< అపొస్తలుల కార్యములు 16 >

1 పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత. తండ్రి గ్రీసు దేశస్థుడు.
Dorazili do Derbe a pak do Lystry. Tam žil mladý věřící muž jménem Timoteus, syn křesťanské Židovky a pohanského otce.
2 తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది.
Křesťané v Lystře a Ikoniu si ho velice pochvalovali.
3 అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు.
Také Pavel si ho oblíbil a vybral za svého dalšího průvodce. Protože v těchto oblastech měli stále co činit s židovskými usedlíky, kteří Timotea znali a považovali ho podle otce za pohana, Pavel mu raději doporučil obřízku.
4 వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు.
Putovali pak společně do dalších měst a seznamovali je s dopisem apoštolů a vedoucích jeruzalémské církve.
5 కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి.
Maloasijské sbory se upevňovaly ve víře a také tam stále přibývali noví křesťané.
6 ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ
Tak procestovali Frygii a obrátili se nazpět do Galacie, protože neměli vnitřní jistotu, že mají pokračovat dále na západ do provincie Asie. Pak chtěli na pobřeží Černého moře do Bytinie, ale cítili, že ani tam je Kristus neposílá.
7 యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు.
8 అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
Obrátili se tedy znovu k západu, bez zdržování prošli Mysií, až dorazili do Troady.
9 అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది.
V noci měl Pavel sen. Stál před ním muž v makedonském kroji a prosil ho: „Přeplav se do Makedonie a pomoz nám!“
10 ౧౦ అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
My všichni jsme uvěřili, že tento sen byl Božím příkazem, abychom šířili zvěst o spáse také v Evropě, a hned jsme se začali připravovat na cestu.
11 ౧౧ మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము.
Z troadského přístavu jsme se plavili na ostrov Samotraké a na evropskou pevninu jsme vystoupili v makedonské Neapoli.
12 ౧౨ మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
Po souši jsme pokračovali do Filip, nejvýznamnějšího města severní Makedonie, obydleného hlavně římskými kolonisty. Tam jsme se usadili na několik dní.
13 ౧౩ విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని అనుకున్నాము. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం.
Protože ve městě nebyla synagoga, vyšli jsme v sobotu za bránu na břeh řeky. Předpokládali jsme totiž, že by se tam mohli scházet místní židé a bohabojní pohané k modlitbám. Byla tam opravdu skupina žen, a tak jsme se posadili a mluvili k nim.
14 ౧౪ లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు.
Mezi posluchačkami byla také Lydie, obchodnice s purpurovými sukny, pohanka, která uvěřila v Boha. Kristovo slovo ji zaujalo a ona dychtivě naslouchala Pavlovu kázání.
15 ౧౫ ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
Přijala s celou svou rodinou křest a přiměla nás, abychom se stali hosty v jejich domě.
16 ౧౬ మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది.
Když jsme zase jednou šli na místo modliteb, potkala nás mladá otrokyně, která měla věštecké nadání. Její majitelé na tom pořádně vydělávali.
17 ౧౭ ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది.
Připojila se hned k nám a hlasitě vyvolávala: „Vidíte ty lidi? To jsou sluhové nejvyššího Boha a říkají nám, jak najít záchranu!“
18 ౧౮ ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది.
Tak to dělala den za dnem. Pavel to těžce nesl a jednoho dne jí přikázal: „Ve jménu Ježíše Krista, okamžitě přestaň!“Dívka se probrala ze svého vytržení a úplně tu schopnost ztratila.
19 ౧౯ ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
To ovšem rozzlobilo její pány, kteří přišli o zdroj značných příjmů.
20 ౨౦ న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి
Přivlekli Pavla a Silase na radnici před soudce a vznesli proti nim vážné obvinění: „To jsou židé, kteří pobuřují v našem římském městě a snaží se tu šířit svoje náboženství.“
21 ౨౧ రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు” అని చెప్పారు.
22 ౨౨ అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
Srocený lid se také připojil k tomu obvinění a úředníci tedy dali Pavla a Silase zmrskat pruty po nahém těle.
23 ౨౩ వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
Po krutém bičování je předali vězeňskému strážci do přísné vazby.
24 ౨౪ అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు.
Ten je vsadil do nejhlubší kobky a nohy jim sevřel kládou.
25 ౨౫ మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు.
Pavel a Silas se ještě o půlnoci hlasitě modlili a zpívali Bohu chvalozpěvy, až se to rozléhalo celou věznicí.
26 ౨౬ అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
Tu se zatřásla země, základy vězení byly porušeny, dveře vyvaleny a okovy se uvolnily.
27 ౨౭ అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు.
Žalářník se probudil a viděl, co se stalo. Tasil svůj meč a chtěl se jím probodnout, protože se domníval, že vězňové utekli, a on za ně ručil svým životem.
28 ౨౮ అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు.
Pavel na něj zavolal: „Nezabíjej se, vždyť nikdo neutekl!“
29 ౨౯ చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి,
Správce žaláře popadl pochodeň, seběhl do jejich kobky a vrhl se před nimi na kolena.
30 ౩౦ వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
Pak je vyvedl ven a ptal se: „Vy jste jistě bohové; co mám dělat, abych byl zachráněn?“
31 ౩౧ అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి
Řekli mu: „Bůh je Ježíš Kristus, v něho uvěř a budeš zachráněn s celou rodinou.“
32 ౩౨ అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు.
A vyprávěli jemu a všem obyvatelům jeho domácnosti o Kristu.
33 ౩౩ రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు.
Žalářník je pečlivě ošetřil a ještě v noci se dal s celou svojí rodinou i otroky pokřtít.
34 ౩౪ అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
Pak zasedli ke stolu a bylo tam veselo, vždyť uvěřili v živého Boha!
35 ౩౫ తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటులను పంపారు.
Ráno k němu poslali úředníci vojáka se vzkazem, aby apoštoly propustil.
36 ౩౬ చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియజేసి, “మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని చెప్పాడు.
Žalářník měl radost, že mohou klidně odejít,
37 ౩౭ అయితే పౌలు వారితో “వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి” అని చెప్పాడు.
ale Pavel si postavil hlavu: „To tedy ne! Nás, římské občany, dají bez výslechu veřejně zmrskat, vsadit do žaláře, a teď by se nás chtěli v tichosti zbavit? Ať pěkně sami přijdou a propustí nás.“
38 ౩౮ భటులు ఈ మాటలు న్యాయాధికారులకు తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి
Voják to vyřídil. Městští úředníci se polekali té skutečnosti, že Pavel a Silas jsou občany Římské říše.
39 ౩౯ వారిని బతిమాలుకుని చెరసాల బయటికి తీసుకుపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు.
Přišli tedy s omluvami, ale prosili je, aby opustili Filipy.
40 ౪౦ పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, వారిని ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు.
A tak apoštolové ještě navštívili křesťanku Lydii, kde se setkali s věřícími, potěšili se navzájem a odešli z města.

< అపొస్తలుల కార్యములు 16 >