< అపొస్తలుల కార్యములు 21 >

1 మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్ళి కోసు పట్టణానికి, మరునాడు రొదు పట్టణానికి, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం.
După ce ne-am despărțit de ei și am pornit, am ajuns în linie dreaptă la Cos, iar a doua zi la Rodos și de acolo la Patara.
2 అక్కడ ఫేనీకే బయలుదేరుతున్న ఒక ఓడను చూసి దానిలో ఎక్కాం.
După ce am găsit o corabie care traversa spre Fenicia, ne-am urcat la bord și am pornit.
3 దానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ ఉండగా దానికి ఎడమ పక్కగా ప్రయాణించి, సిరియా వైపుగా వెళ్ళి, తూరులో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చెయ్యాల్సి ఉంది.
După ce am ajuns în dreptul Ciprului, lăsându-l la stânga, am navigat spre Siria și am debarcat la Tir, căci nava se afla acolo pentru a-și descărca încărcătura.
4 మేమక్కడి శిష్యులను కలుసుకుని అక్కడ ఏడు రోజులు ఉన్నాం. వారు ఆత్మ ద్వారా “నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దు” అని పౌలుతో చెప్పారు.
După ce am găsit discipoli, am rămas acolo șapte zile. Aceștia i-au spus lui Pavel, prin Duhul Sfânt, că nu trebuie să se urce la Ierusalim.
5 ఆ రోజులు గడిచిన తరువాత మేము ప్రయాణమైనప్పుడు వారంతా భార్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటి వరకూ సాగనంపారు. వారూ, మేమూ సముద్రతీరంలో మోకాళ్ళపై ప్రార్థించి ఒకరి దగ్గర మరొకరు సెలవు తీసుకున్నాం.
După ce au trecut acele zile, am plecat și ne-am continuat călătoria. Toți, cu soțiile și copiii, ne-au însoțit pe drum până când am ieșit din oraș. Îngenunchind pe plajă, ne-am rugat.
6 మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
După ce ne-am luat rămas bun, ne-am urcat pe corabie, iar ei s-au întors din nou acasă.
7 మేము తూరు నుండి ప్రయాణించి, తొలెమాయికి వచ్చి, అక్కడి సోదరులను పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం.
După ce am plecat din Tir, am ajuns la Ptolemaida. I-am întâmpinat pe frați și am rămas cu ei o zi.
8 మరునాడు బయలుదేరి కైసరయ వచ్చి, అపొస్తలులు నియమించిన ఏడుగురిలో ఒకడైన సువార్తికుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం.
A doua zi, noi, care eram tovarășii lui Pavel, am plecat și am ajuns la Cezareea. Am intrat în casa lui Filip, evanghelistul, care era unul dintre cei șapte, și am rămas cu el.
9 ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు.
Omul acesta avea patru fiice fecioare care profețeau.
10 ౧౦ మేమక్కడ చాలా రోజులు ఉన్నాం. అగబు అనే ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చాడు.
Pe când stăteam acolo câteva zile, a coborât din Iudeea un profet numit Agabus.
11 ౧౧ అతడు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని, దానితో తన చేతులను కాళ్ళను కట్టుకుని, “యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల వ్యక్తిని ఈ విధంగా బంధించి, యూదేతరుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడు” అన్నాడు.
Venind la noi și luând centura lui Pavel, și-a legat singur picioarele și mâinile și a zis: “Duhul Sfânt spune: “Astfel, iudeii din Ierusalim vor lega pe omul care are această centură și îl vor da în mâinile neamurilor.””
12 ౧౨ ఈ మాట విన్నప్పుడు మేమూ, అక్కడివారూ యెరూషలేముకు వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొన్నాం.
Când am auzit aceste lucruri, noi și oamenii din locul acela l-am rugat să nu se suie la Ierusalim.
13 ౧౩ కానీ పౌలు, “ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తం యెరూషలేములో బంధకాలకే కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు.
