< అపొస్తలుల కార్యములు 24 >
1 ౧ ఐదు రోజుల తరువాత ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది కైసరయ వచ్చి, పౌలు మీద మోపిన ఫిర్యాదును గవర్నరుకి తెలియజేశారు.
По пяти ж днях прийшов архиєрей і Ананїя з старшими і з речником, Тертидом якимся, і озвались вони перед старостою проти Павла.
2 ౨ పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ ఇలా అన్నాడు.
Як же покликано його, почав винувата Тертил, говорячи: Дознаючи через тебе великого впокою і всякого добра, що стало ся народові сьому за твоїм дбаннєм,
3 ౩ “మహా ఘనత వహించిన ఫేలిక్స్, పౌలు గవర్నర్ ఎదుట నిలబడినప్పుడు ఎంతో నెమ్మది అనుభవిస్తున్నామనీ, ఈ దేశ ప్రజలకు కలిగే అనేక సమస్యలు మీ ద్వారా పరిష్కారం అవుతున్నాయనీ ఒప్పుకొంటున్నాము. ఆ కారణంగా మేము అన్ని విధాలా, అన్ని చోట్లా మీ పట్ల పూర్ణ కృతజ్ఞత కలిగి ఉన్నాం.
завсїди і всюди приймаємо (се), вельможний Феликсе, з усякою дякою.
4 ౪ నేను మీకు ఎక్కువ విసుగు పుట్టించకుండా క్లుప్తంగా చెప్పే విషయాలను మీరు సహనంతో వినాలని వేడుకొంటున్నాను.
Та, щоб довго тобі не докучати, благаю вислухати нас у коротці, твоєю ласкою.
5 ౫ ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం.
Знайшли бо ми, що чоловік сей зараза, й зачинщик бучи між усїма Жидами по вселенній, і ватажок Назорейскої єресі,
6 ౬ పైగా ఇతడు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడు. అందువలన మేము అతణ్ణి నిర్బంధించాం
що й церкву зважив ся опоганити; ми його й узяли, й хотіли по нашому закону судити.
7 ౭ అయితే మీ సైనికాధికారి లూసియస్ వచ్చి బలవంతంగా పౌలును మా చేతుల్లోనుంచి విడిపించి తీసుకుపోయాడు.
Пристигши ж Лизия тисячник, з великим насильством узяв його з наших рук,
8 ౮ వీటిని గురించి మీరు పౌలును ప్రశ్నిస్తే మేము ఇతని మీద మోపుతున్న నేరాలన్నీ వాస్తవమని మీకే అర్థం అవుతుంది.”
звелівши винувателям його йти до тебе. Від него можеш сам, як схочеш, про все дознатись, за що ми винуємо його.
9 ౯ యూదులంతా ఏకీభవించి ఈ మాటలు నిజమే అని చెప్పారు.
Пристали ж (на се) й Жиди, говорячи, що се так єсть.
10 ౧౦ అప్పుడు గవర్నర్, పౌలును మాట్లాడమని సైగ చేశాడు. పౌలు ఇలా అన్నాడు, “మీరు అనేక సంవత్సరాలుగా ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలిసి నేను ధైర్యంగా జవాబు చెప్పుకుంటున్నాను.
Озвав ся Павел, як кивнув йому староста говорити: Знаючи від многих літ тебе суддею народові сьому, тим раднїщ про себе відповідаю.
11 ౧౧ నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.
Ти можеш розвідатись, що не більш, як дванайпять днів, відколи я прийшов поклонитись у Єрусалим.
12 ౧౨ దేవాలయంలోగానీ, సమాజ మందిరాల్లోగానీ, పట్టణంలోగానీ, నేను ఎవరితోనైనా తర్కించడం, లేదా ప్రజల మధ్య అల్లరి రేపడం ఎవరూ చూడలేదు.
Та й ні в церкві не знайшли мене, щоб я до кого промовляв, або робив усобицю в народі, нї по школах, нї в городі;
13 ౧౩ వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు.
анї довести мені не можуть, у чому тепер винують мене.
14 ౧౪ అయితే ఒక సంగతి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి,
Визнаю ж тобі се, що в сьому путю, котрий вони звуть єрессю, служу так отецькому Богу, віруючи всьому, що по закону і що в пророках написане,
15 ౧౫ నీతిపరులకూ అనీతిపరులకూ పునరుత్థానం కలుగుతుందని వీరు నమ్ముతున్నట్టుగానే నేను కూడా దేవునిలో నమ్మకముంచి, వారు మతశాఖ అని పిలిచిన ఈ మార్గంలోనే నా పూర్వీకుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను.
