< 2 థెస్సలొనీకయులకు 2 >
1 ౧ సోదరులారా, ఇకపోతే ప్రసాదించే కృప మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడడం గురించీ ఒక విన్నపం.
Bet dēļ mūsu Kunga Jēzus Kristus atnākšanas un dēļ mūsu sapulcināšanas pie Viņa mēs, brāļi, jūs lūdzam,
2 ౨ క్రీస్తు రాక జరిగిపోయిందని ఎవరైనా తనకు ఆత్మ వెల్లడించాడని గానీ, ఒక మనిషి మాట చేత గానీ, లేదా మేము రాసినట్టుగా ఏదైనా ఉత్తరం చేత గానీ మీకు తెలిస్తే తొందరపడి యేసు ప్రభువు వచ్చేశాడని నమ్మి మీ మనసుల్లో కలవరపడవద్దని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
Ka jūs netopat drīz prātā šaubīti nedz iztrūcināti, ne caur garu, ne caur vārdu, ne caur grāmatu, tā kā no mums būtu rakstīts, ka Tā Kunga diena esot klāt.
3 ౩ ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు.
Lai neviens jūs nekādā vīzē nepieviļ; jo tā nenāks, pirms tā atkāpšanās nebūs nākusi un tas grēka cilvēks, tas pazušanas dēls, nebūs parādījies,
4 ౪ వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.
Kas turas pretī un paaugstinājās pār visu to, kas Dievs saucams, un kas ir Dieva kalpošana, tā ka viņš Dieva namā sēž kā Dievs, izrādīdamies, ka viņš esot Dievs.
5 ౫ మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా?
Vai jūs vairs nepieminiet, ka es vēl pie jums būdams to jums esmu sacījis?
6 ౬ వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు.
Un nu jūs zināt, kas aizkavē, tiekams viņš parādās savā laikā.
7 ౭ అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు.
Jo tas netaisnības noslēpums jau ir spēkā, tikai ka tam, kas viņu līdz šim aizkavē, vēl būs tapt atņemtam nost.
8 ౮ అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు.
Un tad parādīsies tas netaisnais, ko Tas Kungs nomaitās ar savas mutes garu un izdeldēs, kad atspīdēs viņa atnākšana.
9 ౯ సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.
Šā (tā netaisnā) atnākšana notiek pēc sātana spēka ar visādu viltības varu un viltības zīmēm un brīnumiem
10 ౧౦ ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు.
Un ar visādu pievilšanu uz netaisnību pie tiem, kas pazūd; tādēļ ka tie patiesības mīlestību nav pieņēmuši, ka taptu svēti.
11 ౧౧ ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి
Un tādēļ Dievs tiem sūtīs spēcīgu maldīšanās garu, ka tie tic meliem;
12 ౧౨ అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.
Lai top sodīti visi, kas patiesībai nav ticējuši, bet kam bijusi patikšana pie netaisnības.
13 ౧౩ అయితే ప్రభువు ప్రేమించిన సోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మడం ద్వారా, పరిశుద్ధాత్మ చేసే శుద్ధీకరణ ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని తొలిపంటగా ఎంచుకున్నాడు.
Bet mums pienākas vienmēr Dievam pateikties par jums, no Tā Kunga mīļotie brāļi, ka Dievs no iesākuma jūs izredzējis uz pestīšanu, lai caur to Garu tiekat svēti un ticat patiesībai.
14 ౧౪ మేము ప్రకటించిన సువార్త ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా మిమ్మల్ని పిలిచాడు.
Uz to Viņš jūs ir aicinājis caur mūsu evaņģēliju, lai panākat mūsu Kunga Jēzus Kristus godību.
15 ౧౫ కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. మా నోటి మాట చేతా, మా పత్రికల చేతా మేము ఉపదేశించిన విధివిధానాలను పాటించండి.
Tad nu, brāļi, pastāviet un turiet tās mācības, ko esat mācījušies tā caur mūsu vārdu, kā caur mūsu grāmatu.
16 ౧౬ ఇప్పుడు మనలను ప్రేమించి శాశ్వత ఆదరణ, కృప ద్వారా భవిష్యత్తు విషయంలో మంచి ఆశాభావం అనుగ్రహించిన (aiōnios )
Bet pats mūsu Kungs Jēzus Kristus un mūsu Dievs un Tēvs, kas mūs ir mīlējis un devis mūžīgu iepriecināšanu un labu cerību iekš žēlastības, (aiōnios )
17 ౧౭ మన ప్రభు యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహ పరచు గాక. మంచి పనులు చేయడానికి, మంచి మాటలు పలకడానికి మిమ్మల్ని సిద్ధ పరచు గాక.
Tas lai jūsu sirdis iepriecina un lai jūs stiprina iekš visāda laba vārda un darba.