< అపొస్తలుల కార్యములు 20 >
1 ౧ ఆ అల్లరి సద్దుమణిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరికి పిలిచి ప్రోత్సాహక వాక్కులు చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియ బయలుదేరాడు.
Lorsque le tumulte eut cessé, Paul, ayant réuni les disciples et les ayant embrassés, partit pour aller en Macédoine.
2 ౨ ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసులను ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు.
Il parcourut cette province en adressant aux disciples de nombreuses exhortations, et se rendit en Grèce.
3 ౩ అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తరువాత ఓడపై సిరియా వెళ్ళాలని భావించాడు గానీ అక్కడి యూదులు అతనిపై కుట్ర చేస్తున్నారని తెలిసి తిరిగి మాసిదోనియ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
Après un séjour de trois mois, il se disposait à s'embarquer pour la Syrie, mais, les Juifs lui ayant dressé des embûches, il prit le parti de s'en retourner par la Macédoine.
4 ౪ ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, తెస్సలోనిక వారు అరిస్తార్కు, సెకుందు, దెర్బె ఊరివాడు గాయి, తిమోతి, ఆసియా దేశాలకు చెందిన తుకికు, త్రోఫిము, అతనితో వచ్చారు.
Sopater, fils de Pyrrhus, de Bérée, raccompagna jusqu'en Asie, avec Aristarque et Secundus de Thessalonique, Caïus de Derbe et Timothée, Tychique et Trophime d'Asie;
5 ౫ అయితే వారంతా ముందుగా వెళ్ళి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు.
ceux-ci ayant pris les devants, nous attendirent à Troas.
6 ౬ మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి ఐదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకుని వారి దగ్గర ఏడు రోజులు గడిపాం.
Pour nous, nous partîmes de Philippes après les jours des pains sans levain, et au bout de cinq jours de navigation, nous les rejoignîmes à Troas, et nous y demeurâmes sept jours.
7 ౭ ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు.
Le premier jour de la semaine, comme nous étions assemblés pour rompre le pain, Paul, qui devait partir le lendemain, s'entretint avec les disciples, et prolongea son discours jusqu’à minuit.
8 ౮ మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.
Il y avait beaucoup de lampes dans la salle haute où nous étions assemblés.
9 ౯ పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.
Un jeune homme nommé Eutyche, qui était assis sur la fenêtre, succomba à un profond sommeil, parce que Paul parlait fort longtemps, et, entraîné par le sommeil, il tomba du troisième étage en bas: on le releva mort.
10 ౧౦ అప్పుడు పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడుకుని కౌగలించుకుని, “మీరిక గాభరా పడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు బతికే ఉన్నాడు” అని వారితో చెప్పాడు.
Mais Paul, étant descendu, s'étendit sur lui, et, après l'avoir tenu embrassé, il dit: «Cessez vos cris, car la vie est en lui.»
11 ౧౧ అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకూ వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు.
Puis étant remonté, il rompit le pain, mangea et conversa assez longtemps, jusqu’à l'aube; et il partit.
12 ౧౨ సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
Quant au jeune homme, on l'amena vivant, ce qui fut une immense consolation.
13 ౧౩ మేము ఓడ ఎక్కి అస్సు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌలుని ఎక్కించుకోవాలని ముందుగా బయల్దేరాం. తాను అక్కడివరకూ కాలి నడకను రావాలని ఉద్దేశించి పౌలు మమ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు.
Pour nous, ayant pris les devants par mer, nous fîmes voile vers Assos, où nous devions reprendre Paul, car c'est ainsi qu'il l'avait ordonné: il devait, lui, aller à pied.
14 ౧౪ అస్సులో అతడు మాతో కలిసిన తరువాత మేమంతా కలిసి మితిలేనే వచ్చాం.
Lorsqu'il nous eut rejoints à Assos, nous le prîmes avec nous, et nous gagnâmes Mytilène.
15 ౧౫ అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకుని ఆ తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం.
Nous partîmes de là, et nous arrivâmes le jour suivant en face de Chio, le troisième jour nous touchâmes Samos, puis, après avoir relâché à Trogylle, nous abordâmes le lendemain à Milet.