маючи надію в Бозї, чого й самі оці сподївають ся, що має бути воскресеннє мертвих праведних і неправедних.
16 ౧౬ ఈ విధంగా నేను దేవుని పట్లా, మనుష్యుల పట్లా ఎప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకుంటున్నాను.
На те я й подвизаюсь, щоб мати по всяк час чисту совість перед Богом і людьми.
17 ౧౭ “కొన్ని సంవత్సరాలైన తరువాత నేను నా సొంత ప్రజలకి దాన ధర్మంగా డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను.
По многих же лїтах прийшов я зробити милостиню народові моєму та приноси.
18 ౧౮ నేను శుద్ధి చేసుకుని వాటిని అప్పగిస్తుండగా వీరు దేవాలయంలో నన్ను చూశారు. నేనేమీ గుంపు కూర్చలేదు, నా వలన అల్లరీ కాలేదు.
У сьому знайшли мене очищеного в церкві, - ані з натовпом, анї з бучею, - деякі Жиди з Азиї,
19 ౧౯ అయితే ఆసియ నుండి వచ్చిన కొందరు యూదులు ఉన్నారు. నామీద వారికేమైన ఉంటే వారే మీ దగ్గరికి వచ్చి నా మీద నేరం మోపి ఉండవలసింది.
котрим би треба перед тебе прийти й винувати, коли б що мали проти мене.
20 ౨౦ లేదా, నేను మహాసభలో నిలబడి ఉన్నప్పుడు, ‘మృతుల పునరుత్థానం గురించి నేడు మీ ఎదుట విమర్శ పాలవుతున్నాను’ అని నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయమై తప్ప నాలో మరి ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు.”
Або самі оці нехай скажуть, чи знайшли в менї яку неправду, як стояв я перед радою,
окрім одного голосу сього, котрим покликнув, стоячи між ними, що за воскресеннє мертвих я суд приймаю сьогоднї од вас.
22 ౨౨ ఫేలిక్సుకు ఈ మార్గం గూర్చి బాగా తెలుసు. అతడు, “సహస్రాధిపతి లూసియస్ వచ్చినప్పుడు నీ సంగతి నేను విచారించి తెలుసుకుంటాను” అని చెప్పి విచారణ నిలిపివేశాడు.
Вислухавши ж се Феликс, відослав їх, докладнїщ довідавшись про путь сей, говорячи: Як Лизия тисячник прийде, розберу вашу справу.
23 ౨౩ పౌలుని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారం చేయడానికి అతని బంధువుల్లో ఎవరినీ ఆటంకపరచవద్దని శతాధిపతికి ఆజ్ఞాపించాడు.
І звелїв сотникові стерегти Павла, й давати волю, і нікому з його знакомих не забороняти послугувати Або приходити до него.
24 ౨౪ కొన్ని రోజుల తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తు యేసులో విశ్వాసం గూర్చి అతడు బోధించగా విన్నాడు.
По кількох же днях, прибувши Феликс із жінкою своєю Друзилого, Жидівкою, покликав Павла, і слухав його про віру в Христа.
25 ౨౫ అప్పుడు పౌలు నీతిని గూర్చీ ఆశానిగ్రహం గూర్చీ రాబోయే తీర్పును గూర్చీ ప్రసంగిస్తుండగా ఫేలిక్సు చాలా భయపడి, “ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను” అని చెప్పాడు.
Як же говорив він про правду і здержаннє, і про суд, що має бути, злякавшись Феликс, озвав ся: Тепер годі, іди; мавши час, по кличу тебе.
26 ౨౬ తరువాత పౌలు తనకు ఏమైనా లంచం ఇస్తాడేమోనని ఆశపడి, అతణ్ణి మాటిమాటికీ పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు.
До того ж сподївав ся, що й грошей здобуде від Павла, щоб випустив його, тим же й часто прикликаючи його, бесідував з ним.
27 ౨౭ రెండు సంవత్సరాల తరువాత ఫేలిక్సుకు బదులుగా పోర్కియస్ ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. అప్పుడు ఫేలిక్సు యూదుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని, పౌలును చెరసాల్లోనే విడిచిపెట్టి వెళ్ళాడు.
Як же скінчилось два роки, перемінив Феликса Порцій Фест, а Феликс хотячи угодити Жидам, оставив Павла закованого.