< అపొస్తలుల కార్యములు 23 >

1 పౌలు మహా సభవారిని సూటిగా చూసి, “సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నడచుకుంటున్నాను” అని చెప్పాడు.
A Pavle pogledavši na skupštinu reèe: ljudi braæo! ja sa svom dobrom savjesti življeh pred Bogom do samoga ovog dana.
2 అందుకు ప్రధాన యాజకుడు అననీయ, “అతన్ని నోటి మీద కొట్టండి” అని దగ్గర నిలబడిన వారికి ఆజ్ఞాపించాడు.
A poglavar sveštenièki Ananija zapovjedi onima što stajahu kod njega da ga biju po ustima.
3 పౌలు అతణ్ణి చూసి, “సున్నం కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొడతాడు. నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని, ధర్మశాస్త్రానికి విరోధంగా నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా?” అన్నాడు.
Tada mu reèe Pavle: tebe æe Bog biti, zide okreèeni! I ti sjediš te mi sudiš po zakonu, a prestupajuæi zakon zapovijedaš da me biju.
4 అప్పుడు దగ్గర ఉన్నవారు, “నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషిస్తున్నావేంటి?” అన్నారు.
A oni što stajahu naokolo rekoše: zar psuješ Božijeg poglavara sveštenièkoga?
5 అందుకు పౌలు, “సోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. ‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు’ అని రాసి ఉంది” అన్నాడు.
A Pavle reèe: ne znadoh, braæo, da je poglavar sveštenièki, jer stoji napisano: starješini naroda svojega da ne govoriš ružno.
6 అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, “సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను.” అని సభలో గొంతెత్తి చెప్పాడు.
A znajuæi Pavle da je jedan dio sadukeja a drugi fariseja, povika na skupštini: ljudi braæo! ja sam farisej i sin farisejev: za nad i za vaskrsenije iz mrtvijeh doveden sam na sud.
7 అతడా విధంగా చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది.
A kad on ovo reèe, postade raspra meðu sadukejima i farisejima, i razdijeli se narod.
8 సద్దూకయ్యులు పునరుత్థానం లేదనీ, దేవదూత గానీ, ఆత్మగానీ లేదనీ చెబుతారు. కాని పరిసయ్యులు ఇవన్నీ ఉన్నాయంటారు.
Jer sadukeji govore da nema vaskrsenija, ni anðela ni duha; a fariseji priznaju oboje.
9 అప్పుడు పెద్ద గోల పుట్టింది. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, “ఈ మనిషిలో ఏ దోషమూ మాకు కనబడలేదు. బహుశా ఒక ఆత్మగానీ, దేవదూతగానీ అతనితో మాట్లాడాడేమో” అని వాదించారు.
I postade velika vika, i ustavši književnici od strane farisejske prepirahu se meðu sobom govoreæi: nikakvo zlo ne nalazimo na ovome èovjeku; ako li mu govori duh ili anðeo, da se ne suprotimo Bogu.
10 ౧౦ కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి, “వారి మధ్య నుండి అతణ్ణి బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకుని రండి” అని సైనికులకు ఆజ్ఞాపించాడు.
A kad posta raspra velika, pobojavši se vojvoda da Pavla ne raskinu, zapovjedi da siðu vojnici i da ga otmu izmeðu njih, i da ga odvedu u oko.
11 ౧౧ ఆ రాత్రి ప్రభువు అతని పక్కన నిలబడి “ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చెప్పావో అదే విధంగా రోమ్ నగరంలో కూడా చెప్పాల్సి ఉంటుంది” అని చెప్పాడు.
A onu noæ stade Gospod predanjga i reèe: ne boj se, Pavle, jer kao što si svjedoèio za mene u Jerusalimu, tako ti valja i u Rimu svjedoèiti.
12 ౧౨ తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు.
A kad bi dan, uèiniše neki od Jevreja vijeæu i zakleše se govoreæi da neæe ni jesti ni piti dokle ne ubiju Pavla.
13 ౧౩ నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు.
A bješe ih više od èetrdeset koji ovu kletvu uèiniše.
14 ౧౪ వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం.
Ovi pristupivši ka glavarima sveštenièkijem i starješinama, rekoše: kletvom zaklesmo se da neæemo ništa okusiti dok ne ubijemo Pavla;
15 ౧౫ కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరికి తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం” అని చెప్పారు.
Sad dakle vi sa saborom kažite vojvodi da ga sjutra svede k vama, kao da biste htjeli doznati bolje za njega; a mi smo gotovi da ga ubijemo prije nego se on približi.
16 ౧౬ అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు.
A sin sestre Pavlove èuvši ovu zasjedu doðe i uðe u oko i kaza Pavlu.
17 ౧౭ అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరకి తీసుకు వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది” అన్నాడు.
A Pavle dozvavši jednoga od kapetana reèe: ovo momèe odvedi k vojvodi, jer ima nešto da mu kaže.
18 ౧౮ శతాధిపతి ఆ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని పోయి, “ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకుపొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట” అని చెప్పాడు.
A on ga uze i dovede k vojvodi, i reèe: sužanj Pavle dozva me i zamoli da ovo momèe dovedem k tebi koje ima nešto da ti govori.
