< సమూయేలు~ రెండవ~ గ్రంథము 3 >
1 ౧ సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది.
Un karš starp Saula namu un Dāvida namu vilcinājās. Bet Dāvids palika jo dienas jo spēcīgāks, un Saula nams jo dienas jo vājāks.
2 ౨ హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు.
Un Dāvidam Hebronē piedzima dēli: viņa pirmdzimtais bija Ammons, no Aķinoamas, tās Jezreēlietes.
3 ౩ రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు. మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు.
Un viņa otrs bija Ķileabs no Abigaīles, Nābala sievas, no Karmeļa. Un trešais Absaloms, no Maākas, Talmaja, Gešuras ķēniņa, meitas.
4 ౪ నాలుగవ వాడు అదోనీయా హగ్గీతుకు పుట్టాడు. అయిదవ వాడు షెఫట్య అబీటలుకు పుట్టాడు.
Un ceturtais Adonijus, Aģitas dēls. Un piektais Šefatijus, Abitalas dēls.
5 ౫ ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు.
Un sestais Jetreams no Eglas, Dāvida sievas. Šie dzima Dāvidam Hebronē.
6 ౬ సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు.
Kamēr nu karš bija starp Saula namu un Dāvida namu, tad Abners stipri turējās pie Saula nama.
7 ౭ రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు “నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు” అని అబ్నేరును ప్రశ్నించాడు.
Un Saulam bija lieka sieva bijusi, Ricpa vārdā, Ajas meita. Un (Išbošets) sacīja uz Abneru: kāpēc tu guli pie mana tēva liekas sievas?
8 ౮ ఇష్బోషెతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు “నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికీ, అతని సహోదరులకూ, అతని స్నేహితులకూ నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి, ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా?
Tad Abners ļoti apskaitās par Išbošeta vārdiem un sacīja: vai tad es esmu suņa galva, kas pie Jūda turas? Tava tēva Saula namam, viņa brāļiem un viņa draugiem es šodien parādu žēlastību un tevi neesmu nodevis Dāvida rokā, un tu man šodien noziegumu pārmeti tās sievas dēļ!
9 ౯ యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే
Lai Dievs Abneram šā un tā dara, ja es tā nedarīšu Dāvidam, kā Tas Kungs viņam ir zvērējis,
10 ౧౦ దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడు గాక. సౌలు కుటుంబం వారి చేతిలోనుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను” అన్నాడు.
Noceldams valstību no Saula nama un uzceldams Dāvida goda krēslu pār Israēli un pār Jūdu no Dana līdz Bēršebai.
11 ౧౧ అబ్నేరు మాటలకు భయపడిన ఇష్బోషెతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు.
Un tas Abneram ne vārda vairs nevarēja atbildēt, tā tas viņu bijās.
12 ౧౨ అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి “ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను” అని కబురు పంపాడు. అప్పుడు దావీదు “మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను.
Un Abners sūtīja savā vietā vēstnešus pie Dāvida un sacīja: kam tā zeme pieder? Un sacīja: deri derību ar mani, redzi, tad mana roka būs ar tevi, atgriezt visu Israēli pie tevis.
13 ౧౩ అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలును నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే నీకు నా దర్శనం దొరకదు” అని జవాబిచ్చాడు.
Un viņš sacīja: labi, es ar tevi derēšu derību, bet vienu lietu es prasu no tevis, proti, tev manu vaigu nebūs redzēt, pirms tu man nebūsi atvedis Mikali, Saula meitu, kad tu nāksi redzēt manu vaigu.
14 ౧౪ దావీదు సౌలు కొడుకు ఇష్బోషెతు దగ్గరికి తన మనుషులను పంపించి “ఫిలిష్తీయుల్లో వందమంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకొన్న మీకాలును నాకు అప్పగించాలి” అని చెప్పమన్నాడు.
