< 2 థెస్సలొనీకయులకు 3 >
1 ౧ ఇక ఇతర విషయాలకు వస్తే సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా,
На останок, молітесь, братте, за нас, щоб слово Господнє ширилось та славилось, яко ж і в вас,
2 ౨ మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
і щоб нам визволитись од безпутних і лукавих людей; бо не у всїх віра.
3 ౩ అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
Вірен же Господь, котрий утвердить вас і обереже від лукавого.
4 ౪ మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.
Уповаємо ж у Господі про вас, що що ми вам повеліваємо, ви робите і робити мете.
5 ౫ దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!
Господь же нехай направить серця ваші у любов Божу і в терпіннє Христове.
6 ౬ సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.
Повеліваємо ж вам, братте, імям Господа нашого Ісуса Христа, відлучатись від усякого брата, що ходить непорядно і не по переказу, який прийняв од нас.
7 ౭ మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.
Самі бо знаєте, як вам треба подобити ся нам; бо не робили ми безладдя між вами,
8 ౮ ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
анї їли дармо хлїб у кого; а в труді і журбі, ніч і день роблячи дїло, щоб не отягчити нікого з вас:
9 ౯ మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు.
не тим що не маємо власти, а щоб себе за взір дати вам, щоб уподобати ся нам.
10 ౧౦ అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా!
Бо, як були ми у вас, то так завітували вам, що хто не хоче робити діла, нехай і не їсть.
11 ౧౧ మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం.
Чуємо бо, що деякі непорядно ходять між вами, нічого не роблять, а метушять ся.
12 ౧౨ అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
Таким-то повеліваємо і напоминаємо Господом нашим Ісусом Христом, щоб мовчки роблячи, свій хлїб їли.
13 ౧౩ సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు.
Ви ж, братте, не втомлюйтесь, роблячи добре.
14 ౧౪ ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాణ్ణి కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో కలిసి ఉండవద్దు.
Коли ж хто не послухає слова нашого посланнєм, такого назначіть і не мішайтесь із ним, щоб йому був сором.
15 ౧౫ అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి.
Та не за ворога вважайте його, а навчайте, яко брата.
16 ౧౬ శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!
Сам же Господь миру нехай дасть вам мир завсїди всіма способами. Господь із усіма вами.
17 ౧౭ నేను పౌలును, నా చేతి రాతతో మీకు అభివందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి పత్రికలోనూ ఇలాగే రాస్తాను.
Витаннє моєю рукою Павловою, котре єсть знав у всякому посланню; так пишу:
18 ౧౮ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండు గాక!
Благодать Господа нашого Ісуса Христа з усіма вами. Амінь.