< సమూయేలు~ రెండవ~ గ్రంథము 1 >

1 దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు.
Volt Sául halála után – Dávid pedig visszatért Amálék megverése után és maradt Dávid Cziklágban két napig.
2 మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు.
volt a harmadik napon íme egy ember jön a táborból Sául mellől; ruhái megszaggatva és föld a fején; és volt, mikor bement Dávidhoz, földre vetette magát és leborult.
3 అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను” అన్నాడు.
És mondta neki Dávid: Honnan jössz? Szólt hozzá: Izrael táborából menekültem.
4 “జరిగిన సంగతులు నాతో చెప్పు” అని దావీదు అడిగాడు. అందుకు అతడు “సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు” అన్నాడు.
Erre szólt hozzá Dávid: Hogy történt a dolog, mondd csak meg nekem. Mondta: Hogy megfutamodott a nép a harcból, sokan el is estek a nép közül és meghaltak, Sául és fia Jónátán is meghaltak.
5 “సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు” అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు,
És szólt Dávid az ifjúhoz, aki hírt mondott neki: hogyan tudod, hogy meghalt Sául meg fia Jónátán?
6 “నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు.
Szólt az ifjú, aki hírt mondott neki: Véletlenül ott voltam a Gilbóa hegyén és íme Sául, amint támaszkodik dárdájára s íme, a szekérhad és a lovasok, utolérték.
7 రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘చిత్తం నా రాజా’ అన్నాను.
Hátrafordult és meglátott; akkor szólított engem, és mondtam: itt vagyok.
8 అతడు ‘నువ్వు ఎవరివి?’ అని నన్ను అడిగాడు. ‘నేను అమాలేకీయుణ్ణి’ అని చెప్పాను.
Ekkor mondta nekem: ki vagy? Szóltam hozzá: amáléki vagyok.
9 అతడు ‘నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి’ అని ఆజ్ఞాపించాడు.
És szólt hozzám: Állj csak mellém és ölj meg, mert megragadott a görcs, mert egészen bennem van még a lelkem.
10 ౧౦ అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను” అన్నాడు.
Melléje álltam és megöltem, mert tudtam, hogy nem marad életben elesése után. Akkor vettem a fején levő koronát és a karján levő karkötőt és idehoztam uramhoz.
11 ౧౧ దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి,
Ekkor megragadta, Dávid a ruháit és megszaggatta azokat, meg mind az emberek is, kik nála voltak.
12 ౧౨ సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.
Gyászt tartottak, sírtak és böjtöltek estig Sául miatt, fia Jonátán miatt, az Örökkévaló népe miatt és Izrael háza miatt, hogy elestek a kard által.
13 ౧౩ తరువాత దావీదు “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు “నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును” అన్నాడు.
És szólt Dávid az ifjúhoz, aki hírt mondott neki: Honnan való vagy? Mondta: Egy jövevény amáléki embernek vagyok a fia.
14 ౧౪ అందుకు దావీదు “భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?” అని
Ekkor szólt hozzá Dávid: Hogyan nem féltél kinyújtani kezedet, hogy elpusztítsad az Örökkévaló fölkentjét!
15 ౧౫ తన మనిషి ఒకణ్ణి పిలిచి “వెళ్లి వాణ్ణి చంపు” అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు.
Erre hívott Dávid egyet a legények közül és mondta: Lépj ide, támadj rá! Leütötte és meghalt.
16 ౧౬ “యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి” అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు.
És szólt hozzá Dávid: Véred a fejeden, mert saját szád vallott ellened, mondván: én öltem meg az Örökkévaló fölkentjét.
17 ౧౭ దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు.
Ekkor elmondta Dávid ezt a gyászdalt Sául fölött és fia Jónátán fölött.
18 ౧౮ యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది.
Mondta, hogy tanítsák Jehúda fiait az íjra; íme írva van az Igazak könyvében.
19 ౧౯ ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా నీ పర్వతాలపై మృతి చెందింది. బలవంతులు ఎలా పడిపోయారో గదా!
A dísz, oh Izrael, magaslatodon megölve! Mint estek el a vitézek!
20 ౨౦ ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి. అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.
Ne jelentsétek Gátban, hírül ne adjátok Askelón utcáin, hogy ne örvendjenek a filiszteusok leányai, ne ujjongjanak a körülmetéletlenek leányai!
21 ౨౧ గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక. పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.
Gilbóa hegyei, se harmat, se eső ne legyen rajtatok, se termékeny mezőség; mert ott vettetett el a vitézek pajzsa, Sáulnak pajzsa, nem kenve olajjal.
22 ౨౨ హతుల రక్తం ఒలికించకుండా, బలిష్టుల దేహాలనుండి యోనాతాను విల్లు మడమ తిప్పలేదు. ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు.
Elesettek vérétől, vitézek zsírjától Jónátán íja nem hátrált meg, és Sáulnak kardja üresen nem tért vissza.
23 ౨౩ సౌలూ యోనాతానూ తమ బతుకులో ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాలకంటే బలమైన వారు.
Sául és Jónátán a szeretni valók és kedvesek éltükben, még holtukban sem váltak el; sasoknál gyorsabbak voltak, oroszlánoknál bátrabbak.
24 ౨౪ ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి. అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు. మీకు బంగారు నగలు ఇచ్చాడు.
Izrael leányai, Sául fölött sírjatok, aki öltöztetett titeket bíborba és gyönyörűségbe, aki juttatott arany ékességet öltözéktekre.
25 ౨౫ యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు.
Mint estek el a vitézek a harc közepette! Jónátán, magaslatidon megölve!
26 ౨౬ నా సోదరుడా, యోనాతానూ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది.
Búban vagyok miattad, testvérem Jónátán, kedves voltál nekem nagyon, csodásabb volt nekem szereteted asszonyok szereteténél.
27 ౨౭ అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు.
Mint estek el a vitézek, és odavesztek a harc fegyveri!

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 1 >