< అపొస్తలుల కార్యములు 11 >

1 యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.
Linu bapositola niba mwabo ba bena mwa Judeya chibazuwa kuti ba Sikunze chibatambula inzwi lye Ireeza.
2 పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,
Linu Pitrosi hakeza kwa Jerusalema, abo bena muchikwata chamupato chiba munyansa;
3 “నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.
Chibati. “Ubali kopanyi ni bakwame basena mupato ni kulya nabo!”
4 అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ,
Kono Pitrosi chatanga kubatolokela chakwizula; 'chati,
5 “నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.
Nibali kulapela mu muleneñi wa Joppa, imi chinaba ni pono yachintu chikeza hansi, sina isila ikando likeza hansi kuzwa kwiwulu lina tukokolwa tonee. Chichakeza kwangu.
6 దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
China chilolisisa ni kuchizezisisa. Chinabona zinyolozi za matende onne zamu inkanda, zibatana, ziyendisa mabumo, ni zizuni za mwiwulu.
7 అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.
Linu china zuwa inzwi liwamba kwangu, “zimane, Pitrosi; wihaye mi ulye!”
8 అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను.
Chinati, “nee; Nanta kanjobulyo, Simwine: kakwina chintu chisachenete kapa china chive chisenjili mukaholo kangu.”
9 రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది.
Kono izwi chilyetaba kuzwilila kwiwulu, “Chalukulula Ireeza chijolola sanzi ucho kuti chinekwe.”
10 ౧౦ ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
Izi zibatendahali totatwe, imi linu zintu zonse chizabozwa kwiwulu hape.
11 ౧౧ వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు.
Kamulole, hahanu kwina bakwame botatwe bazimene habusu bwe zubo hatwina; ba bakatumitwe kwa Caesarea kwiza kwangu.
12 ౧౨ అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.
Luhuho Lujolola lwanilaela kuti ni yende nabo, imi sanzi niloli kutibenabule. Aba bakwame balikana iyanza niyenke babayendi name, imi tubayendi ni kwinjila muzubo yamukwame.
13 ౧౩ అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
Chatuwambila mwababoneni Iñeloyi ha tuwambila mwaba boneni iñiloi ni lizimene munzubo yakwe ni kucho, “Tumine bakwame kwa Joppa imi mukaboze Simone yo supwa Pitrosi.
14 ౧౪ నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.
Mwa wambe kwenu lizwi lyete limihaze - Iwe ni bezubo yako bonse.
15 ౧౫ నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు.
Hani tanga kuwamba kubali, Luhuho Lunjolola chilwasukila kubali, sina njikwetu lwetanzi.
16 ౧౬ అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
Nibazezi mazwi a Simwine, mwaba wambili, “Joani chabusakusima abakukolobeza chamenzi; kono inwe muswanela kukolobezwa cho Luhuho Lunjolola.”
17 ౧౭ “కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు.
Linu haiba Ireeza ababahi impo ziswana ni zetu hatuzumina kwa Simwine Jesu Kreste, njemeni, kuti ni kangisane ni Ireeza?”
18 ౧౮ వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.
Habamana kuzuwa izi zintu, kakwina chibaba wambi kulitabilila, Kono ba balumbeki Ireeza ni kuchokuti, “Imi Ireeza abahibulyo inswalelo ya buhalo kubalichaba nabo.”
19 ౧౯ స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు.
Linu babo babahasani bakeñi cha masukuluka abezi chebaka lyefu lya Sitefani, libahasani mane kutwala kwa Fonisiya, Sipera, ni Antioke, kono chibakutaza linzwi lya Jesu feela ku Majuda.
20 ౨౦ వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు.
Kono bamwi kubali, bakwame bakwa Sipera, ni Sirene, chibeza kwa Antioke, imi chibawamba bulyo ni ku Magerike, ni ku bawambila mazwi malotu kuamna ni Simwine Jesu.
21 ౨౧ ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
Imi iyanza lya Simwine libena nabo; bungi bwabo bubazumini ni kubola kwa Simwine.
22 ౨౨ వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.
Iñusa kuamana nabo chilyeza mumatwi ye Kereke ya mwa Jerusalema: imi chibatuma Barnabasi kuyenda kule kwa Antioke.
23 ౨౩ అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.
Hakeza ni kwiza kubona impoo ye Ireeza, aba sangi; imi chaba susuweza bonse kwikala ni Simwine chenkulo zabo zonse.
24 ౨౪ అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.
Imi abali mukwame yabena sinte wizwile Luhuho Lunjolola ni tumelo, imi bungi bwabantu baba ekezehi kwiza kwa Simwine.
25 ౨౫ బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు.
Barnabasi linu chayenda kwa Tarese, ku kasaka Saule.
26 ౨౬ వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.
Hamuwana, cha muleta kwa Antioke. Chikweza kubakuti, mwaaka onse chibali kunganya hamwina ne Kereke hamwina ni kuluta bungi bwabantu. Balutwana babakusumpwa Makereste lwetazi mwa Antioke.
27 ౨౭ ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.
Linu mwa anu mazuva bamwi bapolofita chiba sezumukila kwa Jerusalema kwa Antioke.
28 ౨౮ వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.
Umwina kubali, Agabusi, chezina chazima ni kupolofita cha Luhuho kuti inzala inkando mwi ikanda yonse. Izi ziba kutendahala mumazuba a Klaudiya.
29 ౨౯ అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు.
Njokuti, balutwana, sina zumwi ni zumwi habakuwola, chahupula kutumina intuso kubamwakwe mwa Judeya.
30 ౩౦ వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.
Babatendi bulyo, baba tumini mashelenyi kuba kulwana bakeleke chamanza a Barnabasi ni Saule.

< అపొస్తలుల కార్యములు 11 >