< సమూయేలు~ రెండవ~ గ్రంథము 23 >
1 ౧ దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
He tah David kah olka, Jesse capa David kah hmailong olphong, Jakob Pathen loh a koelh tih sang la thoh hlang kah olphong, Israel kah laa ding ni.
2 ౨ “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
BOEIPA kah Mueihla he kai dongah cal tih, a ol te ka lai dongah om.
3 ౩ ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
Israel Pathen loh kai taengah a thui tih, “Israel lungpang tah hlang soah a dueng la aka taemrhai tih Pathen hinyahnah neh aka taem aka rhai la om.
4 ౪ అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
Mincang khosae khomik aka thoeng bangla, mincang khomai a om pawt dongah a aa bangla, khotlan hnukah diklai lamkah baelhing banghui ni.
5 ౫ నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
Ka imkhui he Pathen neh doda uh ngawn pawt cakhaw kumhal paipi tah kamah taengah ni a khueh. A cungkuem dongah rhong a tael tih ka daemnah cungkuem te a ngaithuen. Te dongah ka hue ngaih boeih te khaw cuen voel pawh.
6 ౬ ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
Tedae aka muen tah hling bangla a thaek banlak tih kut nen khaw lo voel pawh.
7 ౭ ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.”
Amih aka ben hlang long tah thi neh caai tueng khaw cung tih amah hmuen ah hmai neh a hoeh la a hoeh uh,” a ti.
8 ౮ దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు.
He rhoek he tah David kah hlangrhalh rhoek kah a ming ni. Takhemoni Joshebbashebeth tah boeilu la om tih anih tah amah kah caai neh yahuem sut. Caai nen te hlang ya rhet mai voei khat la a rhokpam sak.
9 ౯ ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి
Anih hnuk, anih hnukah tah Akhohi capa Dodo, Dodo capa Eleazar khaw David taengkah hlangrhalh pathum khuiah thum. Amih te a veet tih caemtloek ham Philisti rhoek a tingtun uh vaengah Israel hlang khaw a khuen uh.
10 ౧౦ అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు.
Te dongah anih te thoo tih a kut a kohnue neh cunghang dongah a kut rhap a khoom duela Philisti te a tloek. Te dongah BOEIPA loh amah khohnin ah loeihnah tanglue a saii pah tih pilnam khaw anih hnukah hnopai pit ham dawk la ha pawk uh.
11 ౧౧ ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.
Anih phoeiah Harari Agee capa Shammah a om vaengah Philisti tah mulhing bangla tingtun uh. Te vaengah lohma kah khamyai ah rhacik khawk om tapkhoeh. Pilnam tah Philisti mikhmuh lamloh rhaelrham coeng.
12 ౧౨ అప్పుడితడు ఆ పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు.
Te vaengah khamyai bangli ah pai tih pilnam te a huul. Philisti te a ngawn vaengah BOEIPA loh loeihnah tanglue a saii pah.
13 ౧౩ ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.
A lu sawmthum pathum khuikah sawmthum te suntla uh tih cangah vaengah Adullam lungko kah David taengla pawk uh. Te vaengah Philisti mulhing tah Rephaim kol ah rhaeh pueng.
14 ౧౪ దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.
Te vaengah David te rhalvong khuiah om tih Philisti rhaltawt hmuen tah Bethlehem ah om van.
15 ౧౫ దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు.
David loh vongka kah Bethlehem tuito tui ke a ngaidam tih, “U long nim kai n'tul lah ve,” a ti.
16 ౧౬ ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు ఆ నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో అ నీళ్ళు పారబోసి “యెహోవా, ఈ నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.
Te dongah hlangrhalh pathum loh Philisti kah rhaehhmuen te a va uh tih vongka kah Bethlehem tuito tui a than uh. Te phoeiah a khuen uh tih David taengla a pawk puei uh. Tedae a ok ham huem pawt tih BOEIPA hmaiah a hawk.
17 ౧౭ వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. ఈ నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. ఆ ముగ్గురు మహావీరులు ఈ పరాక్రమ కార్యాలు చేశారు.
Te vaengah, “He ka saii ham kai lamkah tah savisava BOEIPA, a hinglu aka caeh puei hlang rhoek kah a thii a? a ti tih ok ham huem pawh. Hlangrhalh pathum long khaw te tlam te ni a saii uh.
18 ౧౮ సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ఈ ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ఆ ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.
Zeruiah capa Joab mana Abishai tah pathum kah a lu la om. Anih loh a caai te a haeng tih ya thum a rhokpam sak. Te dongah anih tah pathum lakah a ming om.
19 ౧౯ ఇతడు ఆ ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ ఆ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు.
Pathum lakah a thangpom het a? Te dongah amih taengah mangpa la om cakhaw pathum te a pha moenih.
20 ౨౦ కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.
Kabzeel lamkah Jehoiada capa Benaiah tah hlangtang capa, tatthai neh a bisai khaw khuet. Anih loh Moab kah sathueng hlang panit te a ngawn. Te phoeiah anih te suntla tih vuel hla dongah vaam kah sathueng khui ah aka om sathueng te a ngawn.
21 ౨౧ ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఈ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.
Anih loh Egypt hlang tah a mueimae hlang aka then khaw a ngawn bal. Egypt kut dongah caai om dae a conghol neh a suntlak thil. Te phoeiah Egypt kut lamkah caai te a rhawth pah tih amah caai neh amah te a ngawn.
22 ౨౨ ఈ పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ఆ ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.
Te te a saii dongah Jehoiada capa Benaiah tah hlangrhalh pathum dongah a ming thum.
23 ౨౩ ఆ ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు.
Sawmthum lakah a thangpom dongah pathum taengah thum sak voel pawt tih anih te David amah kah a taengom la a khueh.
24 ౨౪ ఆ ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,
Sawmthum khuiah Joab mana Asahel neh Bethlehem kah Dodo capa Elhanan,
25 ౨౫ హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
Kharodi Shamah neh Kharodi Elika,
26 ౨౬ పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,
Palti Helez neh Tekoa Ikkesh capa Ira,
27 ౨౭ అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
Anatoth kah Abiezer neh Khushathi Mebunnai,
28 ౨౮ అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,
Akhohi Zalmon neh Netophah Maharai,
29 ౨౯ నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
Netophah Baanah capa Heled, Benjamin koca rhoek kah khohmuen Gibeah kah Ribai capa Ithai,
30 ౩౦ పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,
Pirathon capa Benaiah, Gaash soklong lamkah Hiddai,
31 ౩౧ అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
Arbahi Abialbon neh Barhum Azmaveth,
32 ౩౨ షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,
Shaalbin Eliaba neh Jashen koca rhoek lamkah Jonathan,
33 ౩౩ హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,
Harari Shammah, Harari Sharar capa Ahiam,
34 ౩౪ మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,
Maakathi koca kah Ahasbai capa Eliphelet, Giloh Ahithophel capa Eliam,
35 ౩౫ కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,
Karmel Hezro neh Arab Paarai,
36 ౩౬ సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
Zobah lamkah Nathan capa Igal, Gad Bani,
37 ౩౭ అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
Ammoni Zelek, Zeruiah capa Joab kah hno phuei Beeroth Naharai,
38 ౩౮ ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
Yitha Ira neh Yitha Gareb,
39 ౩౯ హిత్తీయుడైన ఊరియా. ఈ కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు.
Khitti Uriah neh tun ah sawmthum parhih louh.