< అపొస్తలుల కార్యములు 15 >
1 ౧ యూదయ నుండి కొందరు వచ్చి, “మోషే నియమించిన విశ్వాసులకు సున్నతి పొందితేనే గాని మీకు రక్షణ లేదు” అని విశ్వాసులకు బోధిస్తూ ఉన్నారు.
And certain ones, descending from Judea, were teaching the brothers, “Unless you are circumcised according to the custom of Moses, you cannot be saved.”
2 ౨ పౌలుకు, బర్నబాకు వారితో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ సమస్య గురించి పౌలు బర్నబాలు, ఇంకా మరి కొంతమంది యెరూషలేములోని అపొస్తలుల, పెద్దల దగ్గరికి వెళ్ళాలని సోదరులు నిశ్చయించారు.
Therefore, when Paul and Barnabas made no small uprising against them, they decided that Paul and Barnabas, and some from the opposing side, should go up to the Apostles and priests in Jerusalem concerning this question.
3 ౩ కాబట్టి సంఘం వారిని సాగనంపగా, వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల ద్వారా వెళ్తూ, యూదేతరులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసి సోదరులందరికి మహానందం కలగజేశారు.
Therefore, being led by the church, they traveled through Phoenicia and Samaria, describing the conversion of the Gentiles. And they caused great joy among all the brothers.
4 ౪ వారు యెరూషలేము చేరగానే సంఘం, అపొస్తలులూ పెద్దలూ వారికి స్వాగతం పలికారు. దేవుడు తమకు తోడై చేసిన వాటన్నిటినీ వారు వివరించారు.
And when they had arrived in Jerusalem, they were received by the church and the Apostles and the elders, reporting what great things God had done with them.
5 ౫ కానీ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, యూదేతరులకు సున్నతి చేయించాలనీ, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వారికి ఆజ్ఞాపించాలనీ చెప్పారు.
But some from the sect of the Pharisees, those who were believers, rose up saying, “It is necessary for them to be circumcised and to be instructed to keep the Law of Moses.”
6 ౬ అప్పుడు అపొస్తలులూ పెద్దలూ ఈ సంగతి గూర్చి ఆలోచించడానికి సమావేశమయ్యారు. చాలా చర్చ జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇలా అన్నాడు.
And the Apostles and elders came together to take care of this matter.
7 ౭ “సోదరులారా, యూదేతరులు నా నోట సువార్త విని విశ్వసించేలా మీలో నుండి నన్ను ఆరంభ దినాల్లో దేవుడు ఎన్నుకున్నాడని మీకు తెలుసు.
And after a great contention had taken place, Peter rose up and said to them: “Noble brothers, you know that, in recent days, God has chosen from among us, by my mouth, Gentiles to hear the word of the Gospel and to believe.
8 ౮ హృదయాలను ఎరిగిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినట్టే, వారికీ ఇచ్చి, తాను వారిని స్వీకరించినట్టుగా వెల్లడి పరిచాడు.
And God, who knows hearts, offered testimony, by giving the Holy Spirit to them, just as to us.
9 ౯ మనకీ వారికీ ఏ తేడా చూపకుండా వారి హృదయాలను విశ్వాసంతో పవిత్రపరచాడు.
And he distinguished nothing between us and them, purifying their hearts by faith.
10 ౧౦ కాబట్టి మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు?
Now therefore, why do you tempt God to impose a yoke upon the necks of the disciples, which neither our fathers nor we have been able to bear?
11 ౧౧ ప్రభువైన యేసు కృప ద్వారా మనం రక్షణ పొందుతామని మనం నమ్ముతున్నాం గదా? అలాగే వారూ రక్షణ పొందుతారు.”
But by the grace of the Lord Jesus Christ, we believe in order to be saved, in the same manner also as them.”
12 ౧౨ అప్పుడు బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు యూదేతరుల్లో చేసిన సూచకక్రియలనూ మహత్కార్యాలనూ వివరిస్తుంటే సభ అంతా నిశ్శబ్దంగా ఆలకించింది.
Then the entire multitude was silent. And they were listening to Barnabas and Paul, describing what great signs and wonders God had wrought among the Gentiles through them.
13 ౧౩ వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి.
And after they had been silent, James responded by saying: “Noble brothers, listen to me.