19 ౧౯ సహస్రాధిపతి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని అవతలికి తీసుకుపోయి, ‘నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?’ అని ఒంటరిగా అడిగాడు.
A vojvoda uzevši ga za ruku, i otišavši nasamo, pitaše ga: šta je što imaš da mi kažeš?
20 ౨౦ అందుకతడు, “నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరికి తీసుకురావాలని నిన్ను బతిమాలడానికి యూదులు ఎదురు చూస్తున్నారు.
A ono reèe: Jevreji dogovoriše se da te zamole da sjutra svedeš Pavla k njima na skupštinu, kao da bi htjeli bolje ispitati za njega;
21 ౨౧ వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు” అని చెప్పాడు.
Ali ti ih nemoj poslušati, jer ga èekaju od njih više od èetrdeset ljudi koji su se zakleli da neæe ni jesti ni piti dokle ga ne ubiju; i sad su gotovi, i èekaju tvoje obeæanje.
22 ౨౨ అప్పుడు ఆ సహస్రాధిపతి, “నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్దు” అని హెచ్చరించి పంపేశాడు.
A vojvoda onda otpusti momèe zapovjedivši mu: nikom ne kazuj da si mi ovo javio.
23 ౨౩ తరువాత అతడు ఇద్దరు శతాధిపతులను పిలిచి, “కైసరయ వరకూ వెళ్ళడానికి రెండు వందల మంది సైనికులనూ డెబ్భై మంది గుర్రపురౌతులనూ రెండు వందలమంది ఈటెల వారినీ రాత్రి తొమ్మిది గంటలకల్లా సిద్ధపరచండి.
I dozvavši dvojicu od kapetana reèe: pripravite mi dvjesta vojnika da idu do Æesarije, i sedamdeset konjika i dvjesta strijelaca, po treæemu sahatu noæi.
24 ౨౪ గవర్నర్ ఫేలిక్సు దగ్గరికి తీసుకుపోవడానికి గుర్రాలను ఏర్పాటు చేయండి” అని చెప్పాడు.
I neka dovedu konje da posade Pavla, i da ga prate do Filiksa sudije.
25 ౨౫ అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాశాడు,
I napisa poslanicu u kojoj ovako govoraše:
26 ౨౬ “అత్యంత గౌరవనీయులైన గవర్నర్ ఫేలిక్సుకు, క్లాడియస్ లూసియస్ వందనాలు.
Od Klaudija Lisije èestitome Filiksu pozdravlje.
27 ౨౭ యూదులు ఈ వ్యక్తిని పట్టుకుని చంపబోతుండగా, అతడు రోమీయుడని విని, సైనికులతో వెళ్ళి అతణ్ణి తప్పించాను.
Èovjeka ovoga uhvatiše Jevreji i šæahu da ga ubiju; ja pak doðoh s vojnicima i oteh ga doznavši da je Rimljanin.
28 ౨౮ వారు అతని మీద మోపిన నేరమేమిటో తెలుసుకోవాలని నేను వారి మహాసభకు అతణ్ణి తీసుకువెళ్ళాను.
I želeæi doznati uzrok za koji ga krive svedoh ga na njihovu skupštinu.
29 ౨౯ వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఏవో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని, చెరసాలకు గాని తగిన నేరమేదీ అతనిలో చూపలేదు.
Tada naðoh da ga krive za pitanja zakona njihova, a da nema nikakve krivice koja zaslužuje smrt ili okove.
30 ౩౦ అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తున్నారని నాకు తెలిసి, వెంటనే అతణ్ణి మీ దగ్గరికి పంపించాను. నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్న సంగతిని మీ ముందే చెప్పుకోవాలని ఆజ్ఞాపించాను.”
I doznavši ja ugovor Jevrejski o glavi ovoga èovjeka odmah ga poslah k tebi zapovjedivši i suparnicima njegovijem da pred tobom kažu što imaju na nj. Zdrav budi!
31 ౩౧ కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలుని రాత్రి పూట అంతిపత్రి తీసుకువెళ్ళారు.
A vojnici onda, kao što im se zapovjedi, uzeše Pavla i odvedoše ga noæu u Antipatridu.
32 ౩౨ మరునాడు వారు గుర్రపు రౌతులను పౌలుతో పంపి తమ కోటకు తిరిగి వెళ్ళారు.
A sjutradan ostavivši konjike da idu s njim, vratiše se u oko.
33 ౩౩ వారు కైసరయ వచ్చి గవర్నరుకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నిలబెట్టారు.
A oni došavši u Æesariju, predaše poslanicu sudiji i izvedoše Pavla preda nj.
34 ౩౪ గవర్నర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏ ప్రాంతపు వాడని అడిగాడు. కిలికియకు చెందినవాడని తెలుసుకుని,
A sudija proèitavši poslanicu zapita odakle je; i doznavši da je iz Kilikije
35 ౩౫ “నీ మీద నేరం మోపిన వారు కూడా వచ్చిన తరువాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాను” అని చెప్పి, హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.
Reèe: ispitaæu te kad suparnici tvoji doðu. I zapovjedi da ga èuvaju u dvoru Irodovom.

< అపొస్తలుల కార్యములు 23 >