16 ౧౬ సాధ్యమైతే పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియలో కాలయాపన చేయకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
Paul avait jugé bon de dépasser Éphèse, pour ne pas perdre de temps en Asie, car il se hâtait, afin d'arriver, s'il était possible, le jour de la Pentecôte à Jérusalem.
17 ౧౭ అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు.
Cependant il envoya de Milet à Éphèse, pour mander les anciens de l'église.
18 ౧౮ వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు.
Lorsqu'ils furent venus vers lui, il leur dit: «Vous savez comment, depuis le premier jour que j'ai mis le pied en Asie,
19 ౧౯ యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు.
je me suis toujours comporté avec vous, servant le Seigneur en toute humilité, au milieu des larmes et des épreuves, auxquelles m'ont exposé les embûches des Juifs.
20 ౨౦ మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను.
Vous savez que je vous ai annoncé l’évangile, et que je vous ai instruits en public et en particulier, sans vous rien cacher de ce qui pouvait vous être avantageux:
21 ౨౧ అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు.
je n'ai pas cessé d'enseigner aux Juifs et aux Grecs la repentance envers Dieu, et la foi en notre Seigneur Jésus-Christ.
22 ౨౨ “ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు.
Maintenant, je m'en vais à Jérusalem, m'y sentant obligé intérieurement, sans que je sache ce qui doit m'y arriver;
23 ౨౩ కానీ, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్షమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు.
seulement, de ville en ville, le Saint-Esprit ne cesse de m'assurer que des chaînes et des malheurs m'attendent.
24 ౨౪ అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు.
Mais je n'en tiens aucun compte, et je n'attache pour moi-même aucun prix à la vie, pourvu que je fournisse ma carrière, et que j'accomplisse le ministère que j'ai reçu du Seigneur Jésus, d'enseigner la bonne nouvelle de la grâce de Dieu.
25 ౨౫ ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు.
Pour moi, je sais que vous ne verrez plus mon visage, vous tous parmi lesquels je suis venu prêcher le royaume;
26 ౨౬ కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.
en conséquence je proteste aujourd'hui devant vous que je suis net du sang de tous;
27 ౨౭ ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.
car je vous ai annoncé tout le conseil de Dieu, sans vous en rien cacher.
28 ౨౮ “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.
Prenez donc garde à vous-mêmes, et à tout le troupeau sur lequel le Saint-Esprit vous a établis évêques, pour paître l'église que le Seigneur s'est acquise par son propre sang.
29 ౨౯ నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.
Je sais qu'après mon départ, il s'introduira parmi vous des loups terribles, qui n'épargneront point le troupeau,
30 ౩౦ అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు.
et qu'il s'élèvera dans votre propre sein des hommes professant des doctrines perverses, pour s'attirer des disciples.
31 ౩౧ కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.
Veillez donc, vous souvenant que durant trois années, je n'ai cessé, ni jour ni nuit, d'avertir avec larmes chacun de vous.
32 ౩౨ ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి.
Et maintenant, je vous recommande à Dieu et à la parole de sa grâce, à celui qui peut édifier et vous donner une part avec tous les sanctifiés.
33 ౩౩ నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు.
Je n'ai désiré ni l'argent, ni l'or, ni les vêtements de personne.
34 ౩౪ నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.
Vous savez vous-mêmes que ces mains ont pourvu à mes besoins et à ceux de mes compagnons;
35 ౩౫ మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”
je vous ai montré de toutes manières que c'est en travaillant ainsi, que l'on doit accueillir les faibles, et se souvenir des paroles du Seigneur, qui a dit lui-même: «Il y a plus de bonheur à donner qu'à recevoir.»
36 ౩౬ అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు.
Après avoir ainsi parlé, il se mit à genoux, et pria avec eux tous.
37 ౩౭ అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు.
Ils fondirent tous en larmes, et, se jetant au cou de Paul,
38 ౩౮ మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.
ils l'embrassaient, navrés surtout de ce qu'il leur avait dit qu'ils ne verraient plus son visage. Puis ils l'accompagnèrent jusqu'au vaisseau.