Un Dāvids sūtīja vēstnešus pie Išbošeta, Saula dēla, sacīdams: dod man Mikali, manu sievu, ko esmu precējies ar simts Fīlistu priekšādām.
15 ౧౫ మీకాలు భర్త, లాయీషు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకు వచ్చేందుకు ఇష్బోషెతు తన మనుషులను పంపించాడు.
Un Išbošets nosūtīja un to ņēma no vīra, no Paltiēļa, Laīsa dēla.
16 ౧౬ ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు “నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో” అని చెప్పగానే అతడు వెళ్లిపోయాడు.
Un viņas vīrs gāja viņai līdz, un iedams raudāja viņai pakaļ līdz Bakurim. Tad Abners uz to sacīja: ej, griezies atpakaļ. Tad viņš griezās atpakaļ.
17 ౧౭ అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి “దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకు ముందు కోరుకున్నారు గదా?
Un Abners bija runājis ar Israēla vecajiem un sacījis: jūs citkārt Dāvidu esat meklējuši sev par ķēniņu.
18 ౧౮ ‘నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను’ అని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాడు కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి” అని వారితో చెప్పాడు.
Tad dariet nu to, jo Tas Kungs uz Dāvidu ir runājis un sacījis: caur Sava kalpa Dāvida roku Es izpestīšu Savus Israēla ļaudis no Fīlistu rokas un no visu viņu ienaidnieku rokas.
19 ౧౯ అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు.
Tāpat Abners bija runājis priekš Benjamina ausīm, un Abners nogāja arī priekš Dāvida ausīm Hebronē runāt visu, kas Israēlim un visam Benjamina namam labi patika.
20 ౨౦ అందుకోసం అబ్నేరు ఇరవైమందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకి వచ్చాడు. దావీదు అబ్నేరుకు, అతని మనుషులకు విందు చేయించాడు.
Un Abners nāca pie Dāvida uz Hebroni un divdesmit vīri viņam līdz, un Dāvids Abneram un tiem vīriem, kas viņam bija līdz, taisīja dzīres.
21 ౨౧ అప్పుడు అబ్నేరు “నేను వెళ్లి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి, వారు నీతో ఒప్పందం చేసేలా, నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్నదాని అంతటినీ పాలించేలా చేస్తాను” అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్లిపోయాడు.
Tad Abners sacīja uz Dāvidu: es celšos un iešu un sapulcināšu visu Israēli pie sava kunga, tā ķēniņa, ka tie ar tevi der derību; tad tu varēsi valdīt pār visu, kas tavai dvēselei patīk. Tā Dāvids atlaida Abneru, un tas aizgāja ar mieru.
22 ౨౨ దావీదు సేవకులు, యోవాబు యుద్ధంలో పెద్ద మొత్తంలో దోచుకున్న దోపుడు సొమ్ము తీసుకు వచ్చే సమయానికి అబ్నేరు హెబ్రోనులో దావీదు దగ్గర లేడు. ఆప్పటికే దావీదు దగ్గర అనుమతి తీసుకుని అతడు శాంతికరంగా వెళ్ళిపోయాడు.
Un redzi, Dāvida kalpi un Joabs griezās atpakaļ no sirošanas un pārnesa lielu laupījumu. Un Abners nebija vairs pie Dāvida Hebronē, bet šis to bija atlaidis, ka tas ar mieru bija aizgājis.
23 ౨౩ అయితే యోవాబు, తన సైన్యంతో తిరిగి వచ్చినప్పుడు నేరు కొడుకు అబ్నేరు రాజు దగ్గరికి వచ్చాడనీ, రాజు అతనికి ఆతిథ్యమిచ్చి పంపాడనీ, అతడు శాంతియుతంగా తిరిగి వెళ్ళాడనీ తెలిసికున్నాడు.
Kad nu Joabs un viss tas spēks ar viņu pārnāca, tad Joabam teica un sacīja: Abners, Nera dēls, ir nācis pie ķēniņa un tas viņu ir atlaidis, ka viņš ar mieru aizgājis.
