< అపొస్తలుల కార్యములు 20 >

1 ఆ అల్లరి సద్దుమణిగిన తరువాత పౌలు శిష్యులను దగ్గరికి పిలిచి ప్రోత్సాహక వాక్కులు చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియ బయలుదేరాడు.
Kane kokono oserumo, Paulo noluongo jopuonjre ire mojiwogi, to bangʼe nogoyonegi oriti, mi ochako wuodhe mar dhi Makedonia.
2 ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడి విశ్వాసులను ప్రోత్సహించి గ్రీసు వచ్చాడు.
Nowuotho e gwengʼno kojiwo ji gi weche mangʼeny, eka nochopo e piny jo-Yunani,
3 అతడు అక్కడ మూడు నెలలు గడిపిన తరువాత ఓడపై సిరియా వెళ్ళాలని భావించాడు గానీ అక్కడి యూదులు అతనిపై కుట్ర చేస్తున్నారని తెలిసి తిరిగి మాసిదోనియ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు.
kuma nobetie kuom dweche adek. To nikech jo-Yahudi ne chano timo ne marach kane oyudo oikore mar dhi Siria, noloko pache mondo odog chien, koluwo Makedonia.
4 ఫుర్రస్ కుమారుడు, బెరయ ఊరికి చెందిన సోపత్రు, తెస్సలోనిక వారు అరిస్తార్కు, సెకుందు, దెర్బె ఊరివాడు గాయి, తిమోతి, ఆసియా దేశాలకు చెందిన తుకికు, త్రోఫిము, అతనితో వచ్చారు.
Joma nodhi kode ne gin ji kaka Sopata wuod Puro ja-Berea, gi Aristarko kod Sekundo, ma ja-Thesalonika, gi Gayo ja-Derbe, kod Timotheo bende, gi Tukiko kod Trofimo mane gin jo-Asia.
5 అయితే వారంతా ముందుగా వెళ్ళి త్రోయలో మా కోసం ఎదురు చూస్తున్నారు.
Jogi notelo nyimwa mondo oritwa Troa.
6 మేము పులియని పిండితో చేసే రొట్టెల పండగ దినాలు పూర్తయ్యాక ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి పెట్టి ఐదు రోజులు ప్రయాణించి త్రోయ చేరుకుని వారి దగ్గర ఏడు రోజులు గడిపాం.
Wan to ne wakwangʼ ka waa Filipi, bangʼ Sap Makati ma ok oketie Thowi, to bangʼ ndalo abich ne wachopo irgi Troa, kuma ne wabetie kuom ndalo abiriyo.
7 ఆదివారం నాడు మేము రొట్టె విరవడానికి సమకూడినప్పుడు పౌలు తరువాతి రోజు వెళ్ళవలసి ఉంది కాబట్టి అతడు వారితో అర్థరాత్రి దాకా విస్తరించి మాట్లాడుతూ ఉండిపోయాడు.
To Chiengʼ mokwongo mar juma ne wachokore mondo wacham Sap Ruoth. Paulo nopuonjo ji nyaka odiwuor nikech nochano mar aa kinyne gokinyi.
8 మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు ఉన్నాయి.
Teche mangʼeny ne liel e od gorofa malo kuma ne wachokore.
9 పౌలు చాలాసేపు ప్రసంగిస్తుంటే కిటికీలో కూర్చున్న ఐతుకు అనే యువకుడు గాఢ నిద్రలో మునిగి జోగి, మూడవ అంతస్తు నుండి జారి కింద పడి చనిపోయాడు.
To wuowi moro miluongo ni Yutiko nobet e dho dirisa, kendo nindo nomedo tere ka Paulo ne pod medo puonjo. Kane en e chuny nindo, nolwar gie dirisa koa e gorofa mar adek mi nokwanye piny mwalo kosetho.
10 ౧౦ అప్పుడు పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడుకుని కౌగలించుకుని, “మీరిక గాభరా పడవలసిన పని లేదు. ఎందుకంటే అతడు బతికే ఉన్నాడు” అని వారితో చెప్పాడు.
Paulo nolor piny mi nokwako wuowino. Bangʼe nowacho ni ji niya, “Kik uluor. Ongima!”
11 ౧౧ అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి భుజించి తెల్లవారే వరకూ వారితో ఎన్నో విషయాలు మాట్లాడి బయలుదేరాడు.
Eka nodok malo kuma ne entie mi ongʼwenyo makati mochamo. Bangʼe nodhi nyime gipuonjo nyaka piny oru, eka owuok.
12 ౧౨ సజీవంగా ఉన్న ఆ యువకుణ్ణి తీసుకు వచ్చినప్పుడు వారికి గొప్ప ఆదరణ కలిగింది.