14 ౧౪ యూదేతరుల్లో నుండి దేవుడు తన నామం కోసం ఒక జనాన్ని ఏర్పరచుకోడానికి వారిని మొదట ఎలా కటాక్షించాడో సీమోను తెలియజేశాడు.
Simon has explained in what manner God first visited, so as to take from the Gentiles a people to his name.
15 ౧౫ ఇందుకు ప్రవక్తల మాటలు సరిపోతున్నాయి. ఎలాగంటే,
And the words of the Prophets are in agreement with this, just as it was written:
16 ౧౬ ‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను. మనుషుల్లో మిగిలినవారూ, నా నామం ఎవరైతే ధరించారో ఆ యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా
‘After these things, I will return, and I will rebuild the tabernacle of David, which has fallen down. And I will rebuild its ruins, and I will raise it up,
17 ౧౭ పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి నిర్మిస్తాననీ పాడైన వాటిని తిరిగి కట్టి వాటిని నిలబెడతాననీ
so that the rest of men may seek the Lord, along with all the nations over whom my name has been invoked, says the Lord, who does these things.’
18 ౧౮ అనాదికాలం నుండి ఈ సంగతులను తెలియజేసిన ప్రభువు సెలవిస్తున్నాడు’ అని రాసి ఉంది. (aiōn )
To the Lord, his own work has been known from eternity. (aiōn )
19 ౧౯ “కాబట్టి యూదేతరుల్లో నుండి దేవుని వైపు తిరిగే వారిని మనం కష్టపెట్టకుండా
Because of this, I judge that those who were converted to God from among the Gentiles are not to be disturbed,
20 ౨౦ విగ్రహ సంబంధమైన అపవిత్రతనూ జారత్వాన్నీ విసర్జించాలనీ, గొంతు నులిమి చంపిన దాన్ని, రక్తాన్నీ తినకూడదనీ, వారికి ఉత్తరం రాసి పంపాలని నా అభిప్రాయం.
but instead that we write to them, that they should keep themselves from the defilement of idols, and from fornication, and from whatever has been suffocated, and from blood.
21 ౨౧ ఎందుకంటే, సమాజ మందిరాల్లో ప్రతి విశ్రాంతిదినాన మోషే లేఖనాలను చదువుతూ తరతరాల నుండి దాన్ని ప్రకటించే వారు ప్రతి పట్టణంలో ఉన్నారు” అని చెప్పాడు.
For Moses, from ancient times, has had in each city those who preach him in the synagogues, where he is read on every Sabbath.”
22 ౨౨ అప్పుడు సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అనే పేరున్న యూదానూ సీలనూ ఎన్నుకుని, వారిని పౌలు, బర్నబాలతో అంతియొకయ పంపడం మంచిదని అపొస్తలులకూ పెద్దలకూ సంఘమంతటికీ తోచింది.
Then it pleased the Apostles and elders, with the whole Church, to choose men from among them, and to send to Antioch, with Paul and Barnabas, and Judas, who was surnamed Barsabbas, and Silas, preeminent men among the brothers,
23 ౨౩ వారు ఇలా రాసి పంపారు. “అపొస్తలులూ పెద్దలూ సోదరులూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియలోని యూదేతరులైన సోదరులకు, శుభాకాంక్షలతో చెప్పి రాస్తున్నది,
what was written by their own hands: “The Apostles and elders, brothers, to those who are at Antioch and Syria and Cilicia, brothers from the Gentiles, greetings.
24 ౨౪ కొందరు మా దగ్గర నుండి వెళ్ళి తమ బోధతో మిమ్మల్ని గాబరా పెట్టి, మీ మనసులను చెరుపుతున్నారని విన్నాం. వారికి మేము ఏ అధికారమూ ఇవ్వలేదు.
Since we have heard that some, going out from among us, have troubled you with words, subverting your souls, to whom we gave no commandment,
25 ౨౫ కాబట్టి కొందరిని ఎన్నుకుని, మన ప్రభువైన యేసు క్రీస్తు కోసం ప్రాణాలకు తెగించిన బర్నబా, పౌలు అనే
it pleased us, being assembled as one, to choose men and to send them to you, with our most beloved Barnabas and Paul:
26 ౨౬ మన ప్రియ మిత్రులతో కూడా వారిని మీ దగ్గరికి పంపడం మంచిదని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగింది.
men who have handed over their lives on behalf of the name of our Lord Jesus Christ.
