< అపొస్తలుల కార్యములు 12 >

1 ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు.
κατ εκεινον δε τον καιρον επεβαλεν ηρωδησ ο βασιλευσ τασ χειρασ κακωσαι τινασ των απο τησ εκκλησιασ
2 యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.
ανειλεν δε ιακωβον τον αδελφον ιωαννου μαχαιρα
3 ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
και ιδων οτι αρεστον εστιν τοισ ιουδαιοισ προσεθετο συλλαβειν και πετρον ησαν δε αι ημεραι των αζυμων
4 అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు.
ον και πιασασ εθετο εισ φυλακην παραδουσ τεσσαρσιν τετραδιοισ στρατιωτων φυλασσειν αυτον βουλομενοσ μετα το πασχα αναγαγειν αυτον τω λαω
5 పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు.
ο μεν ουν πετροσ ετηρειτο εν τη φυλακη προσευχη δε ην εκτενησ γινομενη υπο τησ εκκλησιασ προσ τον θεον υπερ αυτου
6 హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.
οτε δε εμελλεν αυτον προαγειν ο ηρωδησ τη νυκτι εκεινη ην ο πετροσ κοιμωμενοσ μεταξυ δυο στρατιωτων δεδεμενοσ αλυσεσιν δυσιν φυλακεσ τε προ τησ θυρασ ετηρουν την φυλακην
7 ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి.
και ιδου αγγελοσ κυριου επεστη και φωσ ελαμψεν εν τω οικηματι παταξασ δε την πλευραν του πετρου ηγειρεν αυτον λεγων αναστα εν ταχει και εξεπεσον αυτου αι αλυσεισ εκ των χειρων
8 దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు.
ειπεν τε ο αγγελοσ προσ αυτον περιζωσαι και υποδησαι τα σανδαλια σου εποιησεν δε ουτωσ και λεγει αυτω περιβαλου το ιματιον σου και ακολουθει μοι
9 అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు.
και εξελθων ηκολουθει αυτω και ουκ ηδει οτι αληθεσ εστιν το γινομενον δια του αγγελου εδοκει δε οραμα βλεπειν
10 ౧౦ మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
διελθοντεσ δε πρωτην φυλακην και δευτεραν ηλθον επι την πυλην την σιδηραν την φερουσαν εισ την πολιν ητισ αυτοματη ηνοιχθη αυτοισ και εξελθοντεσ προηλθον ρυμην μιαν και ευθεωσ απεστη ο αγγελοσ απ αυτου
11 ౧౧ పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు.
και ο πετροσ γενομενοσ εν εαυτω ειπεν νυν οιδα αληθωσ οτι εξαπεστειλεν κυριοσ τον αγγελον αυτου και εξειλετο με εκ χειροσ ηρωδου και πασησ τησ προσδοκιασ του λαου των ιουδαιων
12 ౧౨ దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు.
συνιδων τε ηλθεν επι την οικιαν μαριασ τησ μητροσ ιωαννου του επικαλουμενου μαρκου ου ησαν ικανοι συνηθροισμενοι και προσευχομενοι
13 ౧౩ అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.
κρουσαντοσ δε του πετρου την θυραν του πυλωνοσ προσηλθεν παιδισκη υπακουσαι ονοματι ροδη
14 ౧౪ ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది.
και επιγνουσα την φωνην του πετρου απο τησ χαρασ ουκ ηνοιξεν τον πυλωνα εισδραμουσα δε απηγγειλεν εσταναι τον πετρον προ του πυλωνοσ
15 ౧౫ అందుకు వారు ఆమెను “నువ్వు పిచ్చిదానివి” అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, “అతని దూత అయి ఉండవచ్చు” అన్నారు.
οι δε προσ αυτην ειπον μαινη η δε διισχυριζετο ουτωσ εχειν οι δε ελεγον ο αγγελοσ αυτου εστιν
16 ౧౬ పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు.
ο δε πετροσ επεμενεν κρουων ανοιξαντεσ δε ειδον αυτον και εξεστησαν
17 ౧౭ అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.
κατασεισασ δε αυτοισ τη χειρι σιγαν διηγησατο αυτοισ πωσ ο κυριοσ αυτον εξηγαγεν εκ τησ φυλακησ ειπεν δε απαγγειλατε ιακωβω και τοισ αδελφοισ ταυτα και εξελθων επορευθη εισ ετερον τοπον
18 ౧౮ తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు.
γενομενησ δε ημερασ ην ταραχοσ ουκ ολιγοσ εν τοισ στρατιωταισ τι αρα ο πετροσ εγενετο
19 ౧౯ హేరోదు అతని కోసం వెతికి కనబడక పోయేసరికి కావలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్ళి అక్కడ నివసించాడు.
ηρωδησ δε επιζητησασ αυτον και μη ευρων ανακρινασ τουσ φυλακασ εκελευσεν απαχθηναι και κατελθων απο τησ ιουδαιασ εισ την καισαρειαν διετριβεν
20 ౨౦ అప్పట్లో తూరు, సీదోను వాసులపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గరకి వెళ్ళారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తును వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది.
ην δε ο ηρωδησ θυμομαχων τυριοισ και σιδωνιοισ ομοθυμαδον δε παρησαν προσ αυτον και πεισαντεσ βλαστον τον επι του κοιτωνοσ του βασιλεωσ ητουντο ειρηνην δια το τρεφεσθαι αυτων την χωραν απο τησ βασιλικησ
21 ౨౧ నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు.
τακτη δε ημερα ο ηρωδησ ενδυσαμενοσ εσθητα βασιλικην και καθισασ επι του βηματοσ εδημηγορει προσ αυτουσ
22 ౨౨ ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు.
ο δε δημοσ επεφωνει φωνη θεου και ουκ ανθρωπου
23 ౨౩ అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.
παραχρημα δε επαταξεν αυτον αγγελοσ κυριου ανθ ων ουκ εδωκεν δοξαν τω θεω και γενομενοσ σκωληκοβρωτοσ εξεψυξεν
24 ౨౪ దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించింది.
ο δε λογοσ του θεου ηυξανεν και επληθυνετο
25 ౨౫ బర్నబా, సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు.
βαρναβασ δε και σαυλοσ υπεστρεψαν εισ ιερουσαλημ πληρωσαντεσ την διακονιαν συμπαραλαβοντεσ και ιωαννην τον επικληθεντα μαρκον

< అపొస్తలుల కార్యములు 12 >