Ji nokawo wuowino motere dala kongima, kendo chunygi noyudo hoch maduongʼ.
13 ౧౩ మేము ఓడ ఎక్కి అస్సు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పౌలుని ఎక్కించుకోవాలని ముందుగా బయల్దేరాం. తాను అక్కడివరకూ కాలి నడకను రావాలని ఉద్దేశించి పౌలు మమ్మల్ని ఆ విధంగా ఆదేశించాడు.
Wan to ne watelo nyime nyaka ei yie, mi wakwangʼ nyaka Asos, kuma ne wadhi kawoe Paulo. Nosechano kamano nikech ne odwaro ni mondo odhi kuno kowuotho gi tiende.
14 ౧౪ అస్సులో అతడు మాతో కలిసిన తరువాత మేమంతా కలిసి మితిలేనే వచ్చాం.
Kane oyudowa Asos, nodonjo kodwa e yie, mi wadhi nyaka Mitulene.
15 ౧౫ అక్కడ నుండి బయలుదేరి మరునాటికి కీయోసు ద్వీపానికి ఎదురుగా వచ్చాం. మరునాటికి సమొసు చేరుకుని ఆ తరువాతి రోజుకి మిలేతు చేరుకున్నాం.
Kinyne ne wakwangʼ ka waa kanyo mi watundo machiegni Kios. To chiengʼ machielo ne wangʼado nam nyaka Samos, to bangʼe ne wachopo Mileto.
16 ౧౬ సాధ్యమైతే పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు కాబట్టి ఆసియలో కాలయాపన చేయకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
Paulo nosechano mondo okwangʼ kodhi ma ok oluwo Efeso, nikech ne ok odwar kawo thuolo malach e piny Asia. Nodwaro mondo ochop Jerusalem piyo, kapok chiengʼ Pentekost ochopo.
17 ౧౭ అతడు మిలేతులో ఉండగానే ఎఫెసులోని పెద్దలకు కబురు పెట్టి వారిని పిలిపించాడు.
Kane wan Mileto, Paulo nooro wach Efeso mondo oluongne jodong kanisa.
18 ౧౮ వారు వచ్చినపుడు వారితో ఇలా అన్నాడు, “నేను ఆసియలో కాలు మోపిన రోజు నుండి మీ మధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు.
Kane gisebiro, nowachonegi niya, “Ungʼeyo maber kaka ngimana ne chalo e kinde mane an kodu ka, kochakore odiechiengʼ mokwongo mane adonjo e piny Asia.
19 ౧౯ యూదుల కుట్రల వలన నాకు విషమ పరీక్షలు సంభవించినా కన్నీటితోనూ, సంపూర్ణమైన వినయభావంతోనూ ప్రభువుకు సేవ చేశానని మీకు తెలుసు.
Ne atiyo ni Ruoth gi chuny mamuol, kendo gi pi wangʼ, kata obedo ni naneno masiche madongo ka jo-Yahudi chano mondo ohinya.
20 ౨౦ మీకు ప్రయోజనకరమైన దేనినీ నేను దాచుకోకుండా బహిరంగంగా, ఇంటింటికీ తిరిగి బోధించాను.
Bende ungʼeyo kaka ne ok aweyo mak anyisou wach moro amora mane nyalo konyou, to napuonjou e lela kendo e uteu, ka adonjo e ot ka ot.
21 ౨౧ అంతేకాక, దేవుని ఎదుట పశ్చాత్తాప పడి మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచాలని యూదులకూ, గ్రీసు దేశస్తులకూ ఏ విధంగా సాక్ష్యం ఇస్తున్నానో, అంతా మీకు తెలుసు.
Asenyiso jo-Yahudi kaachiel gi jo-Yunani ni nyaka gilokre giwe richogi kendo gidwog ir Nyasaye kendo giyie kuom Ruodhwa Yesu.
22 ౨౨ “ఇదిగో, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంలో యెరూషలేము వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవిస్తాయో నాకు తెలియదు.
“To sani koro Roho ochuna ni nyaka adhi Jerusalem, ka ok angʼeyo gima dhi timorena kuno.
23 ౨౩ కానీ, పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో సాక్షమిస్తూ నా కోసం సంకెళ్ళు, హింసలూ వేచి ఉన్నాయని చెప్పాడని మాత్రం తెలుసు.
Gima angʼeyo en mana gima Roho Maler nyisa e chunya ni sand kod twech orita e dala ka dala ma adhiye.
24 ౨౪ అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు.
To kata obedo kamano, ok akwan ngimana ka gima lichna; gima ochuna maduongʼ en mana tieko ngʼweya kendo chopo tich ma Ruoth Yesu osemiya mondo atim, ma en tich mar lando Injili mar ngʼwono mar Nyasaye.
