< అపొస్తలుల కార్యములు 17 >
1 ౧ వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనిక పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
Vydali se přes Amfipolis a Apollonii, až přišli do Tesa loniky, kde byla židovská synagoga.
2 ౨ పౌలు తన అలవాటు ప్రకారం అలవాటు ప్రకారం మూడు విశ్రాంతి దినాలు లేఖనాల్లో నుండి వారితో తర్కించాడు.
Pavel, jak už to měl ve zvyku, zahájil svou misijní činnost mezi židy. Tři soboty po sobě k nim promlouval
3 ౩ క్రీస్తు హింసలు అనుభవించి మృతుల్లో నుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలను విప్పి వివరించాడు. “నేను మీకు ప్రకటించే యేసే క్రీస్తు” అని తెలియజేశాడు.
a snažil se jim dokázat z Bible, že slíbený Mesiáš musel projít utrpením, zemřít a vstát z mrtvých. „Ten Mesiáš je Ježíš a o něm jsem vám přišel povědět, “říkal Pavel.
4 ౪ కొంతమంది యూదులు ఒప్పుకుని పౌలు సీలలతో కలిశారు. వారిలో భక్తిపరులైన గ్రీకు వారూ, చాలమంది ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు.
Někteří z nich tomu uvěřili a ty Pavel a Silas dále vyučovali. Získali pro Krista i mnoho bývalých pohanů, mezi nimi také řadu žen z významných rodin.
5 ౫ అయితే ఆ బోధను నమ్మని యూదులు అసూయతో నిండిపోయి, వ్యాపార వీధుల్లో తిరిగే కొంతమంది పోకిరీ వాళ్ళను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమంతా పెద్ద అల్లరి సృష్టించారు. వారు యాసోను ఇంటి మీద దాడి చేసి, పౌలు సీలలను జనం మధ్యకు తీసుకు వెళ్ళాలనుకున్నారు.
To vzbudilo závist židů, kteří v Ježíše neuvěřili. Najali si lidi z městské spodiny a ti vyvolali pouliční výtržnost. Přitáhli k Jásonovu domu, kde Pavel a Silas bydleli, a chtěli je lynčovat.
6 ౬ అయితే వారు కనబడక పోయేసరికి యాసోనునూ మరి కొంతమంది సోదరులనూ ఆ పట్టణ అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయి, “భూలోకాన్ని తలకిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు. యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు.
Nezastihli je však, a tak dovlekli Jásona s několika věřícími na radnici. Tam židé žalovali na křesťany:
7 ౭ వీరంతా యేసు అనే వేరొక రాజున్నాడని చెబుతూ సీజరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారు” అని కేకలు వేశారు.
„Tihle lidé organizují vzpoury v celé říši. Ruší císařovy zákony a snaží se nastolit za krále jakéhosi Ježíše. Teď dorazili až k nám a tento muž jim poskytl svůj dům.“
8 ౮ జనసమూహం అధికారులూ ఈ మాటలు విని ఆందోళనపడ్డారు.
Městští úředníci dostali strach,
9 ౯ వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.
ale nakonec propustili Jásona a jeho přátele, když zaplatili kauci.
10 ౧౦ సోదరులు అదే రాత్రి పౌలునూ సీలనూ బెరయ ఊరికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళారు.
Křesťanští bratři hned v noci tajně vyvedli Pavla a Silase z města a vypravili je na cestu do Beroje. Také tam začali činnost v židovské synagoze.
11 ౧౧ వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఉన్నత భావాలు గలవారు. ఎందుకంటే వీరు శ్రద్ధతో వాక్యాన్ని అంగీకరించి, పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతి రోజూ లేఖనాలను తరచి చూస్తూ వచ్చారు.
Berojští židé byli otevřenější a naslouchali ochotně zprávám o Ježíšovi; každý den se scházeli a studovali Písmo a ověřovali si, zda se Pavlova zvěst shoduje s předpověďmi izraelských proroků.
12 ౧౨ అందుచేత వారిలో చాలామంది నమ్మారు. ప్రముఖ గ్రీకు స్త్రీలూ, పురుషులూ విశ్వసించారు.
Mnoho jich uvěřilo a opět se k nim připojili pohané, muži i ženy, někteří i z urozených vrstev.
13 ౧౩ అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్కు ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకుని అక్కడికి కూడా వచ్చి జనాన్ని రెచ్చగొట్టి అల్లరి రేపారు.
To se ovšem doneslo k židům v Tesalonice. Vypravili se do Beroje a snažili se i tam Pavlovu práci překazit.
