< అపొస్తలుల కార్యములు 13 >
1 ౧ అంతియొకయలోని క్రైస్తవ సంఘంలో బర్నబా, నీగెరు అనే సుమెయోను, కురేనీ వాడైన లూకియ, రాష్ట్రపాలకుడు హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలూ బోధకులూ ఉన్నారు.
The church at Antioch had prophets and teachers: Barnabas, Simeon Niger, Lucius of Cyrene, Manaen (the childhood friend of Herod the tetrarch), and Saul.
2 ౨ వారు ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం ఉన్నపుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కోసం వారిని నాకు కేటాయించండి” అని వారితో చెప్పాడు.
While they were worshiping the Lord and fasting, the Holy Spirit said, “Set apart Barnabas and Saul to do the work I've called them to.”
3 ౩ విశ్వాసులు ఉపవాసముండి, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిన తరువాత వారిని పంపించారు.
After they had fasted, prayed, and placed their hands on them in blessing, they sent them on their way.
4 ౪ కాబట్టి బర్నబా, సౌలు పరిశుద్ధాత్మ పంపగా బయలుదేరి సెలూకియ వచ్చి అక్కడ నుండి సముద్ర మార్గంలో సైప్రస్ ద్వీపానికి వెళ్ళారు.
So Barnabas and Saul, directed by the Holy Spirit, went to Seleucia. From there they sailed to Cyprus.
5 ౫ వారు సలమీ అనే ఊరికి చేరుకుని యూదుల సమాజ మందిరాల్లో దేవుని వాక్కు ప్రకటించారు. మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.
Arriving at Salamis, they proclaimed the word of God in the Jewish synagogues. John was with them as their assistant.
6 ౬ వారు ఆ ద్వీపమంతా తిరిగి పాఫు అనే ఊరికి వచ్చి మంత్రగాడూ యూదీయ అబద్ధ ప్రవక్త అయిన బర్ యేసు అనే ఒకణ్ణి చూశారు.
They traveled throughout the island and eventually came to Paphos. There they found a Jewish magician, a false prophet by the name of Bar-jesus.
7 ౭ ఇతడు వివేకి అయిన సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్కు వినాలని బర్నబానూ సౌలునూ పిలిపించాడు.
He was close to the governor, Sergius Paulus, an intelligent man. Sergius Paulus invited Barnabas and Saul to come and visit him since he wanted to hear the word of God.
8 ౮ అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు.
But the magician Elymas (his Greek name) opposed them, trying to prevent the governor from trusting in God.
9 ౯ అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి
Saul, also called Paul, was filled with the Holy Spirit, and looked straight at him.
10 ౧౦ అతనిని తేరి చూసి, “అపవాది కొడుకా, నీవు అన్ని రకాల కపటంతో దుర్మార్గంతో నిండి ఉన్నావు, నీవు నీతికి విరోధివి, ప్రభువు తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా?
“You are full of deception and all kinds of evil, you son of the devil, you enemy of all that is right! Will you never give up perverting the Lord's true ways?
11 ౧౧ ఇదిగో, ప్రభువు నీ మీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడవు” అని చెప్పాడు. వెంటనే మబ్బూ, చీకటీ అతనిని కమ్మాయి, కాబట్టి అతడు ఎవరైనా తనను చెయ్యి పట్టుకుని నడిపిస్తారేమో అని తడుములాడసాగాడు.
Look, the Lord's hand is on you and you will become blind. You will not see the sun for some time.” Immediately mist and darkness fell on him, and he had to find someone who could lead him by the hand.
12 ౧౨ అధిపతి, జరిగిన దాన్ని చూసి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు.
When the governor saw what happened he trusted in God, amazed at the teaching about the Lord.
13 ౧౩ తరువాత పౌలు, అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫులియా లోని పెర్గ కు వచ్చారు. అక్కడ యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు.