Atunci Pavel a răspuns: “Ce faceți, plângeți și îmi frângeți inima? Căci sunt gata nu numai să fiu legat, ci și să mor la Ierusalim pentru Numele Domnului Isus.”
14 ౧౪ అతడు మనసు మార్చుకోడని గ్రహించాక మేము, “ప్రభువు చిత్తం జరుగుతుంది గాక” అని ఊరుకున్నాం.
Și cum nu se lăsa convins, am încetat, zicând: “Facă-se voia Domnului!”
15 ౧౫ ఆ రోజులు గడచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేముకు ప్రయాణించాం.
După aceste zile, ne-am luat bagajele și ne-am suit la Ierusalim.
16 ౧౬ మాతో కలిసి కైసరయ నుంచి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోను దగ్గరికి మమ్మల్ని తీసుకుపోయారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు.
Unii dintre ucenicii din Cezareea au mers și ei cu noi, aducând și pe un anume Mnason din Cipru, un ucenic dintâi, la care urma să rămânem.
17 ౧౭ మేము యెరూషలేము చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు.
Când am ajuns la Ierusalim, frații ne-au primit cu bucurie.
18 ౧౮ మరునాడు పెద్దలంతా అక్కడికి వచ్చినపుడు పౌలు మాతో కలిసి యాకోబు దగ్గరికి వచ్చాడు.
A doua zi, Pavel a intrat cu noi la Iacov; și toți bătrânii erau de față.
19 ౧౯ అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యూదేతరుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పాడు.
După ce i-a salutat, a relatat unul câte unul lucrurile pe care le făcuse Dumnezeu printre neamuri prin slujba lui.
20 ౨౦ అది విని వారు దేవుణ్ణి మహిమపరచి అతనితో, “సోదరా, యూదుల్లో విశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చూశావు గదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి గలవారు.
Aceștia, când au auzit, au slăvit pe Dumnezeu. I-au zis: “Vezi, frate, câte mii sunt printre iudei dintre cei care au crezut și toți sunt zeloși pentru Lege.
21 ౨౧ యూదేతరుల మధ్య నివసించే యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాలను పాటించకూడదనీ నీవు చెప్పడం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడి వారికి సమాచారం ఉంది.
Ei au fost informați despre tine, că îi înveți pe toți iudeii care sunt printre neamuri să se lepede de Moise, spunându-le să nu-și taie împrejur copiii și să nu umble după obiceiuri.
22 ౨౨ కాబట్టి మనమేం చేద్దాం? నీవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది.
Și atunci, ce este? Adunarea trebuie să se întrunească cu siguranță, căci vor auzi că ai venit.
23 ౨౩ మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు.
Faceți deci ceea ce vă spunem. Avem patru bărbați care au făcut un jurământ.
24 ౨౪ నీవు వారిని తీసుకుపోయి వారితో కూడా శుద్ధి చేసుకుని, వారు తల క్షౌరం చేయించుకోడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గూర్చి తాము విన్న సమాచారం నిజం కాదనీ, నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే వ్యక్తివనీ వీరు గ్రహిస్తారు.
Ia-i și purifică-te împreună cu ei și plătește-le cheltuielile pentru ei, ca să-și radă capul. Atunci vor ști cu toții că nu este niciun adevăr în lucrurile despre care au fost informați despre tine, ci că și tu însuți umbli respectând Legea.
25 ౨౫ అయితే విశ్వసించిన యూదేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, వారికి రాశాం, జారత్వాన్నీ మానాలని నిర్ణయించి వారికి రాశాం” అని చెప్పారు.
Dar în ceea ce privește neamurile care cred, am scris hotărârea noastră că nu trebuie să respecte nimic de acest fel, decât să se ferească de mâncarea oferită idolilor, de sânge, de lucrurile sugrumate și de imoralitatea sexuală.”