25 ౨౫ ఇదిగో, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ నేను మీ మధ్య తిరుగుతూ ఉన్నాను. మీరెవరూ ఇక మీదట నా ముఖం చూడరని నాకు తెలుసు.
“Koro angʼeyo ni onge ngʼato kuomu maseyalone wach kuom pinyruoth manochak onena.
26 ౨౬ కాబట్టి మీ అందరి రక్తం విషయంలో నేను నిర్దోషినని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.
Emomiyo awachonu kawuono ni koro remb ngʼato ok ni e wiya,
27 ౨౭ ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించకుండా నేనేమీ దాచుకోలేదు.
nikech ne ok aweyo ma ok anyisou gik moko duto ma Nyasaye dwaro ni utim.
28 ౨౮ “ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడం కోసం పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనికి అధ్యక్షులుగా నియమించాడో ఆ మంద అంతటిని గురించీ, మీ మట్టుకు మిమ్మల్ని గురించీ జాగ్రత్తగా ఉండండి.
Koro tangʼuru kendo rituru kweth duto ma Roho Maler oketo e lwetu mondo uriti. Beduru jokwath mag Kanisa Nyasaye ma nongʼiewo gi rembe owuon.
29 ౨౯ నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే క్రూరమైన తోడేళ్ళు వంటివారు మీలో ప్రవేశిస్తారు. వారు మందపై జాలి చూపరు.
Angʼeyo maber ni bangʼ ka asea, ondiegi mangemo biro monjou, kendo ok giniwe kweth Nyasaye ngangʼ.
30 ౩౦ అంతేకాక శిష్యులను తమతో ఈడ్చుకుపోవడం కోసం దారి మళ్ళించే మాటలు పలికే వ్యక్తులు మీలో నుండే బయలుదేరుతారు.
Kata mana e dieru ka, jomoko biro wuokie kendo gibiro puonjo weche mobam ma gichwogo kendgi giwegi mondo giywago jopuonjre irgi.
31 ౩౧ కాబట్టి మూడు సంవత్సరాలుగా నేను రాత్రింబగళ్ళు కన్నీళ్ళతో మీలో ప్రతి ఒక్కరికీ ఎడతెగక బుద్ధి నేర్పడం మానలేదని గుర్తుంచుకుని మెలకువగా ఉండండి.
Emomiyo beduru motangʼ! Paruru kaka kuom higni adek ne ok aweyo mak asiemo ngʼato ka ngʼato kuomu odiechiengʼ gotieno, ka pi wangʼa chwer.
32 ౩౨ ఇప్పుడు దేవునికీ, ఆయన కృపావాక్యానికీ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయటానికీ పరిశుద్ధులందరితో వారసత్వం అనుగ్రహించడానికీ శక్తిశాలి.
“Koro aketou e lwet Nyasaye, kendo kuom wach ngʼwonone, manyalo gerou, kendo manyalo miyo uyud gweth mosekan-nu kaachiel gi jomaler duto.
33 ౩౩ నేను ఎవరి వెండినిగానీ, బంగారాన్నిగానీ, వస్త్రాలుగానీ ఆశించలేదు.
Pok agombo fedha kata dhahabu kata law ngʼato.
34 ౩౪ నా అవసరాల నిమిత్తం, నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు.
Un uwegi ungʼeyo ni lwetenagi osetiyo matek mi ochopo dwarona duto, nyaka dwaro mag jowadwa mwayalogo Injili.
35 ౩౫ మీరు కూడా అదే విధంగా ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చు కోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైనది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, నేను అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలిచాను.”
Asenyisou gi yore duto ni nyaka wati matek wan wawegi mondo wakonygo joma chandore, ka waparo wach mane Ruoth Yesu owachonwa ni, ‘Chiwo kelo gweth moloyo kawo!’”
36 ౩౬ అతడు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థన చేశాడు.
Kane Paulo osetieko wacho wechegi, nogoyo chonge piny kaachiel kodgi duto mi nolemo.
37 ౩౭ అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు.
Ji duto ne oywak, ka gipodho kuome kendo ginyodhe.
38 ౩౮ మరి ముఖ్యంగా, “మీరు ఇక మీదట నా ముఖం చూడరు” అని అతడు చెప్పిన మాటను బట్టి వారు ఎంతో దుఃఖిస్తూ ఓడ వరకూ అతనిని సాగనంపారు.
Gima ne litnegi ahinya ne en gima nowacho ni ne ok gibi nene kendo. Bangʼ mano ne gikowe ei yie.

< అపొస్తలుల కార్యములు 20 >