< అపొస్తలుల కార్యములు 17 >

1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
Un caur Amfipoli un Apoloniju gājuši tie nāca uz Tesaloniku: tur bija viena Jūdu baznīca.
2 పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు.
Un Pāvils pēc sava ieraduma pie tiem iegāja un trijās svētās dienās ar tiem sarunājās par tiem rakstiem,
3 క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు.
Tos izstāstīdams un viņiem priekšā likdams, ka Kristum bija ciest un augšām celties no miroņiem, un sacija: “Šis ir Tas Kristus Jēzus, ko es jums pasludināju.”
4 కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.
Un kādi no tiem tapa pārliecināti un piebiedrojās Pāvilam un Sīlasam, un no tiem dievbijīgiem Grieķiem liels pulks un laba tiesa sievu no augstas kārtas.
5 అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.
Bet tie neticīgie Jūdi, skaudības pilni, ņēma pie sevis kādus saskrējušus neliešus un sapulcinājās un cēla troksni tai pilsētā; un Jazona namu apstājuši, meklēja tos vest priekš tā ļaužu pulka.
6 అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.
Bet tos neatraduši, tie Jazonu un citus brāļus vilka pie pilsētas virsniekiem brēkdami: “Tie, kas visu pasauli ar dumpi pilda, tie arī šurp ir nākuši.
7 వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
Tos Jazons ir uzņēmis; un šie visi dara pret ķeizara pavēlēm sacīdami: citu esam ķēniņu - Jēzu.”
8 జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు.
Un tie iztrūcināja tos ļaudis un tos pilsētas virsniekus, kas to dzirdēja.
9 వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.
Bet šie, aizbildināšanu no Jazona un tiem dabūjuši, tos palaida.
10 ౧౦ సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు.
Bet tie brāļi tūdaļ naktī Pāvilu un Sīlasu izvadīja uz Bereju; tie tur nonākuši iegāja Jūdu baznīcā.
11 ౧౧ వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
Un šie bija labvēlīgāki pār tiem Tesalonikas Jūdiem un to vārdu uzņēma ar visu labu prātu, meklēdami ikdienas rakstos, vai šās lietas tā esot?
12 ౧౨ అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
Tad nu daudzi no tiem ticēja, arī no Grieķu augstas kārtas sievām un vīriem laba tiesa.
13 ౧౩ అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రెచ్చగొట్టి అల్లరి రేపారు.
Un kad tie Tesalonikas Jūdi dabūja zināt, ka arī Berejā Dieva vārds no Pāvila tapa sludināts, tad tie nāca arī uz turieni un tos ļaudis skubināja uz dumpi.
14 ౧౪ వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.
Bet tie brāļi tūdaļ Pāvilu izsūtīja, ka tas noietu uz jūru, bet Sīlas un Timotejs tur palika.
15 ౧౫ పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.
Bet tie, kas Pāvilu pavadīja, to veda līdz Atēnai, un pavēli priekš Sīlasa un Timoteja dabūjuši, lai šie arīdzan pie viņa nāktu, tie aizgāja.
16 ౧౬ పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.
Un kamēr Pāvils viņus gaidīja Atēnā, viņa gars iekš viņa iedegās, kad viņš redzēja to pilsētu tik elkadievīgu esam.
17 ౧౭ అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.
Tad nu viņš baznīcā sarunājās ar tiem Jūdiem un tiem dievbijīgiem, un tirgū ikdienas ar tiem, kas piegadījās.
18 ౧౮ ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, “ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి” అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, “ఇతడు మనకు తెలియని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
Un kādi no Epikureju un Stoīku gudriem ar viņu sarunājās; un kādi sacīja: “Ko šis pļāpa grib runāt?” Un citi: “Šis izliekās kā svešu dievu sludinātājs;” tāpēc ka viņš tiem Jēzu un to augšāmcelšanos sludināja.
19 ౧౯ వారు అతనిని వెంటబెట్టుకుని అరియోపగు అనే సమాఖ్య దగ్గరికి తీసుకుపోయి, “నీవు చెబుతున్న ఈ కొత్త బోధ మేము తెలుసుకోవచ్చా?
Un tie viņu ņēma un veda uz tās augstās tiesas vietu, sacīdami: “Vai nevaram dabūt zināt, kāda tā jaunā mācība, ko tu sludini?
20 ౨౦ నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు.
Jo tu dažas svešas lietas runā priekš mūsu ausīm, tāpēc mēs gribam zināt, kas tas ir?”
21 ౨౧ ఏతెన్సు ప్రజలూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
Bet visi Atēnieši un tie svešinieki, kas tur piemājoja, ar citu neko to laiku nekavēja, kā vien ko jaunu runāt un dzirdēt.
22 ౨౨ పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను.
Un Pāvils stāvēja tās augstās tiesas plača vidū un sacīja: “Jūs Atēniešu vīri, pēc visa es jūs redzu jo dievbijīgus.
23 ౨౩ నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.
Jo staigādams un jūsu svētekļus apraudzīdams, es atradu arī vienu altāri, kam bija virsū rakstīts: nepazīstamam Dievam. Tad nu, ko jūs nepāzīdami godājiet, To es jums pasludināju.
24 ౨౪ విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.
Tas Dievs, kas ir radījis pasauli un visu, kas tur iekšā, šis, debess un zemes Kungs būdams, nemājo rokām taisītās baznīcās,
25 ౨౫ ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
Un Viņam arī nenotiek no cilvēku rokām kalpošana, tā kā Viņam ko vajadzētu; bet Viņš pats dod visiem dzīvību un dvašu un visas lietas.
26 ౨౬ ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.
Un Viņš ir darījis, ka no vienām asinīm visas cilvēku tautas dzīvo pa visu zemes virsu, un ir nolicis papriekš nospriestus laikus un robežas, kur tiem būs dzīvot,
27 ౨౭ అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,
Ka tie To Kungu meklētu, lai tie Viņu varētu just un atrast, - jebšu Viņš nav tālu no neviena no mums.
28 ౨౮ మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.
Jo iekš Viņa mēs dzīvojam un kustam un esam; tā kā arī kādi no jūsu dziesminiekiem sacījuši: mēs arī esam Viņa rada.
29 ౨౯ కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
Tad nu mums, kas Dieva rada esam, nebūs domāt, dievību esam līdzīgu zeltam vai sudrabam vai akmenim, kādam caur cilvēka gudrību un izdomāšanu iztaisītam tēlam.
30 ౩౦ ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.
Tad nu Dievs tos nezināšanas laikus panesis, tagad pavēl visiem cilvēkiem visās malās no grēkiem atgriezties;
31 ౩౧ ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”
Tāpēc ka Viņš vienu dienu ir nolicis, kur Viņš pasauli tiesās iekš taisnības caur vienu Vīru, ko Viņš uz to izredzējis, visiem ticību pasniegdams, kad Viņš to no miroņiem ir uzmodinājis.”
32 ౩౨ మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.
Bet kad tie dzirdēja miroņu augšāmcelšanos, tad citi to ņēma smieklā, bet citi sacīja: “Par to mēs tevi vēl kādu citu reiz dzirdēsim.”
33 ౩౩ ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
(Tukšs)
34 ౩౪ అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.
Bet kādi vīri tam pieķērās un ticēja. Starp tiem bija Dionisijs, tās augstās tiesas loceklis, un viena sieva, ar vārdu Damare, un vēl citi līdz ar tiem.

< అపొస్తలుల కార్యములు 17 >