< సమూయేలు~ రెండవ~ గ్రంథము 24 >
1 ౧ యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. “వెళ్లి ఇశ్రాయేలువారి, యూదావారి, జనాభా లెక్కలు తీసుకో” అని అదేశించాడు.
Bio, Awurade abufuw baa Israel so nti, ɔhyɛɛ Dawid sɛ ɔmfa nnipakan so nhaw wɔn a wɔwɔ Israel ne Yuda nyinaa. Awurade see Dawid sɛ, “Kɔ na kɔkan Israelfo ne Yudafo nyinaa.”
2 ౨ అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు “యుద్దానికి పోగల మనుషులు ఎంత మంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయేర్షెబా దాకా తిరిగిచూసి, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వారిని లెక్కించు” అని ఆజ్ఞాపించాడు.
Enti ɔhene no ka kyerɛɛ ne sahene Yoab se, “Kan nnipa a wɔwɔ asase yi so nyinaa, efi Dan a ɛwɔ atifi fam, de besi Beer-Seba a ɛwɔ anafo fam, na ama mahu nnipa dodow a wɔwɔ ha.”
3 ౩ అందుకు యోవాబు “నా ప్రభువు, రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను నూరంతలు ఎక్కువ చేయు గాక. నా ప్రభువు, రాజు అయిన నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది?” అన్నాడు.
Na Yoab buaa ɔhene no se, “Awurade mma wo ntena ase kosi sɛ nnipa a wɔwɔ wʼahenni yi mu ase bɛterɛw mmɔho ɔha. Na adɛn nti na wopɛ sɛ woyɛ eyi?”
4 ౪ అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది గనక యోవాబు, సైన్యాధిపతులు ఇశ్రాయేలీయుల జన సంఖ్య చూడడానికి రాజు సముఖం నుండి బయలు దేరారు.
Na ɔhene no hyɛɛ no ketee sɛ, wɔnkan nnipa nti, Yoab ne nʼadwumayɛfo kɔkan nnipa a wɔwɔ Israel.
5 ౫ వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆపైన వారు గాదు ప్రాంతం గుండా యాజేరు చేరుకున్నారు.
Nea edi kan no, wotwaa Yordan kɔtenaa Aroer, kurow a ɛwɔ obon no anafo a ɛkyerɛ Gad no. Afei, wɔkɔɔ Yaser,
6 ౬ అక్కడ నుండి గిలాదుకు, తహ్తింహోద్షీ ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు.
toaa so koduu Gilead a ɛwɔ Tatim-hodsi, toaa so kɔɔ Dan Yaan ne Sidon fa mu.
7 ౭ అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికీ, హివ్వీయుల, కనానీయుల పట్టణాలకూ చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయేర్షెబా వరకూ సంచరించారు.
Afei, wɔbaa Tiro aban mu ne Hewifo ne Kanaanfo nkuropɔn nyinaa mu. Wɔkɔɔ Yuda anafo, koduu Beer-Seba de wiei.
8 ౮ ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు.
Wowurawuraa asase no nyinaa so, de asram akron ne nnafua aduonu wiee nnipakan no, san kɔɔ Yerusalem.
9 ౯ అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు.
Yoab de ne nnipa dodow a wonyae brɛɛ ɔhene no. Na mmarima a wɔadu sogyadi mfe so wɔ Israel no dodow yɛ mpem ahanwɔtwe, na mpem ahannum nso wɔ Yuda.
10 ౧౦ జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.
Dawid kan nnipa no nyinaa wiei no, nʼahonim buu no fɔ, nti ɔka kyerɛɛ Awurade se, “Nea meyɛe yi nti, mayɛ bɔne. Enti Awurade, mesrɛ wo, yi saa afɔbu yi fi wo somfo so. Mayɛ nkwaseade.”
11 ౧౧ తెల్లవారి, దావీదు నిద్ర లేచినప్పుడు దావీదుకు దీర్ఘ దర్శి, ప్రవక్త అయిన గాదుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై,
Ade kyee no, Awurade asɛm baa odiyifo Gad a ɔyɛ Dawid ɔdehufo nkyɛn se:
12 ౧౨ “నీవు పోయి దావీదుతో ఇలా చెప్పు. ‘మూడు విషయాలు నీ ముందుంచుతున్నాను. వాటిలో ఒకటి కోరుకో. దాన్ని నీపైకి రప్పిస్తాను.’”
