< అపొస్తలుల కార్యములు 14 >

1 ఈకొనియలో ఏం జరిగిందంటే, పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులూ గ్రీకులూ విశ్వసించారు.
ויהי באיקניון ויבאו יחדו אל בית כנסת היהודים וידברו שם עד כי האמין המון רב מן היהודים ומן היונים׃
2 అయితే అవిధేయులైన యూదులు యూదేతరులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద ద్వేషం పుట్టించారు.
אך היהודים אשר לא האמינו עוררו והכעיסו את נפשות הגוים על האחים׃
3 పౌలు, బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాటలాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలనూ మహత్కార్యాలనూ చేయించి తన కృపా సందేశాన్ని రుజువు చేశాడు.
וישבו שם ימים רבים וילמדו בבטחונם ביהוה העמיד על דבר חסדו בעשותו על ידם אתות ומופתים׃
4 ఆ పట్టణంలోని జనసమూహంలో భేదాలు వచ్చి కొందరు యూదుల పక్షం, మరి కొందరు అపొస్తలుల పక్షం చేరారు.
ויחלק המון העיר לחצי אלה נטו אחרי היהודים ואלה אחרי השליחים׃
5 యూదేతరులూ యూదులూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాలను బాధించి రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు.
ויהי רגשת הגוים והיהודים עם ראשיהם להתעלל בהם ולסקלם׃
6 వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు.
ויודע להם ויברחו לערי לוקוניא אל לוסטרא ודרבי וסביבותן׃
7 లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు.
ויבשרו שם הבשורה׃
8 అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు.
ואיש נכה רגלים היה בלוסטרא והוא ישב פסח מבטן אמו ולא הלך מימיו׃
9 అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి,
וישמע את פולוס מדבר והוא הסתכל בו וירא כי אמונה בו להושע׃
10 ౧౦ “లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు.
ויאמר בקול גדול עמד הכן על רגליך וידלג ויתהלך׃
11 ౧౧ ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి,
והמון העם כראותם את אשר עשה פולוס נשאו את קולם ויאמרו בלשון לוקונית ירדו אלינו האלהים בדמות אנשים׃
12 ౧౨ బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు.
ויקראו לבר נבא בל ולפולוס קראו הרמיס באשר הוא ראש המדברים׃
13 ౧౩ పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు.
וכהן בית בל אשר מחוץ לעירם הביא השערה שורים ועטרות ויחפץ לזבח הוא והמון העם׃
14 ౧౪ అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి
ויהי כשמע זאת השליחים פולוס ובר נבא ויקרעו את בגדיהם וירוצו אל תוך העם׃
15 ౧౫ “అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.
ויצעקו לאמר אנשים למה תעשו כזאת גם אנחנו בני אדם חלשים כמוכם ונבשרה אתכם למען שוב תשובו מן הבליכם אלה אל אלהים חיים אשר עשה את השמים ואת הארץ ואת הים ואת כל אשר בם׃
16 ౧౬ ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు.
ואשר בדרות קדם הניח לכל הגוים ללכת בדרכיהם׃
17 ౧౭ అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.”
וגם לא חדל להעיד על עצמו וייטב לנו בתתו מטר מן השמים ועתות שבע וימלא לבותינו מזון וששון׃
18 ౧౮ వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.
ואף בדברים האלה כמעט לא עצרו כח לכלוא את העם מזבח להם׃
19 ౧౯ అంతియొకయ, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనాన్ని తమ వైపు తిప్పుకుని, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకుని పట్టణం బయటికి అతనిని ఈడ్చివేశారు.
ויבאו שמה יהודים מן אנטיוכיא ומן איקניון ויסיתו את העם וירגמו את פולוס באבנים ויסחבהו חוצה לעיר בחשבם כי מת׃
20 ౨౦ అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి, మరుసటి రోజు బర్నబాతో కూడ దెర్బేకు వెళ్ళిపోయాడు.
ויסבו אתו התלמידים ויקם ויבא העירה וממחרת יצא אל דרבי הוא ובר נבא׃
21 ౨౧ వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు.
ויבשרו את הבשורה בעיר ההיא ואחרי העמידם תלמידים הרבה שבו אל לוסטרא ואיקניון ואנטיוכיא׃
22 ౨౨ శిష్యుల మనసులను దృఢపరచి, విశ్వాసంలో నిలకడగా ఉండాలనీ, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక హింసలు పొందాలనీ వారిని ప్రోత్సహించారు.
ויחזקו את נפשות התלמידים ויזהירו אתם לעמד באמונה וכי רק בצרות רבות בוא נבוא אל מלכות האלהים׃
23 ౨౩ ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు.
ויבחרו להם זקנים בכל קהלה וקהלה ויתפללו ויצומו ויפקידום ביד האדון אשר האמינו בו׃
24 ౨౪ తరువాత పిసిదియ ప్రాంతమంతటా సంచరించి పంఫూలియ వచ్చారు.
ויעברו בפיסדיא ויבאו אל פמפוליא׃
25 ౨౫ వారు పెర్గేలో వాక్కు బోధించి, అత్తాలియ వెళ్ళారు.
וישמיעו את דבר יהוה בפרגי וירדו אל אטליא׃
26 ౨౬ అక్కడ నుండి ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తం మొదట దేవుని కృపకు అప్పగించుకుని, బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు.
ומשם באו באניה אל אנטיוכיא אשר נמסרו שם לחסד אלהים על המלאכה אשר מלאו אתה׃
27 ౨౭ వారు వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటినీ, యూదేతరులు విశ్వసించడానికి ఆయన ద్వారం తెరచిన సంగతీ వివరించారు.
ובבאם שמה הקהילו את העדה ויגידו את כל אשר עשה אתם האלהים ואת אשר פתח לגוים פתח האמונה׃
28 ౨౮ ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలాకాలం గడిపారు.
וישבו שם עם התלמידים ימים לא מעטים׃

< అపొస్తలుల కార్యములు 14 >