24 ౨౪ అతడు రాజు దగ్గరికి వచ్చి “రాజా విను, నువ్వు చేసిన పనేంటి? అబ్నేరు నీ దగ్గరికి వచ్చినప్పుడు అతణ్ణి ఎందుకు తిరిగి వెళ్లనిచ్చావు?
Tad Joabs gāja pie ķēniņa un sacīja: ko tu esi darījis? Redzi, Abners pie tevis ir nācis, - kāpēc tu viņu esi atlaidis, ka tas aizgājis?
25 ౨౫ నేరు కొడుకు అబ్నేరు గురించి నీకు తెలీదా? నిన్ను మోసం చేసి నీ ప్రణాళికలూ, నువ్వు చేసే పనులూ తెలుసుకొనేందుకు అతడు వచ్చాడు” అని అన్నాడు.
Tu gan Abneru, Nera dēlu, pazīsti, ka tas ir nācis tevi pierunāt, ka viņš vērā liktu tavu iziešanu un ieiešanu un izprastu visu, ko tu dari.
26 ౨౬ అతడు దావీదు దగ్గర నుండి బయలుదేరి అబ్నేరును వెనక్కి పిలిపించడానికి మనుషులను పంపాడు. వారు వెళ్లి సిరా అనే బావి దగ్గర నుండి అతణ్ణి వెనక్కి తీసుకు వచ్చారు. అతడు తిరిగి వచ్చిన సంగతి దావీదుకు తెలీదు.
Un Joabs izgāja no Dāvida un sūtīja vēstnešus Abneram pakaļ, kas viņu atkal atveda no Ziras akas; bet Dāvids par to nezināja.
27 ౨౭ అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు “విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి” అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు.
Kad nu Abners uz Hebroni nāca atpakaļ, tad Joabs viņu veda vārtos, klusu ar viņu parunāt, un tur tas viņam dūra vēderā, ka tas nomira, par viņa brāļa Azaēļa asinīm.
28 ౨౮ ఆ తరువాత ఈ సంగతి దావీదుకు తెలిసి అతడు ఈ విధంగా అనుకున్నాడు “నేనూ, నా రాజ్యమూ నేరు కొడుకు అబ్నేరు ప్రాణం తీసిన విషయంలో యెహోవా దృష్టికి ఎప్పటికీ నిరపరాధులమే.
Kad nu Dāvids to pēcak dzirdēja, tad viņš sacīja: es esmu nenoziedzīgs un mana valstība Tā Kunga priekšā mūžīgi pie Abnera, Nera dēla, asinīm.
29 ౨౯ ఈ దోషం యోవాబు మీదా, అతని తండ్రి సంతానమంతటి మీదా నిలుస్తుంది గాక. యోవాబు సంతానంలో గాయాలు ఉన్నవారు, కుష్టురోగులు, ముసలివారు, కత్తి చేత హతమయ్యేవారు, తిండి లేనివారు తప్పక ఉంటారు గాక” అన్నాడు.
Lai tās nāk uz Joaba galvu un uz visu viņa tēva namu, un lai Joaba namā netrūkst, kam izpil un kas ir spitālīgs un kas pie spieķa staigā un kas caur zobenu krīt un kam maizes trūkst.
30 ౩౦ ఆ విధంగా యోవాబు, అతని సోదరుడు అబీషై, గిబియోను యుద్ధంలో అబ్నేరు తమ సోదరుడు అశాహేలును చంపిన దానికి ప్రతీకారం తీర్చుకున్నారు.
Tā Joabs un Abizajus, viņa brālis, nokāva Abneru par to, ka tas Azaēli, viņu brāli, bija nokāvis kaujā pie Gibeonas.
31 ౩౧ దావీదు “మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవం ముందు నడుస్తూ విలపించండి” అని యోవాబుకు, అతనితో ఉన్నవారికందరికీ ఆజ్ఞ ఇచ్చాడు.