“Kɔka kyerɛ Dawid sɛ, Sɛnea Awurade se ni: ‘Mede nsɛm abiɛsa reto wʼanim. Yi mu baako na menyɛ ntia wo.’”
13 ౧౩ కాబట్టి గాదు దావీదు దగ్గరికి వచ్చి సంగతి తెలిపాడు. “నీవు నీ దేశంలో మూడేళ్ళు కరువు కలగడం కోరుకుంటావా, నీ శత్రువు నిన్ను తరుముతుంటే మూడునెలల పాటు పారిపోడానికి ఒప్పుకుంటావా, లేక నీ దేశంలో మూడు రోజులు తెగులు చెలరేగడానికి ఒప్పుకొంటావా? ఈ విషయం ఆలోచించి నన్ను పంపిన దేవునికి ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించు” అన్నాడు.
Enti Gad kɔɔ Dawid nkyɛn kobisaa no se, “Ɔkɔm mmra wʼasase yi so mfe abiɛsa ana? Anaa, atamfo a wogu wo so no wubeguan wɔn asram abiɛsa? Anaa, ɔyaredɔm mmra wo man yi mu nnansa? Enti afei, dwene ho yiye, na ma minhu mmuae a memfa nkɔma Awurade.”
14 ౧౪ అందుకు దావీదు “గొప్ప చిక్కులో పడ్డాను. యెహోవా కరుణా సంపన్నుడు గనక మనుషుల చేతిలో పడడం కంటే యెహోవా చేతిలోనే పడదాము” అని గాదుతో అన్నాడు.
Dawid ka kyerɛɛ Gad se, “Yɛwɔ ahohiahia mu. Momma yɛmfa yɛn ho nhyɛ Awurade nsa, efisɛ nʼadɔe dɔɔso; nanso mma me nkɔtɔ nnipa nsam.”
15 ౧౫ కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి ఘోర వ్యాధి రప్పించాడు. ఉదయం మొదలుకుని నియామక కాలం వరకూ అది చెలరేగింది. ఫలితంగా దాను నుండి బెయేర్షెబా వరకూ 70 వేలమంది మరణించారు.
Enti Awurade tow ɔyaredɔm guu Israel so anɔpa no ma edii nnansa. Na nnipa mpem aduɔson fii Dan kosi Beer-Seba wuwui.
16 ౧౬ దూత యెరూషలేమును నాశనం చెయ్యడానికి తన చెయ్యి చాపగా, యెహోవా ఆ అరిష్టం విషయం పరితపించాడు. ఆయన నాశన దూతకు “ఇక చాలు, నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన అరౌనాకు చెందిన కళ్ళం దగ్గర ఉన్నాడు.
Bere a ɔbɔfo no reyɛ ahoboa akɔsɛe Yerusalem no, Awurade nuu ne ho wɔ asɛm no ho, na ɔka kyerɛɛ no se, “Eye! Gyae.” Saa bere no na Awurade bɔfo no adu Yebusini Arauna awiporowbea hɔ.
17 ౧౭ ప్రజలను నాశనం చేసిన ఆ దూతను చూసి దావీదు యెహోవాను ఇలా ప్రార్థించాడు. “పాపం చేసిన వాణ్ని నేను గదా. దుర్మార్గంగా ప్రవర్తించిన వాణ్ని నేను గదా. గొర్రెలవంటి ఈ ప్రజలేమి చేసారు? నన్నూ నా తండ్రి కుటుంబాన్నీ శిక్షించు.”
Bere a Dawid huu ɔbɔfo no, ɔka kyerɛɛ Awurade se, “Me na mayɛ bɔne. Eyinom de wonnim ho hwee, dɛn na wɔayɛ? Ma wo bɔfo nsɛe me ne me fifo.”
