< అపొస్తలుల కార్యములు 15 >

1 యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు.
A AKAI me kodido sang Iudäa, ap padaki ong saulang kan: Ma komail sota sirkomsais duen tiak en Moses, komail sota pan kak maurela.
2 పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.
A irail lao liak toror pasang o akakamai ong Paulus o Parnapas, re ap inauki pena, me Paulus i Parnapas, o pil akai irail en kotidalang Ierusalem ren wanporon o saunkoa kan pweki mepukat.
3 కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.
Momodisou ap likid ir wei lao ekis wasa. Irail ap weweid nan Pönisien o Samaria o kasokasoiada duen en men liki ar wukila. Irail ari kaperenda melel saulang kan karos.
4 వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం పలికారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు.
Irail lao lel Ierusalem, momodisou o wanporon, o saunkoa kan ap kasamo ir. Irail ap katitiki meakan, me Kot kotin wiaki irail er.
5 కానీ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.
A akai kisan pwin en Parisär, me saulangalar, me uda indada: Me pung, en sirkomsais ir ala, o kapi ong irail, en wiawia kapung en Moses.
6 అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు.
A wanporon o saunkoa kan pokon pena, pwen kaparok duen met.
7 “సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు.
Irail lao kapukapung pena warailar, Petrus ap kotida masani ong irail: Ri ai kan, komail asa, me mas o Kot kotin pil ia dar sang nan pung omail, pwe men liki kan en ronga sang nan au ai masan en rongamau o posonla.
8 హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు.
A Kot me kotin ereki mongiong en aramas, kotin kadede irail o kotiki ong irail Ngen saraui dueta kitail,
9 మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు.
O a sota kotin wiada irair eu nan pung en kitail o irail ni a kotin kamakel mongiong arail ki poson.
10 ౧౦ కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?
Ari, da me komail kasongesongki Kot, en kidang pon pop en tounpadak kan lopu eu, me sam atail akan o pil kitail sota kak wa.
11 ౧౧ ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.”
A kitail kin kamekamelele, me kitail pan kamaureki mak en Kaun Iesus Kristus dueta irail.
12 ౧౨ అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.
A pokon o nenenlata o rongerong en Parnapas i Paulus ara katiti duen manaman oko o kilel kai, me Kot kotin wia kidar lim ara nan pung en men liki kan.
13 ౧౩ వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి.
Irail lao nenenlar, Iakopus ap kaparok masanida: Ri ai kan komail rong ia!
14 ౧౪ యూదేతరుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు.
Simon me kasoiada duen en Kot a kotin pwara dong men liki kan ni tapi o pwen pili sang irail kainok eu ong mar a.
15 ౧౫ ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే,
Pwe iduen masan en saukop akan duen a intingidi:
16 ౧౬ ‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను. మనుషుల్లో మిగిలినవారూ, నా నామం ఎవరైతే ధరించారో ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా
Murin mepukat I pan puredo o kawiliakapada im en Dawid, me rongki pasanger, o pur ong kauada wasa me olar.
17 ౧౭ పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ
Pwe luan aramas akan en raparapaki Kaun o, pil men liki kan, me wan ad ai, iei me Kaun o masaniadar, me kin kotin wiawia.
18 ౧౮ అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిస్తున్నాడు’ అని రాసి ఉంది. (aiōn g165)
Mepukat me lolok sang ni tapi o. (aiōn g165)
19 ౧౯ “కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా
Ari iet me i kasauiada, kitail ender katoutoui irail me wuki ong Kot sang ren men liki kan.
20 ౨౦ విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.
A sen intinge wong irail, ren liki sang kasaut en kot mal akan, o nenek, o man mopelar akan, o nta.
21 ౨౧ ఎందుకంటే, సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దాన్ని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు” అని చెప్పాడు.
Pwe sang mas kokodo saunkawewe en Moses kin mi nan kanim karos, pwe re kin padapadak duen i nan sinakoke kan ni ran en sapat akan karos.
