< అపొస్తలుల కార్యములు 11 >
1 ౧ యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.
A èuše i apostoli i braæa koji bijahu u Judeji da i neznabošci primiše rijeè Božiju.
2 ౨ పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,
I kad iziðe Petar u Jerusalim, prepirahu se s njim koji bijahu iz obrezanja,
3 ౩ “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.
Govoreæi: ušao si k ljudima koji nijesu obrezani, i jeo si s njima.
4 ౪ అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ,
A Petar poèevši kazivaše im redom govoreæi:
5 ౫ “నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.
Ja bijah u gradu Jopi na molitvi, i došavši izvan sebe vidjeh utvaru, gdje silazi sud nekakav kao veliko platno na èetiri roglja i spušta se s neba, i doðe do preda me.
6 ౬ దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
Pogledavši u nj opazih i vidjeh èetvoronožna zemaljska, i zvjerinje i bubine i ptice nebeske.
7 ౭ అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.
A èuh glas koji mi govori: ustani, Petre! pokolji i pojedi.
8 ౮ అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను.
A ja rekoh: nipošto, Gospode! jer ništa pogano i neèisto nikad ne uðe u usta moja.
9 ౯ రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది.
A glas mi odgovori drugom s neba govoreæi: što je Bog oèistio ti ne pogani.
10 ౧౦ ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
A ovo bi triput; i uze se opet sve na nebo.
11 ౧౧ వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు.
I gle, odmah tri èovjeka staše pred kuæom u kojoj bijah, poslani iz Æesarije k meni.
12 ౧౨ అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.
A Duh mi reèe da idem s njima ne premišljajuæi ništa. A doðoše sa mnom i ovo šest braæe, i uðosmo u kuæu èovjekovu.
13 ౧౩ అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
I kaza nam kako vidje anðela u kuæi svojoj koji je stao i kazao mu: pošlji ljude u Jopu i dozovi Simona prozvanoga Petra,
14 ౧౪ నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.
Koji æe ti kazati rijeèi kojima æeš se spasti ti i sav dom tvoj.
15 ౧౫ నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు.
A kad ja poèeh govoriti, siðe Duh sveti na njih, kao i na nas u poèetku.
16 ౧౬ అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
Onda se opomenuh rijeèi Gospodnje kako govoraše: Jovan je krstio vodom, a vi æete se krstiti Duhom svetijem.
17 ౧౭ “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు.
Kad im dakle Bog dade jednak dar kao i nama koji vjerujemo Gospoda svojega Isusa Hrista: ja ko bijah da bih mogao zabraniti Bogu?
18 ౧౮ వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.
A kad èuše ovo, umukoše, i hvaljahu Boga govoreæi: dakle i neznabošcima Bog dade pokajanje za život.
19 ౧౯ స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు.
A oni što se rasijaše od nevolje koja posta za Stefana, proðoše tja do Finikije i Kipra i Antiohije, nikomu ne govoreæi rijeèi do samijem Jevrejima.
20 ౨౦ వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు.
A neki od njih bijahu Kiprani i Kirinci, koji ušavši u Antiohiju govorahu Grcima propovijedajuæi jevanðelje o Gospodu Isusu.
21 ౨౧ ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
I bješe ruka Božija s njima; i mnogo ih vjerovaše i obratiše se ka Gospodu.
22 ౨౨ వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.
A doðe rijeè o njima do ušiju crkve koja bješe u Jerusalimu; i poslaše Varnavu da ide tja do Antiohije;
23 ౨౩ అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.
Koji došavši i vidjevši blagodat Božiju, obradova se, i moljaše sve da tvrdijem srcem ostanu u Gospodu;
24 ౨౪ అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.
Jer bješe èovjek blag i pun Duha svetoga i vjere. I obrati se mnogi narod ka Gospodu.
25 ౨౫ బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు.
Varnava pak iziðe u Tars da traži Savla; i kad ga naðe, dovede ga u Antiohiju.
26 ౨౬ వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.
I oni se cijelu godinu sastajaše ondje s crkvom, i uèiše mnogi narod; i najprije u Antiohiji nazvaše uèenike hrišæanima.
27 ౨౭ ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.
A u te dane siðoše iz Jerusalima proroci u Antiohiju.
28 ౨౮ వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.
I ustavši jedan od njih, po imenu Agav, objavi glad veliki koji šæaše biti po vasionom svijetu; koji i bi za Klaudija æesara.
29 ౨౯ అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు.
A od uèenika odredi svaki koliko koji mogaše da pošlju u pomoæ braæi koja življahu u Judeji.
30 ౩౦ వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.
Koje i uèiniše poslavši starješinama preko ruke Varnavine i Savlove.