27 ౨౭ అందువలన మన ప్రియమైన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు.
Therefore, we have sent Judas and Silas, who themselves also will, with the spoken word, reaffirm to you the same things.
28 ౨౮ ‘విగ్రహాలకు అర్పించిన వాటినీ, రక్తాన్నీ, గొంతు నులిమి చంపిన దానినీ తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి’
For it has seemed good to the Holy Spirit and to us to impose no further burden upon you, other than these necessary things:
29 ౨౯ అనే తప్పనిసరైన వీటి కంటే ఎక్కువైన ఏ భారాన్నీ మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకూ మాకూ అనిపించింది. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే అది మీకు మేలు. సెలవు.”
that you abstain from things immolated to idols, and from blood, and from what has been suffocated, and from fornication. You will do well to keep yourselves from these things. Farewell.”
30 ౩౦ ఆ పైన వారు వీడ్కోలు పలికి అంతియొకయ వచ్చి శిష్యులను సమకూర్చి ఆ ఉత్తరం ఇచ్చారు.
And so, having been dismissed, they went down to Antioch. And gathering the multitude together, they delivered the epistle.
31 ౩౧ వారు దాన్ని చదువుకుని ప్రోత్సాహం పొంది సంతోషించారు.
And when they had read it, they were gladdened by this consolation.
32 ౩౨ యూదా, సీల కూడా ప్రవక్తలైనందున వారు చాలా మాటలతో సోదరులను ఆదరించి బలపరిచారు.
But Judas and Silas, being also prophets themselves, consoled the brothers with many words, and they were strengthened.
33 ౩౩ వారు అక్కడ కొంతకాలం గడిపిన తరువాత, వారిని పంపిన
Then, after spending some more time there, they were dismissed with peace, by the brothers, to those who had sent them.
34 ౩౪ వారి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి, సోదరులు వారిని ప్రశాంతంగా సాగనంపారు.
But it seemed good to Silas to remain there. So Judas alone departed to Jerusalem.
35 ౩౫ అయితే పౌలు బర్నబా అంతియొకయలోనే ఉండి అనేకమందికి ప్రభువును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు.
And Paul and Barnabas remained at Antioch, with many others, teaching and evangelizing the Word of the Lord.
36 ౩౬ కొన్ని రోజులైన తరువాత పౌలు “ఏ ఏ పట్టణాల్లో ప్రభువు వాక్కు ప్రకటించామో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి, వారెలా ఉన్నారో చూద్దాం” అని బర్నబాతో అన్నాడు.
Then, after some days, Paul said to Barnabas, “Let us return to visit the brothers throughout all the cities in which we have preached the Word of the Lord, to see how they are.”
37 ౩౭ అప్పుడు మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని వెళ్ళడానికి బర్నబా ఇష్టపడ్డాడు.
And Barnabas wanted to take John, who was surnamed Mark, with them also.
38 ౩౮ అయితే పౌలు పంఫులియలో పరిచర్యకు తమతో రాకుండా విడిచి వెళ్ళిపోయిన వాణ్ణి వెంటబెట్టుకుని పోవడం భావ్యం కాదని తలంచాడు.
But Paul was saying that he ought not to be received, since he withdrew from them at Pamphylia, and he had not gone with them in the work.
39 ౩౯ ఇద్దరి మధ్య తీవ్రమైన భేదాభిప్రాయం రావడంతో వారు ఒకరి నొకరు విడిచి వేరైపోయారు. బర్నబా, మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి సైప్రస్ వెళ్ళాడు.
And there occurred a dissension, to such an extent that they departed from one another. And Barnabas, indeed taking Mark, sailed to Cyprus.
40 ౪౦ పౌలు సీలను ఎంపిక చేసుకుని, సోదరులు తనను ప్రభువు కృపకు అప్పగించగా బయలుదేరి,
Yet truly, Paul, choosing Silas, set out, being delivered by the brothers to the grace of God.
41 ౪౧ సంఘాలను బలపరుస్తూ సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశాడు.
And he traveled through Syria and Cilicia, confirming the Churches, instructing them to keep the precepts of the Apostles and the elders.