyo shibhapokanje.’
26 ౨౬ దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”
Bhai, a Nnungu bhashikwaakuya bhatumishi bhabho a Yeshu, nkupinga mmanganya ntandubhanje kupwaika, pabha bhashinkwatuma kwenu mmanganya oti, bhampeleshelanje mboka kwa kuntenda ali jowe munkumbi gwenunji aleshe ilebho.”