< సమూయేలు~ రెండవ~ గ్రంథము 4 >

1 హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి విన్న సౌలు కుమారుడు భయపడ్డాడు. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ పాలు పోలేదు.
وقتی ایشبوشت پادشاه شنید که ابنیر در حبرون کشته شده است، هراسان گشت و تمام قومش نیز مضطرب شدند.
2 అయితే సౌలు కుమారుడి దగ్గర ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు. ఒకడి పేరు బయనా, రెండవవాడి పేరు రేకాబు. వీరిద్దరూ బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతు నివాసి అయిన రిమ్మోను కొడుకులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశంలో చేరిన ప్రాంతం.
ایشبوشت دو فرمانده سپاه داشت به نامهای بعنه و ریکاب. آنها پسران رمون بئیروتی از قبیلهٔ بنیامین بودند. (با اینکه اهالی بئیروت به جتایم فرار کرده و در آنجا ساکن شده بودند، ولی باز جزو قبیلهٔ بنیامین محسوب می‌شدند.)
3 అయితే బెయేరోతీయులు గిత్తయీముకు పారిపోయి ఇప్పటి వరకూ అక్కడే కాపురం ఉన్నారు.
4 సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకుని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు.
(در ضمن، شائول نوهٔ لنگی داشت به نام مفیبوشت که پسر یوناتان بود. هنگامی که شائول و یوناتان در جنگ یزرعیل کشته شدند، مفیبوشت پنج ساله بود. وقتی خبر مرگ شائول و یوناتان به پایتخت رسید، دایهٔ مفیبوشت، او را برداشت و فرار کرد. ولی هنگام فرار به زمین خورد و بچه از دستش افتاد و پایش لنگ شد.)
5 రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు.
یک روز ظهر، موقعی که ایشبوشت پادشاه خوابیده بود، ریکاب و بعنه وارد خانهٔ او شدند.
6 గోదుమలు తీసుకువచ్చేవారి వేషం వేసుకుని ఇంట్లోకి వెళ్లి, ఇష్బోషెతు పడక గదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతణ్ణి కడుపులో పొడిచి చంపివేసి, అతని తల నరికి దాన్ని తీసుకుని తప్పించుకుని పారిపోయారు.
آنها به بهانهٔ گرفتن یک کیسه گندم به کاخ او آمدند و مخفیانه به اتاق پادشاه رفتند. سپس او را کشته، سرش را از تنش جدا کردند و آن را با خود برداشته، از راه بیابان گریختند. آنها تمام شب در راه بودند
7 రాత్రి అంతా ఎడారి గుండా పరుగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తల తీసుకువచ్చారు. వారు “దయచేసి విను.
8 నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇష్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని, రాజువైన నీ తరపున సౌలుకు, అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు” అని చెప్పారు.
تا به حبرون رسیدند. ریکاب و بعنه سر بریده شدهٔ ایشبوشت را به داوود تقدیم کرده، گفتند: «این سر ایشبوشت، پسر دشمنت شائول است که می‌خواست تو را بکشد. امروز خداوند انتقام تو را از شائول و تمام خاندان او گرفته است!»
9 అప్పుడు దావీదు బెయేరోతీ నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో ఇలా చెప్పాడు,
اما داوود جواب داد: «به خداوند زنده که مرا از دست دشمنانم نجات داد، قسم
10 ౧౦ “మంచి కబురు తెస్తున్నానని భావించి ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు.
که من آن شخصی را که خبر کشته شدن شائول را به صقلغ آورد و گمان می‌کرد که مژده می‌آورد، کشتم. آن مژدگانی‌ای بود که به او دادم.
11 ౧౧ వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచి పెట్టకుండా ఉంటానా?
حال، آیا سزای مردان شروری که شخص بی‌گناهی را در خانهٔ خود و در رختخوابش به قتل رسانده‌اند، کمتر از این باید باشد؟ بدانید که شما را نیز خواهم کشت.»
12 ౧౨ అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను” అని చెప్పి, దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరినీ చంపి వారి చేతులు, కాళ్లను నరికివేసి, వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.
بعد داوود به افرادش دستور داد که هر دو را بکشند. پس آنها را کشتند و دستها و پاهایشان را بریده، بدنهایشان را در کنار برکهٔ حبرون به دار آویختند؛ اما سر ایشبوشت را گرفته، در قبر ابنیر در حبرون دفن کردند.

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 4 >