< అపొస్తలుల కార్యములు 25 >
1 ౧ ఫేస్తు అధికారానికి వచ్చిన మూడు రోజులకు కైసరయ నుండి యెరూషలేము వెళ్ళాడు.
And when Festus arrived at Caesarea, he, after three days, went up to Jerusalem.
2 ౨ అప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, పౌలు మీద తమ ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేశారు.
And the chief priests and the head men of the Jews made representations to him concerning Paul.
3 ౩ “దయచేసి పౌలును యెరూషలేముకు పిలిపించండి” అని ఫేస్తును వారు కోరారు. ఎందుకంటే వారు అతణ్ణి దారిలో చంపడానికి కాచుకుని ఉన్నారు.
And they petitioned him, asking of him the favor, that he would send for him to come to Jerusalem; they placing an ambush to slay him by the way.
4 ౪ అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఖైదీగా ఉన్నాడు. నేను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను.
But Festus made answer: Paul is in custody at Caesarea, whither I am in haste to go.
5 ౫ కాబట్టి మీలో సమర్థులు నాతో వచ్చి అతని మీద నేరమేదైనా ఉంటే మోపవచ్చు” అని జవాబిచ్చాడు.
Therefore, let those among you who are able, go down with us, and make presentment of every offence there is in the man.
6 ౬ అతడు వారి దగ్గర ఎనిమిది లేక పది రోజులు గడిపి కైసరయ వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
And when he had been there eight or ten days, he came down to Caesarea. And the next day, he sat on the tribunal, and commanded Paul to be brought.
7 ౭ పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడి, ఎన్నో తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేక పోయారు.
And when he came, the Jews who had come from Jerusalem surrounded him, and preferred against him many and weighty charges, which they were unable to substantiate.
8 ౮ పౌలు, “యూదుల ధర్మశాస్త్రం గూర్చి గానీ, దేవాలయం గూర్చి గానీ, సీజరును గూర్చి గానీ నేనే తప్పూ చేయలేదు” అని జవాబు చెప్పాడు.
Meanwhile Paul maintained, that he had committed no offence, either against the Jewish law, or against the temple, or against Caesar.
9 ౯ అయితే ఫేస్తు యూదుల చేత మంచి వాడని అనిపించుకోవాలని, “యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు ఈ సంగతులను గూర్చి విచారణకు నిలవడం నీకిష్టమేనా?” అని పౌలును అడిగాడు.
But Festus, because he was disposed to conciliate the favor of the Jews, said to Paul: Wilt thou go up to Jerusalem, and there be tried before me for these things?
10 ౧౦ అందుకు పౌలు, “సీజరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే, యూదులకు నేను ఏ అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు.
Paul replied, and said: I stand before Caesar's tribunal: here I ought to be tried. Against the Jews I have committed no offence, as thou also well knowest.
11 ౧౧ నేను న్యాయం తప్పి మరణానికి తగిన పని ఏదైనా చేసి ఉంటే మరణానికి భయపడను. వీరు నా మీద మోపుతున్న నేరాల్లో ఏదీ నిజం కానప్పుడు నన్ను వారికి ఎవరూ అప్పగించడానికి వీలు లేదు. నేను సీజరు ముందే చెప్పుకొంటాను” అన్నాడు.
If I had committed any crime, or done any thing worthy of death, I would not refuse to die. But if none of the things of which they accuse me, is upon me, no one may sacrifice me to their pleasure. I announce an appeal to Caesar.
12 ౧౨ అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, “సీజరు ముందు చెప్పుకొంటాను అన్నావు కదా, సీజరు దగ్గరకే పంపిస్తాను” అని జవాబిచ్చాడు.
Then Festus conferred with his counsellors, and said: Hast thou declared an appeal to Caesar? Unto Caesar shalt thou go.
13 ౧౩ ఆ తరవాత కొన్ని రోజులకు రాజైన అగ్రిప్ప, బెర్నీకే ఫేస్తును దర్శించడానికి కైసరయ వచ్చారు.
And when some days had passed, Agrippa the king, and Bernice, came down to Caesarea to salute Festus.
14 ౧౪ వారక్కడ చాలా రోజులున్న తరువాత, ఫేస్తు పౌలు గురించి రాజుకు ఇలా చెప్పాడు, “ఫేలిక్సు విడిచిపెట్టి పోయిన ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు.
And when they had been with him: some days, Festus related to the king the case of Paul, saying: A certain man was left a prisoner by Felix:
15 ౧౫ నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, యూదుల పెద్దలూ, అతని మీద ఫిర్యాదు చేసి అతణ్ణి శిక్షించమని కోరారు.