14 ౧౪ వెంటనే సోదరులు పౌలును సముద్రం వరకూ పంపారు. సీల, తిమోతి, అక్కడే ఉండిపోయారు.
Berojští křesťané raději hned dovedli Pavla do nejbližšího přístavu a někteří ho doprovodili po moři až do Atén. Silas a Timoteus zůstali zatím v Beroji. Pavel jim však vzkázal po svých průvodcích, aby se za ním co nejdříve vypravili.
15 ౧౫ పౌలును సాగనంపడానికి వెళ్ళిన వారు అతనిని ఏతెన్సు పట్టణం వరకూ తెచ్చారు. సీల, తిమోతి సాధ్యమైనంత తొందరగా తన దగ్గరికి రావాలని పౌలు, వారి ద్వారా కబురు పంపాడు.
16 ౧౬ పౌలు ఏతెన్సులో వారి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ పట్టణం నిండా ఉన్న విగ్రహాలను గమనించి అతని ఆత్మ పరితపించింది.
Zatímco na ně čekal, procházel Pavel Aténami. Všechno se v něm bouřilo, když viděl, jak tam lidé horlivě uctívali sochy bohů.
17 ౧౭ అందుచేత సమాజ మందిరంలో యూదులతోనూ దేవుణ్ణి ఆరాధించే వారితోనూ, వ్యాపార వీధుల్లో ప్రతి రోజూ వచ్చిపోయే వారితోనూ చర్చిస్తూ వచ్చాడు.
Den co den hovořil s židy a bohabojnými Řeky v synagoze, ale vycházel i na náměstí a mluvil ke všem, kdo mu byli ochotni naslouchat.
18 ౧౮ ఎపికూరీయుల స్తోయికుల వర్గానికి చెందిన కొంతమంది తత్వవేత్తలు అతనితో వాదించారు. కొంతమంది, “ఈ వాగుడుకాయ చెప్పేది ఏమిటి” అని చెప్పుకున్నారు. అతడు యేసుని గూర్చీ, చనిపోయిన వారు తిరిగి బ్రతకడం గూర్చీ ప్రకటించాడు కాబట్టి మరి కొంత మంది, “ఇతడు మనకు తెలియని దేవుళ్ళను ప్రచారం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
Tak se dostal do hovoru i s aténskými filozofy, epikurejci a stoiky, a vyprávěl jim o Ježíšovi, který vstal z mrtvých. Někteří ho okřikovali: „Neposlouchejte toho žvanila!“ale druhé to začalo zajímat. Říkali: „To bude nějaké nové náboženství.“Atéňané i lidé, kteří tam přicházeli studovat, byli totiž velice zvědaví a posedlí touhou povědět nebo uslyšet něco nového a neobvyklého. Vzali Pavla mezi sebe, dovedli ho na řečniště zvané Areopag a požádali ho, aby jim pověděl něco více o tom novém učení plném překvapujících myšlenek.
19 ౧౯ వారు అతనిని వెంటబెట్టుకుని అరియోపగు అనే సమాఖ్య దగ్గరికి తీసుకుపోయి, “నీవు చెబుతున్న ఈ కొత్త బోధ మేము తెలుసుకోవచ్చా?
20 ౨౦ నీవు కొన్ని వింత విషయాలు మాకు వినిపిస్తున్నావు. అందుచేత వీటి అర్థమేంటో మాకు తెలుసుకోవాలని ఉంది” అని చెప్పారు.
21 ౨౧ ఏతెన్సు ప్రజలూ, అక్కడ నివసించే విదేశీయులూ ఏదో ఒక కొత్త విషయం చెప్పడంలో, వినడంలో మాత్రమే తమ సమయాన్ని గడిపేవారు.
22 ౨౨ పౌలు అరియోపగు సభనుద్దేశించి, “ఏతెన్సు వాసులారా, మీరు అన్ని విషయాల్లో చాలా మతభక్తి గలవారని నేను గమనిస్తున్నాను.
Pavel tedy vystoupil na místo pro řečníky a oslovil shromážděné: „Atéňané, všiml jsem si, že jste opravdu nábožensky založení lidé.
23 ౨౩ నేను దారిన పోతుంటే మీరు పూజించే వాటిని చూశాను. అక్కడ ఒక బలిపీఠం నాకు కనబడింది. దాని మీద “తెలియని దేవునికి” అని రాసి ఉంది. కాబట్టి మీరు తెలియకుండా దేనిని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు తెలియజేస్తున్నాను.
Když jsem prohlížel vaše četné chrámy a svatyně, viděl jsem také oltář zasvěcený ‚neznámému bohu‘. Tušíte tedy, že je zde někdo, kdo přerůstá vaše představy a máte ho v úctě. A právě o něm jsem vám přišel povědět!
