< సమూయేలు~ రెండవ~ గ్రంథము 23 >

1 దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
و این است سخنان آخر داود: «وحی داود بن یسا. و وحی مردی که بر مقام بلند ممتاز گردید، مسیح خدای یعقوب، و مغنی شیرین اسرائیل.۱
2 “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
روح خداوند به وسیله من متکلم شد و کلام او بر زبانم جاری گردید.۲
3 ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
خدای اسرائیل متکلم شد و صخره اسرائیل مراگفت: آنکه بر مردمان حکمرانی کند، عادل باشدو با خدا ترسی سلطنت نماید.۳
4 అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
و او خواهد بودمثل روشنایی صبح، وقتی که آفتاب طلوع نماید، یعنی صبح بی‌ابر، هنگامی که علف سبز از زمین می‌روید، به‌سبب درخشندگی بعد از باران.۴
5 నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
یقین خانه من با خدا چنین نیست. لیکن عهدجاودانی با من بسته است، که در همه‌چیز آراسته و مستحکم است. و تمامی نجات و تمامی مسرت من این است، هرچند آن را نمو نمی دهد.۵
6 ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
لیکن جمیع مردان بلیعال مثل خارهایند که دورانداخته می‌شوند. چونکه آنها را به‌دست نتوان گرفت.۶
7 ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.”
و کسی‌که ایشان را لمس نماید، می‌بایدبا آهن و نی نیزه مسلح شود. و ایشان در مسکن خود با آتش سوخته خواهند شد.»۷
8 దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.
و نامهای شجاعانی که داود داشت این است: یوشیب بشبت تحکمونی که سردار شالیشیم بودکه همان عدینو عصنی باشد که بر هشتصد نفرتاخت آورد و ایشان را در یک وقت کشت.۸
9 ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి
و بعد از او العازار بن دودو ابن اخوخی، یکی از آن سه مرد شجاع که با داود بودند، هنگامی که فلسطینیان را که در آنجا برای جنگ جمع شده، ومردان اسرائیل رفته بودند، به مقاتله طلبیدند.۹
10 ౧౦ అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.
واما او برخاسته، با فلسطینیان جنگ کرد تا دستش خسته شد و دستش به شمشیر چسبید و خداونددر آن روز، ظفر عظیمی داد، و قوم در عقب اوفقط برای غارت کردن برگشتند.۱۰
11 ౧౧ ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.
و بعد از او شمه بن آجی هراری بود وفلسطینیان، لشکری فراهم آوردند، در جایی که قطعه زمینی پر از عدس بود، و قوم از حضورفلسطینیان فرار می‌کردند.۱۱
12 ౧౨ అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.
آنگاه او در میان آن قطعه زمین ایستاد و آن را نگاه داشته، فلسطینیان را شکست داد و خداوند ظفر عظیمی داد.۱۲
13 ౧౩ ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.
و سه نفر از آن سی سردار فرود شده، نزدداود در وقت حصاد به مغاره عدلام آمدند، ولشکر فلسطینیان در وادی رفائیم اردو زده بودند.۱۳
14 ౧౪ దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.
و داود در آن وقت در ملاذ خویش بود و قراول فلسطینیان در بیت لحم.۱۴
15 ౧౫ దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు.
و داود خواهش نموده، گفت: «کاش کسی مرا از چاهی که نزددروازه بیت لحم است آب بنوشاند.»۱۵
16 ౧౬ ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి “యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.
پس آن سه مرد شجاع، لشکر فلسطینیان را از میان شکافته، آب را از چاهی که نزد دروازه بیت لحم است کشیده، برداشتند و آن را نزد داود آوردند، اما نخواست که آن را بنوشد و آن را به جهت خداوند ریخت.۱۶
17 ౧౭ వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు.
و گفت: «ای خداوند حاشا ازمن که این کار را بکنم، مگر این خون آن کسان نیست که به خطر جان خود رفتند؟» از این جهت نخواست که بنوشد. کاری که این سه مرد کردند، این است.۱۷
18 ౧౮ సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.
و ابیشای، برادر یوآب بن صرویه، سردارسه نفر بود و نیزه خود را بر سیصد نفر حرکت داده، ایشان را کشت و در میان آن سه نفر اسم یافت.۱۸
19 ౧౯ ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.
آیا از آن سه نفر مکرم تر نبود؟ پس سردار ایشان شد لیکن به سه نفر اول نرسید.۱۹
20 ౨౦ కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.
و بنایاهو ابن یهویاداع، پسر مردی شجاع قبصئیلی، که کارهای عظیم کرده بود، دو پسراریئیل موآبی را کشت و در روز برف به حفره‌ای فرود شده، شیری را بکشت.۲۰
21 ౨౧ ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.
و مرد خوش اندام مصری‌ای را کشت و آن مصری در دست خود نیزه‌ای داشت اما نزد وی با چوب دستی رفت و نیزه را از دست مصری ربود و وی را با نیزه خودش کشت.۲۱
22 ౨౨ ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.
و بنایاهو ابن یهویاداع این کارها را کرد و در میان آن سه مرد شجاع اسم یافت.۲۲
23 ౨౩ ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.
و از آن سی نفر مکرمتر شد لیکن به آن سه نفر اول نرسید و داود او را بر اهل مشورت خود گماشت.۲۳
24 ౨౪ ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,
و عسائیل برادر یوآب یکی از آن سی نفربود و الحانان بن دودوی بیت لحمی،۲۴
25 ౨౫ హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
و شمه حرودی و الیقای حرودی،۲۵
26 ౨౬ పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,
و حالص فلطی و عیرا ابن عقیش تقوعی،۲۶
27 ౨౭ అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
و ابیعزر عناتوتی ومبونای حوشاتی،۲۷
28 ౨౮ అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,
و صلمون اخوخی و مهرای نطوفاتی،۲۸
29 ౨౯ నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
و حالب بن بعنه نطوفاتی و اتای بن ریبای از جبعه بنی بنیامین،۲۹
30 ౩౦ పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,
و بنایای فرعاتونی و هدای از وادیهای جاعش،۳۰
31 ౩౧ అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
و ابوعلبون عرباتی و عزموت برحومی،۳۱
32 ౩౨ షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,
و الیحبای شعلبونی و از بنی یاشن یوناتان،۳۲
33 ౩౩ హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,
و شمه حراری و اخیام بن شارر اراری،۳۳
34 ౩౪ మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,
و الیفلط بن احسبای ابن معکاتی و الیعام بن اخیتوفل جیلونی،۳۴
35 ౩౫ కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,
وحصرای کرملی و فعرای اربی،۳۵
36 ౩౬ సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
و یجال بن ناتان از صوبه و بانی جادی،۳۶
37 ౩౭ అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
و صالق عمونی ونحرای بئیروتی که سلاحداران یوآب بن صرویه بودند،۳۷
38 ౩౮ ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
و عیرای یتری و جارب یتری،۳۸
39 ౩౯ హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.
واوریای حتی، که جمیع اینها سی و هفت نفربودند.۳۹

< సమూయేలు~ రెండవ~ గ్రంథము 23 >