< 2 తిమోతికి 1 >

1 క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.
Од Павла, апостола Исуса Христа по вољи Божијој за обећање живота у Исусу Христу,
2 తండ్రియైన దేవుని నుండీ మన ప్రభువు క్రీస్తు యేసు నుండీ కృప, కనికరం, సమాధానం నీకు కలుగు గాక.
Тимотију, љубазном сину, благодат, милост, мир од Бога Оца и Христа Исуса, Господа нашег.
3 నా ప్రార్థనల్లో నిన్ను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ నా పూర్వీకులవలే కల్మషంలేని మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
Захваљујем Богу коме служим од прародитеља чистом савести, што без престанка имам спомен за тебе у молитвама својим дан и ноћ,
4 నీ కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుని, నిన్ను చూసి నా ఆనందాన్ని పరిపూర్ణం చేసుకోవాలని ఎదురుచూస్తున్నాను.
Желећи да те видим, опомињући се суза твојих, да се радости испуним;
5 నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోనూ, మీ అమ్మ యునీకేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం.
Опомињући се нелицемерне у теби вере која се усели најпре у бабу твоју Лоиду и у матер твоју Евникију; а уверен сам да је и у теби;
6 ఆ కారణంగానే నేను నీమీద నా చేతులు ఉంచడం ద్వారా నీకు కలిగిన దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపజేసుకోమని నిన్ను ప్రోత్సహిస్తున్నాను.
Заради ког узрока напомињем ти да подгреваш дар Божји који је у теби како сам метнуо руке своје на тебе.
7 దేవుడు మనకు శక్తీ, ప్రేమా, నిగ్రహం కలిగించే ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనం కలిగించే ఆత్మను ఇవ్వలేదు.
Јер нам Бог не даде духа страха, него силе и љубави и чистоте.
8 కాబట్టి నువ్వు మన ప్రభువు విషయమైన సాక్ష్యం గురించి గానీ, ఆయన ఖైదీనైన నన్ను గురించి గానీ సిగ్గుపడకుండా, దేవుని శక్తితో సువార్త మూలంగా వాటిల్లే కష్టాల్లో భాగం పంచుకో.
Не постиди се, дакле, сведочанства Господа нашег Исуса Христа, ни мене сужња Његовог; него пострадај с јеванђељем Христовим по сили Бога,
9 ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు. (aiōnios g166)
Који нас спасе и призва звањем светим, не по делима нашим, него по својој наредби и благодати, која нам је дана у Христу Исусу пре времена вечних; (aiōnios g166)
10 ౧౦ ఆ కృప ఇప్పుడు క్రీస్తు యేసు అనే మన రక్షకుడు ప్రత్యక్షం కావడం ద్వారా వెల్లడి అయింది. ఆయన మరణాన్ని నాశనం చేసి జీవాన్నీ అమర్త్యతనూ సువార్త ద్వారా వెలుగులోకి తెచ్చాడు.
А сад се показа у доласку Спаситеља нашег Исуса Христа, који раскопа смрт, и обасја живот и нераспадљивост јеванђељем;
11 ౧౧ ఆ సువార్త విషయంలో నేను ప్రచారకుడుగా, అపొస్తలుడుగా, బోధకుడుగా నియామకం పొందాను.
За које сам ја постављен апостол и учитељ незнабожаца.
12 ౧౨ ఆ కారణం చేత నేనీ కష్టాలు అనుభవిస్తున్నాను. నేను నమ్మినవాడు నాకు తెలుసు కాబట్టి సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించినదాన్ని రాబోతున్న ఆ రోజు వరకూ ఆయన కాపాడగలడని నాకు పూర్తి నమ్మకం ఉంది.
Заради ког узрока и ово страдам; али се не стидим, јер знам коме веровах, и уверен сам да је кадар аманет мој сачувати за дан онај.
13 ౧౩ క్రీస్తు యేసులో ఉంచవలసిన విశ్వాసంతో, ప్రేమతో నేను నీకు నేర్పిన క్షేమకరమైన బోధ నమూనాను పాటించు.
Имај у памети образ здравих речи које си чуо од мене, у вери и љубави Христа Исуса.
14 ౧౪ దేవుడు నీకు అప్పగించిన ఆ మంచిదాన్ని మనలో నివాసమున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుకో.
Добри аманет сачувај Духом Светим који живи у нама.
15 ౧౫ ఆసియలోని వారంతా నన్ను విడిచిపోయారని నీకు తెలుసు. ఫుగెల్లు, హెర్మొగెనే అలాటివారే.
Знаш ово да се одвратише од мене сви у Азији, међу којима и Фигел и Ермоген.
16 ౧౬ ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
А Господ да да милост Онисифоровом дому; јер ме много пута утеши, и окова мојих не постиде се;
17 ౧౭ అతడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు.
Него дошавши у Рим потражи ме још с већим старањем и нађе.
18 ౧౮ పైగా అతడు ఎఫెసులో నాకు ఎంత ఉపచారం చేశాడో నీకు బాగా తెలుసు. ఆ దినాన అతడు ప్రభువు వలన కనికరం పొందేలా ప్రభువు అనుగ్రహించు గాక.
Да да њему Господ да нађе милост у Господа у дан онај. И у Ефесу колико ми послужи, ти знаш добро.

< 2 తిమోతికి 1 >