Tad Dāvids sacīja uz Joabu un uz visiem ļaudīm, kas pie viņa bija: saplēšat savas drēbes un apvelciet maisus un žēlojaties Abnera pēc. Un ķēniņš Dāvids gāja bērēm pakaļ.
32 ౩౨ రాజు కూడా స్వయంగా పాడె వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టినప్పుడు రాజు అబ్నేరు సమాధి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు. అక్కడ సమకూడిన వారంతా ఏడ్చారు.
Kad nu Abneru apraka Hebronē, tad ķēniņš pacēla savu balsi un raudāja pie Abnera kapa, un visi ļaudis raudāja.
33 ౩౩ రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు,
Un ķēniņš žēlojās par Abneru un sacīja: vai Abneram bija jāmirst, kā mirst nelietis?
34 ౩౪ “అబ్నేరూ, నీచుడైన ఒక మనిషి చనిపోయినట్టు నువ్వు చనిపోయావే. నీ చేతులకు గాయాలు లేకుండా, నీ కాళ్లకు సంకెళ్లు వేయకుండా, అక్రమం చేసేవాడి ముందు ఒకడు పడినట్టు నువ్వు పడిపోయావు గదా.” రాజు ఈ విధంగా గీతం గొంతెత్తి పాడినప్పుడు ప్రజలంతా విని, ఇంకా ఎక్కువగా ఏడ్చారు.
Tavas rokas nebija saistītas nedz tavas kājas liktas vara pinekļos; tu esi kritis, kā krīt caur netikliem. Tad visi ļaudis vēl vairāk par to raudāja.
35 ౩౫ ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు “సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక” అని ఒట్టు పెట్టుకున్నాడు.
Un visi ļaudis nāca aicināt, lai Dāvids maizes ēstu, kamēr vēl bija dienas gaisma; tad Dāvids zvērēja un sacīja: lai Dievs man šā un tā dara, ja es baudīšu maizes vai cita kā, pirms saule noiet.
36 ౩౬ ప్రజలంతా ఈ విషయం తెలుసుకుని సంతోషించారు. ఇప్పటి వరకూ రాజు చేసినదంతా ప్రజల దృష్టికి అంగీకారమైనట్టు ఇది కూడా వారి దృష్టికి అంగీకారమయ్యింది.
Un visi ļaudis to dzirdēja, un tas tiem labi patika; viss ko ķēniņš darīja, tas visiem ļaudīm labi patika.
37 ౩౭ నేరు కొడుకు అబ్నేరు హత్య రాజు పథకం ప్రకారం చేయించింది కాదని ఆ రోజున ఇశ్రాయేలు వారికందరికీ తెలిసింది.
Un visi ļaudis un viss Israēls noprata tai dienā, ka tas nebija nācis no ķēniņa, ka Abners, Nera dēls, bija nokauts.
38 ౩౮ తరువాత రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఈ రోజు చనిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ముఖ్యమైన వాడనీ ప్రధానుల్లో ఒకడనీ మీకు తెలిసే ఉంటుంది.
Un ķēniņš sacīja uz saviem kalpiem: vai nezināt, ka šodien lielskungs un augsts vīrs ir kritis iekš Israēla?
39 ౩౯ పట్టాభిషేకం అయిన నేను ఈ రోజు బలం లేనివాడినయ్యాను. సెరూయా కొడులైన ఈ వ్యక్తులు నాకంటే బలమైనవారు. వారు చేసిన దుష్టకార్యాలను బట్టి వారు కీడు చేసిన ప్రకారం యెహోవా వారికి ప్రతీకారం చేస్తాడు గాక.”
Bet es vēl šodien esmu par jaunu, nule par ķēniņu svaidīts. Un šie vīri, Cerujas dēli, man ir par stipriem; Tas Kungs lai atmaksā tiem ļauna darītājiem pēc viņu ļaundarīšanas.