24 ౨౪ విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.
Jediného pravého Boha, který stvořil svět a všechno živé, který ovládá Zemi a celý vesmír, toho nemůžete postavit jako sochu do svých chrámů.
25 ౨౫ ఆయనే అందరికీ జీవాన్నీ ఊపిరినీ తక్కిన అన్నింటినీ దయచేసేవాడు. కాబట్టి తనకు ఏదో అక్కర ఉన్నట్టుగా మనుషులు చేతులతో చేసే సేవలు అందుకోడు.
On není závislý na tom, zda ho někdo uctívá a přináší mu oběti. Vždyť on sám dává všem život a udržuje i zajišťuje ho vším potřebným.
26 ౨౬ ఆయన ఒక్క మనిషి నుండి లోకమంతటిలో నివసించే అన్ని జాతుల మనుషులను చేసి, వారి కోసం కాలాలను నియమించాడు. నివసించే సరిహద్దులను ఏర్పరిచాడు.
Celé lidstvo vytvořil z jediného člověka, rozsadil nás po celé zemi a vymezil jednotlivým národům prostor i dějinná období.
27 ౨౭ అందుచేత వారు దేవుణ్ణి వెతికి తమకై తాము ఆయనను కనుగొనాలి. వాస్తవానికి ఆయన మనలో ఎవరికీ దూరంగా ఉండేవాడు కాదు. ఎందుకంటే,
A všichni máme veliký úkol: hledat Boha. A tu po pracném poznávání zjišťujeme, že je nám vlastně nablízku.
28 ౨౮ మనం ఆయనలో బతుకుతున్నాం, ఆయనలోనే మన కదలికలూ ఉనికీ ఉన్నాయి. ‘మనమాయన సంతానం,’ అని మీ కవులు కూడా కొందరు చెప్పారు.
On nám totiž dává život, pohyb a celé bytí. Pěkně to vyjádřili někteří vaši básníci: jsme jeho děti, Boží rodina.
29 ౨౯ కాబట్టి మనం దేవుని సంతానం గదా, దేవత్వం అనేది మనుషులు తమ ఆలోచనా నైపుణ్యాలతో చెక్కిన బంగారు, వెండి, రాతి బొమ్మలను పోలి ఉంటుందని అనుకోకూడదు.
Jak bychom si tedy měli myslet, že božská pocta přísluší nějakému lidskému dílu ze zlata, stříbra nebo mramoru? To je přece výtvor lidského umění a obratnosti. Vidíte, do takového omylu lidstvo zapadlo,
30 ౩౦ ఆ ఆజ్ఞాన కాలాలను దేవుడు చూసీ చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే మానవులందరూ అంతటా పశ్చాత్తాప పడాలని అందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు.
ale Bůh je trpělivý a chce nám to prominout. Teď ale vzkazuje všem lidem, že je na čase toho všeho nechat a obrátit se k němu, k pravému Bohu.
31 ౩౧ ఎందుకంటే తాను నియమించిన వ్యక్తితో నీతిని బట్టి లోకానికి తీర్పు తీర్చే ఒక రోజు నిర్ణయించాడు. మృతుల్లో నుండి ఆయనను లేపాడు కాబట్టి దీన్ని నమ్మడానికి అందరికీ ఆధారం కలగజేశాడు.”
Blíží se totiž den, kdy nás bude soudit, a všechno závisí na tom, jaký zaujmeme postoj k jedinému muži, kterého Bůh poslal, ke Kristu Ježíši. K němu se Bůh jasně přiznal tím, že ho vzkřísil z mrtvých.“
32 ౩౨ మృతులు చనిపోయి తిరిగి లేవడం గురించి ఎతెన్సు వారు విన్నప్పుడు కొంతమంది ఎగతాళి చేశారు. మరి కొంతమంది దీన్ని గురించి నీవు చెప్పేది మరొకసారి వింటామని చెప్పారు.
Dosud pozorní posluchači teď Pavla přerušili. Vzkříšení z mrtvých bylo na ně příliš. Někteří se mu rovnou vysmáli, druzí se vymluvili: „Pro dnešek to stačí, poslechneme si tě zase příště.“
33 ౩౩ ఆ తరువాత పౌలు వారి దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
34 ౩౪ అయితే కొంతమంది అతనితో చేరి విశ్వసించారు. వారిలో అరియోపగీతు వాడైన దియొనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితోబాటు మరి కొంతమంది కూడా ఉన్నారు.
Ale někteří byli přece jen zaujati, požádali Pavla o bližší vysvětlení a uvěřili. Byl mezi nimi i člen soudního dvora Areopagu Dionysios a žena jménem Damaris.