18 ౧౮ ఆ రోజున గాదు దావీదు దగ్గరికి వచ్చి “నీవు వెళ్లి యెబూసీయుడైన అరౌనా కళ్ళంలో యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించు” అని అతనితో చెప్పాడు.
Da no, Gad kɔɔ Dawid nkyɛn kɔka kyerɛɛ no se, “Kɔ na kosi afɔremuka ma Awurade wɔ Yebusini Arauna awiporowbea hɔ.”
19 ౧౯ దావీదు గాదు ద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలు దేరాడు.
Na Dawid kɔyɛɛ nea Awurade hyɛɛ no sɛ ɔnyɛ no.
20 ౨౦ రాజు, అతని పరివారం తనవైపు రావడం అరౌనా చూసి ఎదురు వెళ్లి రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి “నా యజమానీ, రాజూ అయిన నీవు నీ దాసుడైన నా దగ్గరికి వచ్చిన కారణమేమిటి?” అని అడిగాడు.
Bere a Arauna huu sɛ ɔhene ne ne mmarima reba no, opue bɛkotow ɔhene, de nʼanim butuw fam.
21 ౨౧ దావీదు “ఈ కళ్ళం నీ దగ్గర కొని యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించాలని వచ్చాను. అ విధంగా ఈ తెగులు ప్రజలనుండి తొలిగి పోతుంది” అన్నాడు.
Arauna bisae se, “Adɛn nti na woaba, me wura?” Dawid buae se, “Merebɛtɔ awiporowbea hɔ, na masi afɔremuka wɔ hɔ ama Awurade, sɛnea Awurade bɛma ɔyaredɔm no agyae.”
22 ౨౨ అందుకు అరౌనా “నా యజమానీ రాజు అయిన నీవు నీకు ఏది కావాలో తీసుకో. నీకు అనుకూలమైనదేమిటో అది చెయ్యి. ఇదుగో, దహనబలి కోసం ఎడ్లు ఉన్నాయి. కట్టెలుగా ఈ నూర్చే కర్ర వస్తువులూ, ఎడ్ల కాడి పనికొస్తాయి.
Arauna ka kyerɛɛ Dawid se, “Me wura fa na fa yɛ nea wopɛ. Nantwi a wɔde bɛbɔ ɔhyew afɔre ni. Wubetumi de awiporowbea nnua ne nantwi mpamho nnua no ayɛ nnyina wɔ afɔremuka no so.
23 ౨౩ రాజా, యివన్నీ అరౌనా అనే నేను, రాజుకు ఇస్తున్నాను” అన్నాడు. “నీ దేవుడైన యెహోవా నీ మనవి వినుగాక” అని రాజుతో అన్నాడు.
Mede ne nyinaa bɛma wo, na mesrɛ se, Awurade, wo Nyankopɔn nnye afɔre yi.”
24 ౨౪ రాజు “నేను అలా తీసుకోను, ఖరీదు ఇచ్చి నీ దగ్గర కొంటాను. వెల ఇవ్వకుండా తీసుకున్న దాన్ని నా దేవుడైన యెహోవాకు దహనబలిగా అర్పించను” అని అరౌనాతో చెప్పి ఆ కళ్ళాన్నీ ఎడ్లనూ 50 తులాల వెండి ఇచ్చి కొన్నాడు.
Na ɔhene no buaa Arauna se, “Dabi da, mepɛ sɛ mɛtɔ, na merentumi mmɔ ɔhyew afɔre mma Awurade, me Nyankopɔn, a mammɔ ho ka biara.” Enti Dawid tuaa dwetɛ bɛyɛ gram ahannum aduoson anum de tɔɔ awiporowbea ne nantwi no.
25 ౨౫ అక్కడ దావీదు యెహోవా పేరున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. దేశం కోసం చేసిన ఆ విన్నపాలను యెహోవా అంగీకరించగా ఇశ్రాయేలీయులకు దాపురించిన ఆ తెగులు ఆగిపోయింది.
Dawid sii afɔremuka wɔ hɔ maa Awurade, na ɔbɔɔ ɔhyew afɔre ne asomdwoe afɔre hɔ. Na Awurade tiee ne mpaebɔ maa ɔyaredɔm no gyaee.