26 ౨౬ కాబట్టి పౌలు ఆ మరునాడు మొక్కుబడి ఉన్న ఆ వ్యక్తులను వెంటబెట్టుకుని వెళ్ళి, వారితో కలిసి శుద్ధి చేసుకుని, దేవాలయంలో ప్రవేశించి, వారందరి పక్షంగా కానుక అర్పించే వరకూ శుద్ధిదినాలు నెరవేరుస్తానని చెప్పాడు.
Pavel a luat pe bărbați, s-a curățit a doua zi și a mers cu ei în Templu, și a vestit împlinirea zilelor de curățire, până când s-a adus jertfă pentru fiecare dintre ei.
27 ౨౭ ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియ నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకుని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి
Când cele șapte zile erau aproape împlinite, iudeii din Asia, văzându-l în templu, au stârnit toată mulțimea și au pus mâinile pe el,
28 ౨౮ “ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు.
strigând: “Bărbați ai lui Israel, ajutor! Acesta este omul care îi învață pe toți oamenii de pretutindeni împotriva poporului, a legii și a acestui loc. Mai mult, el a adus și greci în templu și a pângărit acest loc sfânt!”
29 ౨౯ ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడని వారు భావించారు.
Căci îl văzuseră pe Trofim, efescianul, împreună cu el în cetate, și au presupus că Pavel l-a adus în templu.
30 ౩౦ పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు.
Toată cetatea s-a mișcat și poporul a alergat. L-au prins pe Pavel și l-au târât afară din templu. Imediat ușile au fost închise.
31 ౩౧ వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది.
În timp ce încercau să-l ucidă, a sosit la comandantul regimentului vestea că tot Ierusalimul era în zarvă.
32 ౩౨ వెంటనే అతడు సైనికులనూ, శతాధిపతులనూ వెంటబెట్టుకుని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు.
Imediat a luat soldați și centurioni și a alergat la ei. Aceștia, când i-au văzut pe căpitanul principal și pe soldați, au încetat să-l mai bată pe Pavel.
33 ౩౩ అతడు వచ్చి పౌలును పట్టుకుని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, “ఇతడెవడు? ఏమి చేశాడు?” అని అడిగాడు.
Atunci comandantul s-a apropiat, l-a arestat, a poruncit să fie legat cu două lanțuri și a întrebat cine este și ce a făcut.
34 ౩౪ అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలును కోటలోకి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు.
Unii strigau un lucru și alții altul, în mulțime. Când nu a putut afla adevărul din cauza gălăgiei, a poruncit să fie dus în cazarmă.
35 ౩౫ పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకుపోవలసి వచ్చింది.
Când a ajuns pe scări, a fost dus de ostași, din pricina mulțimii care se înghesuia;
36 ౩౬ ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు.
căci mulțimea poporului îl urmărea, strigând: “Luați-l!”.
37 ౩౭ వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని, “నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. అందుకు అతడు, “నీకు గ్రీకు భాష తెలుసా?’
Pe când Pavel era pe punctul de a fi dus în cazarmă, l-a întrebat pe comandant: “Pot să-ți vorbesc?” El a spus: “Știi greacă?
38 ౩౮ ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉగ్రవాదులను తీసుకుని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” అని అడిగాడు.
Nu ești tu, deci, egipteanul care, mai înainte de aceste zile, a stârnit răzvrătirea și a condus în pustiu pe cei patru mii de oameni ai asasinilor?”
39 ౩౯ అందుకు పౌలు, “నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు.
Dar Pavel a zis: “Eu sunt un iudeu din Tars, din Cilicia, un cetățean al unei cetăți deloc neînsemnate. Vă rog, dați-mi voie să vorbesc poporului.”
40 ౪౦ అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దుమణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.
După ce i-a dat voie, Pavel, stând pe scări, a făcut semn cu mâna către popor. Când s-a făcut o mare tăcere, el le-a vorbit în limba ebraică, zicând

< అపొస్తలుల కార్యములు 21 >