< 2 తిమోతికి 4 >
1 ౧ దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.
ⲁ̅ϮⲈⲢⲘⲈⲐⲢⲈ ⲘⲠⲈⲘⲐⲞ ⲘⲪⲚⲞⲨϮ ⲚⲈⲘ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲪⲎ ⲈⲐⲚⲀϮϨⲀⲠ ⲈⲚⲎ ⲈⲦⲞⲚϦ ⲚⲈⲘ ⲚⲎ ⲈⲐⲘⲰⲞⲨⲦ ⲚⲈⲘ ⲠⲈϤⲞⲨⲞⲚϨ ⲈⲂⲞⲖ ⲚⲈⲘ ⲦⲈϤⲘⲈⲦⲞⲨⲢⲞ.
2 ౨ వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.
ⲃ̅ϨⲒⲰⲒϢ ⲘⲠⲒⲤⲀϪⲒ ϢⲰⲠⲒ ϨⲒϪⲰⲞⲨ ⲈⲨⲔⲈⲢⲞⲤ ⲀⲔⲈⲢⲞⲤ ⲤⲞϨⲒ ⲘⲀⲐⲈⲦϨⲎⲦ ⲀⲢⲒⲈⲠⲒⲦⲒⲘⲀⲚ ⲚϦⲢⲎⲒ ϦⲈⲚⲘⲈⲦⲢⲈϤⲰⲞⲨ ⲚϨⲎⲦ ⲚⲒⲂⲈⲚ ⲚⲈⲘ ϮⲤⲂⲰ.
3 ౩ ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని,
ⲅ̅ⲈϤⲈϢⲰⲠⲒ ⲄⲀⲢ ⲚϪⲈⲞⲨⲤⲎⲞⲨ ϨⲞⲦⲈ ⲚⲚⲞⲨϢⲈⲠ ϮⲤⲂⲰ ⲈⲐⲞⲨⲞϪ ⲈⲢⲰⲞⲨ ⲀⲖⲖⲀ ⲔⲀⲦⲀ ⲚⲞⲨⲈⲠⲒⲐⲨⲘⲒⲀ ⲘⲘⲀⲨⲀⲦⲞⲨ ⲈⲨⲤⲰⲔ ⲚⲰⲞⲨ ⲚϨⲀⲚⲢⲈϤϮⲤⲂⲰ ⲈⲨϦⲰϦ ⲚⲚⲞⲨⲘⲀϢϪ.
4 ౪ సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.
ⲇ̅ⲠⲞⲨⲤⲰⲦⲈⲘ ⲘⲈⲚ ⲈⲨⲈⲪⲞⲚϨϤ ⲤⲀⲂⲞⲖ ⲚⲐⲘⲎⲒ ⲈⲨⲈⲢⲀⲔⲞⲨ ⲆⲈ ⲚⲤⲀⲚⲒϢⲂⲰ.
5 ౫ నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.
ⲉ̅ⲚⲐⲞⲔ ⲆⲈ ⲀⲢⲒⲚⲨⲘⲪⲒⲚ ϦⲈⲚϨⲰⲂ ⲚⲒⲂⲈⲚ ϢⲈⲠⲘⲔⲀϨ ⲀⲢⲒϨⲰⲂ ⲚⲞⲨⲢⲈϤϨⲒϢⲈⲚⲚⲞⲨϤⲒ ⲠⲈⲔϢⲈⲘϢⲒ ϪⲞⲔϤ ⲈⲂⲞⲖ.
6 ౬ ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది.
ⲋ̅ⲀⲚⲞⲔ ⲄⲀⲢ ϨⲎⲆⲎ ⲤⲈⲚⲀⲞⲨⲞⲐⲂⲈⲦ ⲈⲂⲞⲖ ⲞⲨⲞϨ ⲠⲤⲎⲞⲨ ⲚⲦⲈⲠⲀⲂⲰⲖ ⲈⲂⲞⲖ ⲀϤϦⲰⲚⲦ.
7 ౭ మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
ⲍ̅ⲠⲒⲀⲄⲰⲚ ⲈⲐⲚⲀⲚⲈϤ ⲀⲒⲈⲢⲀⲄⲰⲚⲒⲌⲈⲤⲐⲈ ⲘⲘⲞϤ ⲠⲒⲆⲢⲞⲘⲞⲤ ⲀⲒϪⲞⲔϤ ⲈⲂⲞⲖ ⲠⲒⲚⲀϨϮ ⲀⲒⲀⲢⲈϨ ⲈⲢⲞϤ
8 ౮ ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.