22 ౨౨ అప్పుడు సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, వారిని పౌలు, బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది.
Wanporon o saunkoa kan, o momodisou ap maukidar, en pilada ol akai sang ar pokon o porone ira wei iang Paulus i Parnapas, en kotila Antiokien: Iudas, me pil ad a Parnapas o Silas, ol pukat, me kaun pan saulang kan.
23 ౨౩ వారు ఇలా రాసి పంపారు. “అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియలోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాస్తున్నది,
A iet eten, me re intingiedier ap kadar wong irail: Iet kit wanporon o saunkoa kan o saulang kan kadar wong komail, ri at akan, me ko sang ren men liki kan nan Antiokien, o Sirien, o Sisilia at ranamau.
24 ౨౪ కొందరు మా దగ్గర నుండి వెళ్ళి తమ బోధతో మిమ్మల్ని గాబరా పెట్టి, మీ మనసులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ ఇవ్వలేదు.
Aki at ronger, me akai, me koiei sang re at, kin kaponepone kin ngen omail ar padak kan ni ar kasapunge komail lar indada: Komail en sirkomsais o kapwaiada kapung o; a se sota ki ong irail kusoned akan.
25 ౨౫ కాబట్టి కొందరిని ఎన్నుకుని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే
Kit ap wiaki eu ni at maukidar en piladar ol akai, ap kadar wong komail iangaki kompoke pat Parnapas o Paulus.
26 ౨౬ మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది.
Ol oko me tonmeteki maur ara ong mar en Kaun Iesus Kristus.
27 ౨౭ అందువలన మన ప్రియమైన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు.
Kit ari kadar wei Iudas o Silas, me pil pan kasoi ong komail mepukat.
28 ౨౮ ‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’
Pwe Ngen saraui o kit kin kupukupura, me mau, se ender ki ong komail eu lopu; mepukat eta me kasampwal:
29 ౨౯ అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”
Komail liki sang uduk, me mairong ong kot likam, o nta, o man mopelar, o nenek. Ma komail liki sang mepukat, nan komail kin wiawia me mau. Ran kaselel!
30 ౩౦ ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం ఇచ్చారు.
Irail lao pakadarala, ap kotilang Antiokien, re ap kapokon ir pena, ki ong irail kisin likau o.
31 ౩౧ వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు.
Irail lao wadoker, ap peren kidar kamait parail.
32 ౩౨ యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.
A Iudas i Silas, me pil saukop oko panaui kin saulang kan kasoi toto o pil katinai ir ada.
33 ౩౩ వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన
Irail mi wasa o lao ran akai, ap pakadarala popol sang ren saulang kan, pwe ren kola ren me kadar ira ala.
34 ౩౪ వారి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.
35 ౩౫ అయితే పౌలు బర్నబా అంతియొకయలోనే ఉండి అనేకమందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు.
A Paulus i Parnapas kotikoteta Antiokien, kawewedar o padapadaki masan en Kaun o, o me toto pil iang.
36 ౩౬ కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు.
Kadekadeo murin ran akai Paulus masani on Parnapas: Kita pan purela ren saulang kan, me mi kanim akan, wasa kita padakier duen masan en Kaun o, o kalekalelapok due’rail.
37 ౩౭ అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు.
A Parnapas men ukada Ioanes, me pil ad a Markus.
38 ౩౮ అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు.
A Paulus kupura, me a sota mau, ira en ukada i, me muei sang ira nan Pampilien o solar iang ira kolang dodok.
39 ౩౯ ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.
Ira ari akamai pena lao ira muei pasang. Parnapas ari ukada Markus tanga wong Sipern.
40 ౪౦ పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి,
Paulus piladar Silas ap kotila. A saulang kan mueidela ira ni mak en Kot.
41 ౪౧ సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.
I ari kakan sili nan Sirien o Silisia katinada momodisou kan.

< అపొస్తలుల కార్యములు 15 >