< 2 థెస్సలొనీకయులకు 3 >

1 ఇక ఇతర విషయాలకు వస్తే సోదరులారా, మీ మధ్య జరుగుతూ ఉన్నట్టే ప్రభువు వాక్కు వేగంగా వ్యాపించి ఘనత పొందేలా,
Zizan merveye brar Rji ni ta'u dun intra ti bu di suma da kpa dindima, na da ha ni yin.
2 మేము దుష్టుల, దుర్మార్గుల బారి నుండి తప్పించుకునేలా మా కోసం ప్రార్థించండి. ఎందుకంటే విశ్వాసం అందరికీ లేదు.
izi bra ni kini gbudgbu ni wo inji bi ti mene sur ni keta. ana ko uhan ane ti dindimana.
3 అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టుడి నుండి కాపాడతాడు.
Kiton Rji niti dindi, wawuyin ni zota da kata di bin memesur.
4 మేము మీకు ఆదేశించిన వాటిని మీరు చేస్తున్నారనీ ఇక ముందు కూడా చేస్తారనీ మీ విషయమై ప్రభువులో నమ్మకం మాకుంది.
Ki ha gregreme ne kitin ni tun bi don bi tin, krin ni tin brun kpe kitsro yi.
5 దేవుని ప్రేమా క్రీస్తు సహనమూ మీకు కలిగేలా ప్రభువు మీ హృదయాలను నడిపిస్తాడు గాక!
Titi ni zo yin nime surbi ye ne sun Rji ni losur ni Almasihu.
6 సాటి విశ్వాసులారా, మేము ఉపదేశించిన సత్యాల ప్రకారం చేయకుండా సోమరులుగా బ్రతుకుతున్న వారి నుండి తొలగి పోవాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర మీకు ఆదేశిస్తున్నాం.
Zizan kin noyi titatre, mereveye ni mi den titibu Yesu Almasihu, kiklu kpe mereveye bin ba son lahga ba tikpe kuma ni tun iri beblatra bikpa ni won bun.
7 మా ఆదర్శాన్ని అనుసరించి ఎలా నడుచుకోవాలో మీకు తెలుసు. మేము మీ మధ్య సోమరులుగా ప్రవర్తించలేదు.
Dun bi yin nitunbi bina to na a bin donyi koyi ni ta. kina son ni bi bana ha nimye bina kama bimba ucrumba.
8 ఎవరి దగ్గరా ఉచితంగా ఆహారం భుజించలేదు. మేము మీలో ఎవరికీ భారంగా ఉండరాదని రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాం, కష్టపడి పని చేశాం.
Kina rin birin ni dwona tun kine han dinba. aha nayi ki tin dun bu incu ni injin tun me yah ni kuci kina lo kpin uruma niko twan.
9 మీరు మమ్మల్ని అనుకరించడం కోసం, ఆదర్శంగా ఉండాలనే ఇలా చేశాం కానీ మాకు మీ దగ్గర హక్కు లేదని కాదు.
Kin tin nayin adin kin ha gbegle na ba. In a tonki a ha, kin tin wayin kina brin grum don bani to ni kpan bu, don kina tsroyi.
10 ౧౦ అలాగే మేము మీ దగ్గర ఉన్నప్పుడు, “పని చేయకుండా ఎవడూ భోజనం చేయకూడదు” అని ఆజ్ఞాపించాం కదా!
In ton ki ha neyin, ki neyi inmre, uwu wona tinduna, na no lah na”
11 ౧౧ మీలో కొంతమంది ఏ పనీ చేయకుండా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ సోమరుల్లా తిరుగుతున్నారని మేము వింటున్నాం.
Kin wo di bari ba kaba ni tindum. Ba tindun sai shiga shirgn barin.
12 ౧౨ అలాంటి వారు ప్రశాంతంగా పని చేసుకుంటూ సొంతంగా సంపాదించుకున్న ఆహారాన్ని భుజించాలని మన ప్రభు యేసు క్రీస్తు పేర వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరిస్తున్నాం.
Irin bi ban ki noba umurni ni noba latra nemetiti Yesu Almasihu duban tin dun. da funtun ba den rin birin tun ba.
13 ౧౩ సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు.
To merevaye na brin tin wa a dindinna.
14 ౧౪ ఈ పత్రికలో మేము చెప్పిన ఆదేశాలకు ఎవరైనా లోబడకపోతే వాణ్ణి కనిపెట్టి ఉండండి. అతనికి సిగ్గు కలిగేలా అతనితో కలిసి ఉండవద్దు.
idi wa aka wotra di lan ni me fufuh, ki mleyah di'u ki na ko zontun ni una kotepen dun ni isha tin.
15 ౧౫ అయితే అతణ్ణి శత్రువుగా భావించకండి. సోదరుడిగా భావించి బుద్ధి చెప్పండి.
Ki na bari akpan'u latremuna, kin no tre a kpan u mre vayin.
16 ౧౬ శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక!
Ki no isin di kusun dinye isin un chachu ni ko oghon re me. Don Titin ni kusun niyin duka.
17 ౧౭ నేను పౌలును, నా చేతి రాతతో మీకు అభివందనం రాస్తున్నాను. నేను రాసే ప్రతి పత్రికలోనూ ఇలాగే రాస్తాను.
Iwayi a cinmu, ime Bulus, di wonmu, in wayi a gban ni kowuni funfun mu me gha nakin.
18 ౧౮ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకందరికీ తోడై ఉండు గాక!
Ni si sur Titibu Yesu Almasihu di ku sun ni me phenme Amin.

< 2 థెస్సలొనీకయులకు 3 >