ⲏ̅ⲖⲞⲒⲠⲞⲚ ϤⲬⲎ ⲚⲎⲒ ⲚϪⲈⲠⲒⲬⲖⲞⲘ ⲚⲦⲈϮⲆⲒⲔⲈⲞⲤⲨⲚⲎ ⲪⲎ ⲈⲦⲈ ⲠϬⲞⲒⲤ ⲚⲀⲦⲎⲒϤ ⲚⲎⲒ ϦⲈⲚⲠⲒⲈϨⲞⲞⲨ ⲈⲦⲈⲘⲘⲀⲨ ⲠⲒⲢⲈϤϮϨⲀⲠ ⲘⲘⲎⲒ ⲞⲨ ⲘⲞⲚⲞⲚ ⲆⲈ ⲚⲎⲒ ⲘⲘⲀⲨⲀⲦ ⲀⲖⲖⲀ ⲚⲈⲘ ⲞⲨⲞⲚ ⲚⲒⲂⲈⲚ ⲈⲦⲀⲨⲘⲈⲚⲢⲈ ⲠⲈϤⲞⲨⲞⲚϨ ⲈⲂⲞⲖ.
9 ౯ నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నించు.
ⲑ̅ⲒⲎⲤⲞⲨⲤ ⲚⲦⲞⲦⲔ ⲈⲒ ϨⲀⲢⲞⲒ ⲚⲬⲰⲖⲈⲘ.
10 ౧౦ దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనిక వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయకీ, తీతు దల్మతియకీ వెళ్ళారు. (aiōn )
ⲓ̅ⲆⲎⲘⲀⲤ ⲄⲀⲢ ⲀϤⲬⲀⲦ ⲚⲤⲰϤ ⲈⲀϤⲘⲈⲚⲢⲈ ⲠⲀⲒⲈⲚⲈϨ ⲚⲦⲈϮⲚⲞⲨ ⲀϤϢⲈ ⲚⲀϤ ⲈⲐⲈⲤⲤⲀⲖⲞⲚⲒⲔⲒⲀ ⲔⲢⲒⲤⲔⲎⲤ ⲈϮⲄⲀⲖⲀⲦⲒⲀ ⲦⲒⲦⲞⲤ ⲈⲆⲀⲖⲘⲀⲦⲒⲀ. (aiōn )
11 ౧౧ లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును తీసుకురా. అతడు పరిచారం కోసం నాకు ఉపయోగంగా ఉంటాడు.
ⲓ̅ⲁ̅ⲖⲞⲨⲔⲀⲤ ⲘⲘⲀⲨⲀⲦϤ ⲈⲐⲚⲈⲘⲎⲒ ⲘⲀⲢⲔⲞⲤ ⲘⲀⲖⲞϤ ⲀⲚⲒⲦϤ ⲚⲈⲘⲀⲔ ϤⲈⲢϢⲀⲨ ⲄⲀⲢ ⲚⲎⲒ ⲈⲨⲆⲒⲀⲔⲞⲚⲒⲀ.
12 ౧౨ తుకికును ఎఫెసుకు పంపాను.
ⲓ̅ⲃ̅ⲦⲨⲬⲒⲔⲞⲤ ⲆⲈ ⲀⲒⲞⲨⲞⲢⲠϤ ⲚⲦⲈⲈⲪⲈⲤⲞⲤ.
13 ౧౩ నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచి వచ్చిన అంగీనీ, పుస్తకాలనూ, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకు రా.
ⲓ̅ⲅ̅ϮⲪⲨⲖⲞⲚⲎ ⲈⲦⲀⲒⲤⲞϪⲠⲤ ϦⲈⲚⲦⲢⲰⲀⲤ ϦⲀⲦⲈⲚ ⲔⲀⲢⲠⲰ ⲀⲚⲒⲦⲤ ⲈⲔⲚⲎⲞⲨ ⲚⲈⲘ ⲚⲒⲔⲈϪⲰⲘ ⲘⲀⲖⲒⲤⲦⲀ ⲚⲒⲘⲈⲚⲂⲢⲀⲚⲀ.
14 ౧౪ అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు.
ⲓ̅ⲇ̅ⲀⲖⲈⲜⲀⲚⲆⲢⲞⲤ ⲠⲒⲂⲈⲤⲚⲎⲦ ⲀϤⲈⲢⲞⲨⲘⲎϢ ⲘⲠⲈⲦϨⲰⲞⲨ ⲚⲎⲒ ⲈⲢⲈ ⲠϬⲞⲒⲤ ϮϢⲈⲂⲒⲰ ⲚⲀϤ ⲔⲀⲦⲀ ⲚⲈϤϨⲂⲎⲞⲨⲒ.
15 ౧౫ అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు.
ⲓ̅ⲉ̅ⲪⲀⲒ ⲈⲦⲈ ⲚⲐⲞⲔ ϨⲰⲔ ⲀⲢⲈϨ ⲈⲢⲞⲔ ⲤⲀⲂⲞⲖ ⲘⲘⲞϤ ⲀϤϮ ⲄⲀⲢ ⲈϦⲞⲨⲚ ⲈϨⲢⲈⲚ ⲚⲀⲤⲀϪⲒ ⲈⲘⲀϢⲰ
16 ౧౬ నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.
