< అపొస్తలుల కార్యములు 3 >

1 మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.
יום אחד, בשעה שלוש אחר־הצהריים, הלכו פטרוס ויוחנן לתפילת מנחה בבית־המקדש.
2 పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న ఒకణ్ణి కొందరు ప్రతిరోజూ మోసుకొచ్చి ‘సౌందర్యం’ అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. వాడు దేవాలయంలోకి వెళ్ళేవారి దగ్గర బిచ్చమెత్తుకునే వాడు.
כשהגיעו אל המקדש, ראו אדם שהיה פיסח מלידה, יושב ליד השער הנקרא”המהודר“. הוא הובא לשם מדי יום כדי לקבץ נדבות.
3 పేతురు యోహాను దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వారిని బిచ్చమడిగాడు.
כאשר עברו פטרוס ויוחנן לידו, הוא ביקש נדבה גם מהם.
4 పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, “మా వైపు చూడు” అన్నారు.
השניים נעצו באיש מבט נוקב, ופטרוס אמר לו:”הבט אלי!“
5 అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు.
הפיסח הרים את עיניו בתקווה לקבל תרומה נדיבה.
6 అప్పుడు పేతురు, “వెండి బంగారాలు నా దగ్గర లేవు, నాకున్న దాన్నే నీకిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు” అని
אך פטרוס אמר:”כסף אין לי, אולם אתן לך את מה שיש לי; בשם ישוע המשיח מנצרת, התהלך!“
7 వాడి కుడి చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. వెంటనే వాని పాదాలూ, చీలమండలూ బలం పొందాయి.
פטרוס אחז בידו של הפיסח והעמידו על רגליו. באותו רגע נרפאו רגלי האיש וקרסוליו התחזקו, הוא קפץ על רגליו והחל ללכת! האיש הלך איתם לבית־המקדש, כשהוא משבח את האלוהים, מקפץ ומדלג בשמחה.
8 వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు.
9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూశారు.
באי בית־המקדש, שראוהו הולך ומדלג, ושמעוהו מהלל את ה׳,
10 ౧౦ ‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.
הכירו את הקבצן הפיסח שנהגו לראות בשער המקדש, והופתעו מאוד.
11 ౧౧ వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకుని ఉండగా చూసిన జనమంతా విస్మయం చెంది, సొలొమోను మంటపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
כולם מיהרו לצאת לאולם שלמה כדי לראות את הפלא, ואילו הקבצן נצמד בחזקה אל פטרוס ויוחנן.
12 ౧౨ పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితోనో, భక్తితోనో ఇతడు నడిచేలా చేశామన్నట్టు మీరెందుకు మా వైపు అదేపనిగా చూస్తున్నారు?
פטרוס ניצל את ההזדמנות ופנה אל העם:”אנשי ישראל, מדוע אתם מופתעים כל־כך? מדוע אתם מביטים בנו כאילו שבכוחנו ובקדושתנו אנו אפשרנו לאיש הזה ללכת?
13 ౧౩ అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరాయన్ని పిలాతుకు అప్పగించారు, అతడు ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నపుడు మీరు అతని ముందు ఆయనను తిరస్కరించారు.
אלוהי אברהם, יצחק ויעקב – אלוהי אבותינו – הוא שהביא כבוד ותפארת לשם עבדו ישוע באמצעות הנס שחולל. כן, אני מתכוון לאותו ישוע שמסרתם לרומאים, ושדחיתם את הצעת פילטוס לשחררו.
14 ౧౪ పవిత్రుడూ నీతిమంతుడైన వాణ్ణి మీరు తిరస్కరించి, హంతకుణ్ణి మీకోసం విడుదల చేయాలని అడిగారు.
סירבתם לשחרר את הקדוש והצדיק הזה, ודרשתם שפיליטוס ישחרר במקומו רוצח!
15 ౧౫ మీరు జీవానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. అందుకు మేమే సాక్షులం.
וכך הרגתם את שר החיים; אך אלוהים הקימו מן המתים. יוחנן ואני עדים לעובדה זאת, כי לאחר שהרגתם את ישוע ראינו אותו חי וקיים.
16 ౧౬ ఆయన నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగిన ఇతనిని బలపరచింది, యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ముందు ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
”האמונה בשמו של ישוע היא שריפאה אדם זה שכולכם הכרתם כפיסח. האמונה בישוע – שניתנה לנו מאלוהים – היא שריפאה אותו כליל!
17 ౧౭ సోదరులారా, మీరూ మీ నాయకులూ తెలియక చేశారని నాకు తెలుసు.
”אחים יקרים, אני יודע שכל מה שעשיתם אתם ומנהיגיכם לישוע, עשיתם מתוך בורות וחוסר ידיעה.
18 ౧౮ అయితే తన క్రీస్తు తప్పక బాధల పాలు కావాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియజేసిన సంగతులను ఆయన ఇప్పుడు ఈ విధంగా నెరవేర్చాడు.
אולם כך קיים אלוהים את הנבואות האומרות שהמשיח חייב לסבול.
19 ౧౯ కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.
לכן חזרו בתשובה והאמינו באלוהים, כדי שיסלח לחטאיכם, ייתן לכם ימי שגשוג ורווחה, ויחזיר לכם את המשיח המיועד – ישוע המשיח.
20 ౨౦ అభిషిక్తుడైన క్రీస్తు యేసును మీ కోసం ఆయన పంపుతాడు. మీ పాపాలు తుడిచి వేస్తాడు.
21 ౨౧ అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు లోకారంభం నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత చెప్పించాడు. అంతవరకూ యేసు పరలోకంలో ఉండడం అవసరం. (aiōn g165)
כי המשיח צריך להישאר בשמים, עד שתגיע העת להשלים את הכול, כפי שאמרו הנביאים לפני זמן רב. (aiōn g165)
22 ౨౨ మోషే నిజంగా ఇలా అన్నాడు కదా, ‘ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుండి మీకోసం పుట్టిస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు తప్పకుండా వినాలి.’
משה רבנו אמר:’נביא מקרבכם – מאחיכם – כמוני, יקים לכם ה׳ אלוהיכם, אליו תשמעון‘; הקשיבו לדבריו בכובד ראש!
23 ౨౩ ఆ ప్రవక్త చెప్పినదాన్ని పెడచెవిన పెట్టేవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమై పోతాడు.
כי מי שלא ישמע בקולו ייענש חמורות בידי ה׳!
24 ౨౪ “సమూయేలుతో మొదలుపెట్టి మిగతా ప్రవక్తలంతా ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
”גם שמואל וכל הנביאים שקמו אחריו דברו על מה שמתרחש היום.
25 ౨౫ ‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.
אתם הצאצאים של אותם הנביאים, וגם אתם כלולים באותה הברית שכרת ה׳ עם אבותיכם, שבה הבטיח לברך את העולם כולו באמצעות עם ישראל. הרי ה׳ הבטיח לאברהם אבינו:’והתברכו בזרעך כל גויי הארץ‘.
26 ౨౬ దేవుడు తన సేవకుని లేవనెత్తి, మీలో ప్రతివానినీ వాని దుష్టత్వం నుండి తప్పించడం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ దగ్గరికి పంపాడు.”
וכאשר הקים אלוהים את עבדו ישוע מן המתים, הוא שלח אותו קודם כל אליכם, בני ישראל, כדי לברך אתכם שתחזרו בתשובה.“

< అపొస్తలుల కార్యములు 3 >