Then Paul and those with him sailed from Paphos and went to Perga in Pamphylia, while John left them and went back to Jerusalem.
14 ౧౪ అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చి విశ్రాంతిదినాన సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నారు.
They went through Perga and on to Antioch of Pisidia. On the Sabbath day they went into the synagogue and were seated.
15 ౧౫ ధర్మశాస్త్రం, ప్రవక్తల లేఖనాలను చదివిన తరువాత సమాజ మందిరపు అధికారులు, “సోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా ప్రోత్సాహ వాక్కు చెప్పాలంటే చెప్పండి” అని అడిగారు.
After the readings from the Law and the Prophets, the synagogue leaders sent them a message saying, “Brothers, please share with the congregation any words of encouragement you may have.”
16 ౧౬ అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు,
Paul stood up, motioned with his hand to get their attention, and began speaking. “Men of Israel, and all of you who have reverence for God, listen to me.
17 ౧౭ “ఇశ్రాయేలీయులారా, దేవుడంటే భయభక్తులున్న వారలారా, వినండి. ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వీకులను ఏర్పరచుకుని, వారు ఐగుప్తు దేశంలో ఉన్నపుడు ఆ ప్రజలను అసంఖ్యాకులుగా చేసి, తన భుజబలం చేత వారిని అక్కడ నుండి తీసుకుని వచ్చాడు.
The God of the people of Israel chose our forefathers, and gave our people prosperity during their stay in the land of Egypt. Then with his mighty power he led them out of Egypt,
18 ౧౮ సుమారు నలభై ఏళ్ళు అరణ్యంలో వారిని సహించాడు.
and he patiently dealt with them in the desert for about forty years.
19 ౧౯ కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశాలను మన ప్రజలకు వారసత్వంగా ఇచ్చాడు.
After he had overthrown seven nations living in the land of Canaan, God divided their land among the Israelites and gave it to them to inherit. This took about four hundred and fifty years.
20 ౨౦ ఈ సంఘటనలన్నీ సుమారు 450 సంవత్సరాలు జరిగాయి. ఆ తరువాత సమూయేలు ప్రవక్త వరకూ దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు.
Then he provided them with judges as leaders until the time of the prophet Samuel.
21 ౨౧ ఆ తరువాత వారు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడూ కీషు కుమారుడూ అయిన సౌలును వారికి నలభై ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు.
Then the people asked for a king, and God gave them Saul, son of Kish from the tribe of Benjamin, who ruled for forty years.
22 ౨౨ తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా చేశాడు. ఆయన ‘నేను యెష్షయి కుమారుడు దావీదును నా ఇష్టానుసారమైన వానిగా కనుగొన్నాను. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు’ అని దావీదును గురించి దేవుడు సాక్షమిచ్చాడు.
Then God removed Saul, and made David their king. God approved of David, saying ‘I found David the son of Jesse to be a man according to my own heart; he will do everything I intend.’
23 ౨౩ “అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలు కోసం రక్షకుడైన యేసును పుట్టించాడు.
Jesus is David's descendant; he is the Savior that God promised to bring to Israel.
24 ౨౪ ఆయన రాక ముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారుమనస్సు విషయమైన బాప్తిసం ప్రకటించాడు.
Before Jesus came, John announced the baptism of repentance to all the people of Israel.
25 ౨౫ యోహాను తన పనిని నెరవేరుస్తుండగా, “నేనెవరినని మీరనుకుంటున్నారు? నేను ఆయనను కాను. వినండి, నా వెనక ఒకాయన వస్తున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు” అని చెప్పాడు.
As John was completing his mission, he said, ‘Who do you think I am? I am not the one you're looking for. But after me one is coming whose sandals I'm not worthy to untie.’
26 ౨౬ “సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుడంటే భయభక్తులు గలవారలారా, ఈ రక్షణ సందేశం మనకే వచ్చింది.
My brothers, children of Abraham and those of you who have reverence for God: the message of this salvation has been sent to us!