ⲓ̅ⲋ̅ϦⲈⲚ ⲦⲀϨⲞⲨⲒϮ ⲚⲀⲠⲞⲖⲞⲄⲒⲀ ⲘⲠⲈϤⲬⲀ ϨⲖⲒ ⲈⲒ ϨⲀⲢⲞⲒ ⲀⲖⲖⲀ ⲀⲨⲬⲀⲦ ⲚⲤⲰⲞⲨ ⲦⲎⲢⲞⲨ ⲚⲚⲞⲨⲰⲠ ⲚⲈⲘⲰⲞⲨ.
17 ౧౭ అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
ⲓ̅ⲍ̅ⲠϬⲞⲒⲤ ⲆⲈ ⲀϤⲞϨⲒ ⲈⲢⲀⲦϤ ⲚⲈⲘⲎⲒ ⲀϤϮϪⲞⲘ ⲚⲎⲒ ϨⲒⲚⲀ ⲈⲂⲞⲖ ϨⲒⲦⲞⲦ ⲚⲦⲈⲠⲒϨⲒⲰⲒϢ ϪⲰⲔ ⲈⲂⲞⲖ ⲞⲨⲞϨ ⲚⲦⲞⲨⲤⲰⲦⲈⲘ ⲚϪⲈⲚⲒⲈⲐⲚⲞⲤ ⲦⲎⲢⲞⲨ ϪⲈ ⲀⲒⲚⲞϨⲈⲘ ⲈⲂⲞⲖ ϦⲈⲚⲢⲰϤ ⲚⲞⲨⲘⲞⲨⲒ.
18 ౧౮ ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్. (aiōn )
ⲓ̅ⲏ̅ⲈϤⲈⲦⲞⲨϪⲞⲒ ⲚϪⲈⲠϬⲞⲒⲤ ⲈⲂⲞⲖ ϨⲀ ϨⲰⲂ ⲚⲒⲂⲈⲚ ⲈⲦϨⲰⲞⲨ ⲞⲨⲞϨ ⲈϤⲈⲚⲀϨⲘⲈⲦ ⲈϦⲞⲨⲚ ⲈⲦⲈϤⲘⲈⲦⲞⲨⲢⲞ ⲚⲦⲈⲦⲪⲈ ⲪⲀⲒ ⲈⲦⲈ ⲪⲰϤ ⲠⲈ ⲠⲒⲰⲞⲨ ϢⲀ ⲈⲚⲈϨ ⲚⲦⲈⲚⲒⲈⲚⲈϨ ⲀⲘⲎⲚ. (aiōn )
19 ౧౯ ప్రిస్కకూ అకులకూ ఒనేసిఫోరు కుటుంబానికీ నా అభివందనాలు.
ⲓ̅ⲑ̅ϢⲒⲚⲒ ⲈⲠⲢⲒⲤⲔⲨⲖⲖⲀ ⲚⲈⲘ ⲀⲔⲨⲖⲖⲀ ⲚⲈⲘ ⲠⲎⲒ ⲚⲞⲚⲎⲤⲒⲪⲞⲢⲞⲤ.
20 ౨౦ ఎరస్తు కొరింథులో ఆగిపోయాడు. త్రోఫిముకు జబ్బు చేసింది. అందుకే అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
ⲕ̅ⲈⲢⲀⲤⲦⲞⲤ ⲀϤⲞϨⲒ ϦⲈⲚⲔⲞⲢⲒⲚⲐⲞⲤ ⲦⲢⲞⲪⲎ ⲘⲞⲤ ⲆⲈ ⲀⲒⲤⲞϪⲠϤ ϦⲈⲚⲘⲈⲖⲒⲦⲞⲤ ⲈϤϢⲰⲚⲒ.
21 ౨౧ నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చెయ్యి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, ఇతర సోదరులంతా నీకు వందనాలు చెబుతున్నారు.
ⲕ̅ⲁ̅ⲒⲎⲤⲞⲨⲤ ⲘⲘⲞⲔ ⲈⲒ ϦⲀϪⲈⲚ ϮⲪⲢⲰ ϤϢⲒⲚⲒ ⲈⲢⲞⲔ ⲚϪⲈⲈⲨⲂⲞⲨⲖⲞⲤ ⲚⲈⲘ ⲠⲞⲨⲆⲎⲤ ⲚⲈⲘ ⲚⲒⲖⲞⲤ ⲚⲈⲘ ⲔⲖⲀⲨⲆⲒⲞⲤ ⲚⲈⲘ ⲚⲒⲤⲚⲎⲞⲨ ⲦⲎⲢⲞⲨ.
22 ౨౨ ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండు గాక. కృప మీకు తోడై ఉండు గాక.
ⲕ̅ⲃ̅ⲠϬⲞⲒⲤ ⲒⲎⲤⲞⲨⲤ ⲠⲬⲢⲒⲤⲦⲞⲤ ⲚⲈⲘ ⲠⲈⲔⲠⲚⲈⲨⲘⲀⲚϨⲘⲞⲦ ⲚⲈⲘⲰⲦⲈⲚ