And when I was at Jerusalem, the: chief priests and the Elders of the Jews informed me respecting him, and desired that I would pass judgment upon him in their favor.
16 ౧౬ అందుకు నేను, ‘నేరం ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖాముఖిగా, తన మీద వారు మోపిన నేరం గూర్చి సమాధానం చెప్పుకోడానికి అవకాశం ఇవ్వాలి. అది లేకుండా ఏ మనిషికీ తీర్పు తీర్చడం రోమీయుల పద్ధతి కాదు’ అని జవాబిచ్చాను.
And I told them, It is not the custom of the Romans, to give up a man gratuitously to be slain; until his accuser appeareth and chargeth him to his face, and opportunity is afforded him to make defence respecting what is charged upon him.
17 ౧౭ వారిక్కడికి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయకుండా, మరునాడే న్యాయపీఠం మీద కూర్చుని ఆ వ్యక్తిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాను.
And: when I had come hither, without delay, I the next day sat on the tribunal, and commanded the man to be brought before me.
18 ౧౮ అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు.
And his accusers stood up with him; and they were not able to substantiate any criminal charge against him, as I had expected;
19 ౧౯ కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకడి గూర్చీ ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది. ఆ యేసు బతికే ఉన్నాడని పౌలు చెబుతున్నాడు.
but they had certain controversies with him respecting their worship, and respecting one Jesus, who died, but who, as Paul said, was alive.
20 ౨౦ నేనలాటి వాదాల విషయం ఏ విధంగా విచారించాలో తోచక, యెరూషలేముకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విచారించడం అతనికి ఇష్టమవుతుందేమోనని అడిగాను.
And because I was not well established in regard to these questions, I said to Paul: Dost thou ask to go to Jerusalem, and there be judged concerning these matters?
21 ౨౧ అయితే పౌలు, చక్రవర్తి నిర్ణయం వచ్చేదాకా తనను కావలిలో ఉంచాలని చెప్పడం చేత నేనతణ్ణి సీజరు దగ్గరికి పంపించే వరకూ కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాను.”
But he requested to be reserved for a trial before Caesar: and I ordered him to be kept, till I could send him to Caesar.
22 ౨౨ అందుకు అగ్రిప్ప, “ఆ వ్యక్తి చెప్పుకొనేది నాక్కూడా వినాలనుంది” అన్నాడు. దానికి ఫేస్తు, “రేపు వినవచ్చు” అని చెప్పాడు.
And Agrippa said: I should like to hear that man. And Festus said: To-morrow thou shalt hear him.
23 ౨౩ మరునాడు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా వచ్చి, సైనికాధిపతులతో, పురప్రముఖులతో అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞపై పౌలును తీసుకువచ్చారు.
And the next day, came Agrippa and Bernice, with great pomp, and entered the house of trials, with the Chiliarchs and chiefs of the city: and Festus commanded, and Paul came.
24 ౨౪ అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడ ఉన్న సమస్త ప్రజలారా, మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారు గదా. యెరూషలేములోనూ ఇక్కడా యూదులంతా వీడు ఇక బతకకూడదని కేకలు వేస్తూ అతనికి వ్యతిరేకంగా నాకు మనవి చేసుకున్నారు.
And Festus said: King Agrippa, and all persons present with us; concerning this man whom ye see, all the people of the Jews applied to me, at Jerusalem and also here, crying out, that he ought no longer to live.
25 ౨౫ ఇతడు మరణానికి తగిన పని ఏదీ చేయలేదని నేను గ్రహించాను. కానీ ఇతడు చక్రవర్తి ముందు చెప్పుకొంటానని అనడం చేత ఇతనిని అక్కడికే పంపాలని నిశ్చయించాను.
Yet on investigation, I found that he hath done nothing deserving death. But, because he requested to be reserved for the hearing of Caesar, I have ordered him to be sent.
26 ౨౬ కానీ ఇతని గూర్చి మన చక్రవర్తికి రాయడానికి నాకు సరైన కారణం ఏమీ కనబడలేదు. కాబట్టి విచారణ అయిన తరువాత రాయడానికి ఏమైనా నాకు దొరకవచ్చని మీ అందరి ఎదుటికి, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా, మీ ఎదుటికి ఇతనిని రప్పించాను.
And I know not what I can write to Caesar, in regard to him: and therefore I wished to bring him before you, and especially before thee, king Agrippa; that when his case shall have been heard, I may find what to write.
27 ౨౭ ఖైదీ మీద మోపిన నేరాలను వివరించకుండా అతనిని పంపడం సమంజసం కాదని నా ఉద్దేశం” అని వారితో చెప్పాడు.
For it is unsuitable, when we send up a prisoner, not to designate his offence.