27 ౨౭ యెరూషలేములో నివసిస్తున్నవారు, వారి అధికారులూ, ఆయనను గానీ, ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను గానీ నిజంగా గ్రహించక, యేసుకు మరణ శిక్ష విధించి ఆ ప్రవచనాలను నెరవేర్చారు.
The people living in Jerusalem and their leaders didn't recognize Jesus or understand the words spoken by the prophets that are read every Sabbath. In fact they fulfilled the prophetic words by condemning him!
28 ౨౮ ఆయనలో మరణానికి తగిన కారణమేమీ కనబడక పోయినా వారు ఆయనను చంపాలని పిలాతును కోరారు.
Even though they couldn't find any evidence to sentence him to death, they still asked Pilate to have him killed.
29 ౨౯ ఆయనను గురించి రాసినవన్నీ నెరవేరిన తరువాత వారాయనను మాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు.
After they had fulfilled everything predicted that they would do to him, they took him down from the cross and buried him in a tomb.
30 ౩౦ అయితే దేవుడు చనిపోయిన వారిలో నుండి ఆయనను లేపాడు.
But God raised him from the dead,
31 ౩౧ ఆయన గలిలయ నుండి యెరూషలేముకు తనతో వచ్చిన వారికి చాలా రోజులు కనిపించాడు. వారే ఇప్పుడు ప్రజలకు ఆయన సాక్షులుగా ఉన్నారు.
and he appeared over the course of many days to those who had followed him from Galilee to Jerusalem. They are now his witnesses to the people.
32 ౩౨ పితరులకు చేసిన వాగ్దానాల గురించి మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాం. దేవుడు ఈ వాగ్దానాలను వారి పిల్లలమైన మనకు ఇప్పుడు యేసును మృతుల్లో నుండి లేపడం ద్వారా నెరవేర్చాడు.”
We are here to bring to you the good news of the promise that God made to our forefathers,
33 ౩౩ “‘నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కన్నాను’ అని రెండవ కీర్తనలో కూడా రాసి ఉంది.
that he has now fulfilled to us their children by raising Jesus from the dead. As it is written in Psalm 2: ‘You are my Son; today I have become your Father.’
34 ౩౪ ఇంకా, ఇకపై కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపడం ద్వారా, ‘దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన, నమ్మకమైన దీవెనలను నీకిస్తాను’ అని చెప్పాడు.
God raised him from the dead, never to die again, as he indicated by saying, ‘I will give you what is holy and trustworthy, as I promised to David.’
35 ౩౫ అందుకే వేరొక కీర్తనలో, ‘నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు’ అని చెబుతున్నాడు.
As another psalm says, ‘You will not allow your Holy One to see decay.’
36 ౩౬ దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి కన్ను మూశాడు.
But David died, after he had done what God wanted in his own time, and he was buried with his ancestors, and his body decayed.
37 ౩౭ తన పితరుల దగ్గర సమాధి అయి కుళ్ళిపోయాడు గాని, దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు.
The one God raised from the dead saw no decay.
38 ౩౮ కాబట్టి సోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రకటిస్తున్నాము.
My brothers, I want you to understand that we're telling you that through this man sins are forgiven.
39 ౩౯ మోషే ధర్మశాస్త్రం మిమ్మల్ని ఏ విషయాల్లో నిర్దోషులుగా తీర్చలేక పోయిందో ఆ విషయాలన్నిటిలో, విశ్వసించే ప్రతివానినీ ఈయనే నిర్దోషిగా తీరుస్తాడని మీకు తెలియాలి.
Through him everyone who trusts in him is made morally right from all that is wrong—in a way that you could never be set right by the law of Moses.
