< 2 తిమోతికి 3 >

1 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి.
Mas saiba isto: que nos últimos dias virão tempos dolorosos.
2 మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,
Para os homens serão amantes de si mesmos, amantes do dinheiro, orgulhosos, arrogantes, blasfemos, desobedientes aos pais, ingratos, profanos,
3 బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు.
sem afeição natural, imperdoáveis, caluniadores, sem autocontrole, ferozes, não amantes do bem,
4 వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు.
traitors, obstinados, convencidos, amantes do prazer ao invés de amantes de Deus,
5 వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
segurando uma forma de piedade, mas tendo negado seu poder. Afaste-se destes também.
6 ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు.
Para alguns deles são pessoas que se infiltram em casas e levam cativas mulheres crédulas carregadas de pecados, levadas por várias luxúrias,
7 వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.
sempre aprendendo e nunca podendo chegar ao conhecimento da verdade.
8 యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.
Mesmo quando Jannes e Jambres se opuseram a Moisés, estes também se opõem à verdade, os homens corrompidos na mente, que no que diz respeito à fé são rejeitados.
9 అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.
Mas eles não prosseguirão mais. Pois sua loucura será evidente para todos os homens, como a deles também veio a ser.
10 ౧౦ నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు.
Mas vocês seguiram meus ensinamentos, conduta, propósito, fé, paciência, amor, perseverança,
11 ౧౧ అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
perseguições e sofrimentos - as coisas que me aconteceram em Antioquia, Iconium e Lystra. Eu suportei essas perseguições. O Senhor me libertou de todas elas.
12 ౧౨ క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు.
Sim, e todos os que desejam viver piedosamente em Cristo Jesus sofrerão perseguições.
13 ౧౩ అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.
Mas os homens maus e os impostores vão ficar cada vez piores, enganando e sendo enganados.
14 ౧౪ కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో.
Mas vocês permanecem nas coisas que aprenderam e de quem aprenderam, sabendo com quem as aprenderam.
15 ౧౫ ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.
Desde a infância, você conhece as Sagradas Escrituras que são capazes de torná-lo sábio para a salvação através da fé que está em Cristo Jesus.
16 ౧౬ దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
Toda Escritura é inspirada por Deus e proveitosa para o ensino, para a repreensão, para a correção e para a instrução em justiça,
17 ౧౭
para que cada pessoa que pertence a Deus possa ser completa, completamente equipada para cada boa obra.

< 2 తిమోతికి 3 >