< 2 తిమోతికి 3 >
1 ౧ చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి.
Be sure of this, that in the last days difficult times will come.
2 ౨ మనుషులు స్వార్థపరులుగా, ధనాశపరులుగా, గొప్పలు చెప్పుకొనేవారుగా ఉంటారు. వారు గర్విష్టులు, దైవ దూషణ చేసేవారు, కన్నవారికి అవిధేయులు, చేసిన మేలు మరిచేవారు, అపవిత్రులు,
People will be selfish, mercenary, boastful, haughty, and blasphemous; disobedient to their parents, ungrateful, impure,
3 ౩ బొత్తిగా సహజ ప్రేమ లేనివారు, ఇతరులతో సామరస్యంగా ఉండలేనివారు, దుర్భాషలాడేవారు, నిగ్రహం లేనివారు, క్రూరులు, మంచిని ద్వేషించేవారు.
incapable of affection, merciless, slanderous, wanting in self-control, brutal, careless of the right,
4 ౪ వారు ద్రోహులు, తలబిరుసు మనుషులు, గర్వాంధులు, దేవునికంటే శరీర సౌఖ్యాన్నే ఎక్కువగా ప్రేమించేవారు.
treacherous, reckless, and puffed up with pride; they will love pleasure more than they love God;
5 ౫ వారు పైకి భక్తి గలవారిలా ఉంటారు గానీ దాని శక్తిపై ఆధారపడరు. వారికి దూరంగా ఉండు.
and while they retain the outward form of religion, they will not allow it to influence them. Turn your back on such people as these.
6 ౬ ఇలాంటి వారు బలహీన మనస్తత్వం గల స్త్రీల ఇళ్ళలోకి చొరబడి వారిని వశం చేసుకుంటారు. ఈ స్త్రీలు అపరాధ భావనలతో కుంగిపోయి రకరకాల వాంఛలతో కొట్టుకు పోయేవారుగా ఉంటారు.
For among them are to be found those who creep into homes and captivate weak women – women who, loaded with sins, and slaves to all kinds of passions,
7 ౭ వాక్యాన్ని అస్తమానం నేర్చుకుంటూనే ఉన్నా వీరు సత్యం విషయమైన జ్ఞానాన్ని పొందలేరు.
are always learning, and yet never able to attain to a real knowledge of the truth.
8 ౮ యన్నే, యంబ్రే అనేవారు మోషేను ఎదిరించినట్టు వీరు కూడా చెడిపోయిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరిస్తారు.
Just as Jannes and Jambres opposed Moses, so do these people, in their turn, oppose the truth. Their minds are corrupted, and, as regards the faith, they are utterly worthless.
9 ౯ అయితే వారిద్దరి అవివేకం ఏ విధంగా బయటపడిందో ఆలాగే వీరిది కూడా అందరికీ వెల్లడి అవుతుంది కాబట్టి వీరు ఇంకా ముందుకి సాగలేరు.
They will not, however, make further progress; for their wicked folly will be plain to everyone, just as the folly Jannes and Jambres was.
10 ౧౦ నీవు మాత్రం నా బోధనూ, ప్రవర్తననూ, ఉద్దేశాన్నీ, విశ్వాసాన్నీ, సహనాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ అనుకరించావు.
But you, Timothy, were a close observer of my teaching, my conduct, my purposes, my faith, my forbearance, my love, and my patient endurance,
11 ౧౧ అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అనే పట్టణాల్లో నేను అనుభవించిన హింసలనూ ప్రమాదాలనూ ఎరిగే నన్ను వెంబడించావు. అలాంటి హింసలు నేను సహించాను గాని, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
as well as of my persecutions, and of the sufferings which I met with at Antioch, Iconium, and Lystra. You know what persecutions I underwent; and yet the Lord brought me safe out of all!
12 ౧౨ క్రీస్తు యేసులో సద్భక్తితో జీవించాలని కోరేవారంతా హింస పొందుతారు.
Yes, and all who aim at living a religious life in union with Christ Jesus will have to suffer persecution;
13 ౧౩ అయితే చెడ్డ వారూ, వంచకులూ ఇతరులను మోసపరుస్తూ తాము కూడా మోసపోతూ అంతకంతకూ చెడిపోతారు.
but wicked people and impostors will go from bad to worse, deceiving others and deceived themselves.
14 ౧౪ కానీ నీవు మాత్రం కచ్చితంగా తెలుసుకున్న వాటిని ఎవరి ద్వారా నేర్చుకున్నావో గ్రహించి వాటిలో నిలకడగా సాగిపో.
You, however, must stand by what you learnt and accepted as true. You know who they were from whom you learnt it;
15 ౧౫ ఎందుకంటే క్రీస్తు యేసులో విశ్వాసం ద్వారా పాప విముక్తినిచ్చే జ్ఞానాన్ని నీకు కలిగించే శక్తిగల పరిశుద్ధ లేఖనాలు బాల్యం నుండీ నీకు తెలుసు.
and that, from your childhood, you have known the sacred writings, which can give you the wisdom that, through belief in Christ Jesus, leads to salvation.
16 ౧౬ దేవుని సేవకుడు సిద్ధపడి ప్రతి మంచి పనినీ జరిగించడానికి పూర్తి సన్నాహంతో ఉండాలి. అందుకోసమే ప్రతి లేఖనం దైవావేశం వలన ఉనికిలోకి వచ్చింది. అది బోధించడానికీ, ఖండించడానికీ, తప్పు దిద్దడానికీ, నీతిలో శిక్షణ ఇవ్వడానికీ తోడ్పడుతుంది.
All scripture is God-breathed: helpful for teaching, for refuting error, for giving guidance, and for training others in righteousness;
so that God’s people may be capable and equipped for good work of every kind.