40 ౪౦ కాబట్టి ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే,
Make sure that what the prophets said doesn't happen to you:
41 ౪౧ ‘తిరస్కరిస్తున్న మీరు, విస్మయం చెందండి, నశించండి. మీ కాలంలో నేను ఒక పని చేస్తాను, ఆ పని ఎవరైనా మీకు వివరించినా మీరెంత మాత్రమూ నమ్మరు.’”
‘You who are scornful, look in amazement, and die! For what I'm doing in your lifetime is something that you could never believe, even if someone told you!’”
42 ౪౨ పౌలు బర్నబాలు వెళ్ళిపోతుంటే ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినాన మళ్ళీ చెప్పాలని ప్రజలు బతిమిలాడారు.
As they were leaving, the people pleaded with them to tell them more the next Sabbath.
43 ౪౩ సమావేశం ముగిసిన తరువాత చాలామంది యూదులూ, యూదామతంలోకి మారినవారూ, పౌలునూ బర్నబానూ వెంబడించారు. పౌలు బర్నబాలు వారితో మాట్లాడుతూ, దేవుని కృపలో నిలిచి ఉండాలని వారిని ప్రోత్సహించారు.
After the meeting in the synagogue, many of the Jews and the converts to Judaism followed Paul and Barnabas who spoke with them, encouraging them to continue to hold on to the grace of God.
44 ౪౪ మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్కు వినడానికి సమావేశం అయింది.
The following Sabbath almost the whole town turned out to hear the word of God.
45 ౪౫ యూదులు ఆ జనసమూహాలను చూసి కన్ను కుట్టి, పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి వారిని హేళన చేశారు.
However, when the Jews saw the crowds, they became extremely jealous, contradicting what Paul was saying and cursing him.
46 ౪౬ అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు, “దేవుని వాక్కు మొదట మీకు చెప్పడం అవసరమే. అయినా మీరు దాన్ని తోసివేసి, మీకు మీరే నిత్యజీవానికి అయోగ్యులుగా చేసుకుంటున్నారు. కాబట్టి మేము యూదేతరుల దగ్గరికి వెళ్తున్నాం. (aiōnios )
So Paul and Barnabas spoke out strongly, saying “We had to speak the word of God to you first. But now that you're rejecting it—you're deciding that you're not worthy of eternal life—well now we're turning to the foreigners. (aiōnios )
47 ౪౭ “ఎందుకంటే, ‘నీవు ప్రపంచమంతటా రక్షణ తెచ్చేవానిగా ఉండేలా నిన్ను యూదేతరులకు వెలుగుగా ఉంచాను’ అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు” అన్నారు.
That's what the Lord has told us to do: ‘I've made you a light to the foreigners, and through you salvation will go to the ends of the earth.’”
48 ౪౮ యూదేతరులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్కును కొనియాడారు. అంతేగాక నిత్యజీవానికి నియమితులైన వారంతా విశ్వసించారు. (aiōnios )
When the foreigners heard this they were overjoyed, praising the Lord's word, and all those chosen for eternal life trusted in God. (aiōnios )
49 ౪౯ ప్రభువు వాక్కు ఆ ప్రదేశమంతటా వ్యాపించింది.
So God's word was spread throughout the region.
50 ౫౦ అయితే యూదులు భక్తి మర్యాదలున్న స్త్రీలనూ ఆ పట్టణ ప్రముఖులనూ రెచ్చగొట్టి పౌలునూ బర్నబానూ హింసల పాలు చేసి, వారిని తమ ప్రాంతం నుండి తరిమేశారు.
But the Jews incited the prominent religious women and leaders of the city to persecute Paul and Barnabas, and had them expelled from their territory.
51 ౫౧ అయితే పౌలు బర్నబాలు తమ పాద ధూళిని వారికి దులిపి వేసి ఈకొనియ ఊరికి వచ్చారు.
So they shook the dust off their feet against them as a sign of protest, and went on to Iconium.
52 ౫౨ అయితే శిష్యులు ఆనందంతో పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు.
And the believers continued to be filled with joy and with the Holy Spirit.